Siddhivinayak Mandir laddu: మన దేశ ఆర్ధిక రాజధాని ముంబైలోని సిద్ది వినాయక స్వామి ఆలయ లడ్డూలపై ఎలుకలు పిల్లలకు జన్మనివ్వడం ఇపుడు వివాదానికి తావిస్తోంది. అంతేకాదు ఆలయంలోని ప్రసాద స్వచ్ఛతపై అనుమానాలు రేగేలా చేస్తోంది. ఇప్పటికే ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తిరుమల తిరుపతి లడ్డూలో వాడే ఆవు నెయ్యిలో జంతువుల అవశేషాలతో పాటు వాటి కొవ్వులు ఉన్నాయన్న విషయం బయటకు రావడంతో ఈ ఇష్యూ తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా సంచలనం రేపుతుంది. తాజాగా ముంబైలోని సిద్ది వినాయక స్వామి దేవాలయం ఆలయ ప్రసాదంలో ఎలుక పిల్లలు కనిపించాయి.
దీంతో భక్తులు కూడా ఇదేం ఘోరం.. లడ్డూ ప్రసాదంపై పిల్లలు ఏంటి అనే ప్రశ్నలు భక్తులు వేస్తున్నారు. వినాయకుడి వాహనం ఎలుక కాబట్టి ఆలయంలో ఎలుకలను ఏమి అనరనే వాదన కూడా వినిపిస్తుంది. ఇది ఆలయ అధికారుల నిర్లక్ష్యం కారణంగా జరిగిందా.. ? కాకతాళీయంగా జరిగిందా అనేది చూడాలి. మొత్తంగా గుళ్లో భక్తులకు పంచి పట్టే ప్రసాదాల స్వచ్ఛతపై ఈ సంఘటనలు అనుమానాలు రేగేలా చేస్తున్నాయి. తాజాగా సిద్ది వినాయకఆలయంలోని లడ్డూలపై ఎలుకల పిల్లలు కనిపిస్తున్ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది.
ముంబైలోని ప్రసిద్ధ శ్రీ సిద్ధివినాయక దేవాలయంలో కొన్ని షాకింగ్ వీడియో చిత్రాలు భక్తులను భయ భ్రాంతులకు గురి చేస్తున్నాయి. ఎన్‌డిటివి కథనం ప్రకారం, ఆలయంలోని మహా ప్రసాదంలో ఎలుకకు సంబంధించిన పిల్లలు కనిపిస్తున్నాయి. ఈ ఫొటోలపై వివరణ అడగగా.. ఆలయ ట్రస్టు కార్యదర్శి వీణా పాటిల్ ఈ ఫొటోలు సిద్ది వినాయక దేవాలయానికి సంబంధించినవి కావని చెప్పుకొచ్చారు.
అయితే... సామాజిక మాద్యమాల్లో వైరల్ అవుతున్న వీడియో పై సమగ్ర దర్యాప్తు జరుపుతామన్నారు. సిద్ది వినాయక ఆలయంలో ప్రసాదం కోసం ప్రతిరోజూ 50 వేల లడ్డూలు తయారు చేస్తారు. ఒక్కో ప్రసాదం ప్యాకెట్‌లో 50 గ్రాముల రెండు లడ్డూలు భక్తుల కోసం అందుబాటులో ఉంచుతారు. ఇక లడ్డూలలో ఉపయోగించే పదార్థాలు కూడా ల్యాబ్ టెస్ట్ చేసిన తర్వాత కానీ ఉపయోగించరు. తాజాగా సిద్ధి వినాయక ఆలయంలో లడ్డూలలో ఎలుకల పిల్లలకు సంబంధించిన చిత్రాలు కనిపించడంతో, ఆలయానికి సంబంధించిన పరిశుభ్రతతో పాటు ప్రసాదం క్వాలిటీపై పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఇదీ చదవండి: ఎన్టీఆర్ ఇంటిని చూశారా.. బృందావనాన్ని మించిన తారక్ ఇల్లు..!
ఇదీ చదవండి: మహాలయ పక్షంలో ఏ తిథి రోజు శ్రార్ధం పెడితే ఎలాంటి ఫలితాలుంటాయి.. !
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.