Aarogya setu app: న్యూఢిల్లీ: కరోనా వైరస్ (Coronavirus) నివారణ, దాని నుంచి రక్షణ కోసం తీసుకువచ్చిన ఆరోగ్యసేతు యాప్ (Aarogya setu app) లో ప్రభుత్వం కొత్త ఫీచర్‌ను జోడించింది. ఈ యాప్ కరోనాతో పోరాడటానికి ప్రజలకు అదనపు రక్షణ కవచంలా పనిచేయనుంది. ఈ సమాచారాన్ని ప్రభుత్వం ట్వీట్ ద్వారా పంచుకుంది. అయితే ఆరోగ్యసేతు యాప్ ప్రారంభం నాటినుంచి భారతదేశంలో దాదాపు 12కోట్ల మందికిపైగా ప్రజలు డౌన్లోడ్ చేసుకున్నారు. దీని సంఖ్య నిరంతరం పెరుగుతూనే ఉంది. అయితే ఈ కొత్త ఫీచర్ ఇంటర్నెట్ లేకుండానే కేవలం బ్లూటూత్ ద్వారానే పనిచేయనుంది. Also read: Fake TikTok App: నకిలీ టిక్‌టాక్ యాప్‌తో జాగ్రత్త!
ఇది అదనపు రక్షణ వలయం..
ఈ సరికొత్త ఆరోగ్యసేతు యాప్ ద్వారా ప్రజలు కేవలం ఫోన్ బ్లూటూత్ సహాయంతోనే దగ్గరగా వచ్చే కరోనా బాధితులను తెలుసుకోగలుగుతారు. పాజిటివ్ వ్యక్తులు మీకు ఎంత దూరంలో ఉన్నారు, ఒకవేళ దగ్గరగా వచ్చారా, మీ పరిస్థితి ఏమిటీ.. హైరిస్క్‌లో ఉన్నారా అనేది తెలుస్తుంది. ఫోన్ స్క్రీన్ మీద ఎల్లో లేదా ఆరెంజ్ చూపిస్తే... లోకేషన్ ఆధారంగా ఏ తేదీన, ఏ సమయంలో కోవిడ్ పాజిటివ్ వ్యక్తిని కాంటాక్ట్ (contact tracing) అయ్యారో ఆరోగ్యసేతు తెలుపుతుంది. Also read: Google: ప్లే స్టోర్ నుంచి ఆ యాప్ లను గూగుల్ ఎందుకు తొలగించింది?
అప్డెట్ చేయాల్సిందే..
ఈ కొత్త ఫీచర్ కోసం ప్రస్తుతం ఉన్న యాప్‌ను అప్డెట్ చేయాల్సి ఉంటుంది. ఆరోగ్య సేతుపై క్లిక్ చేయడం ద్వారా బ్లూటూత్ సమీపంలో ఉన్న పాజిటీవ్ వ్యక్తుల సంఖ్య తెలుస్తుంది. వారి స్టేటస్‌ను కూడా తెలుసుకోవచ్చు. అంతేకాకుండా మీ డేటాను కూడా అప్లోడ్ చేయడానికి అవకాశం ఉంటుంది.
అయితే ప్రయాణ సమయంలో బ్లూటూత్ కాంటాక్ట్‌లను పసిగట్టడంలో సమస్య ఏర్పడి ప్రమాదం బారిన పడే అవకాశముంది. కావున మీరు ఎల్లప్పుడూ అవసరమైన జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..