యాసిడ్ దాడి బాధితులకు రిజర్వేషన్లు వర్తింపు..!!

ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ.. రిజర్వేషన్ కేటగిరీల జాబితాల్లో ఇప్పుడు యాసిడ్ దాడి బాధితులు కూడా చేరిపోయారు.

Last Updated : Jan 30, 2018, 06:46 AM IST
యాసిడ్ దాడి బాధితులకు రిజర్వేషన్లు వర్తింపు..!!

ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ.. రిజర్వేషన్ కేటగిరీల జాబితాల్లో ఇప్పుడు యాసిడ్ దాడి బాధితులు కూడా చేరిపోయారు. భారత ప్రభుత్వం యాసిడ్ దాడి బాధితులతో పాటు మానసిక అస్వస్థత, ఆటిజం వంటి వ్యాధులు గలవారికి రిజర్వేషన్లు కల్పిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. 

డైరెక్ట్ రిక్రూట్మెంట్లో ప్రస్తుతం ఏ,బీ,సీ గ్రూపుల్లో 3%గా ఉన్న రిజర్వేషన్ ను 4%కి పెంచుతూ.. వీరికి కూడా కోటా వర్తింపజేయాలని తెలిపింది. అన్ని ప్రభుత్వ శాఖలు గ్రీవెన్స్ రిడ్రేసల్ ఆఫీసర్లను నియమించుకోవాలంటూ ఆదేశిస్తూ కేంద్రం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. 40%  కన్నా తక్కువ లేకుండా నిర్దిష్ట వైకల్యం కలిగిన వారికి రిజర్వేషన్లను వర్తింపజేస్తారు. వైకల్యం కలిగిన ఉద్యోగుల పట్ల వివక్ష పాటిస్తే కఠిన చర్యలు తప్పవని.. వారిపై గ్రీవెన్స్ రిడ్రేసల్ ఆఫీసర్ల వద్ద ఫిర్యాదు చేయవచ్చని ఉత్తర్వుల్లో పేర్కొంది.

Trending News