Aap in Gujarat: గుజరాత్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆప్ సత్తా, సూరత్‌లో రెండో స్థానంలో నిలిచిన పార్టీ

Aap in Gujarat: ఆమ్ ఆద్మీ పార్టీ నెమ్మదిగా విస్తరిస్తోంది. ప్రధాని మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్‌లో అరవింద్ కేజ్రీవాల్ ఎంట్రీ ఇచ్చారు. కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేసిన తొలిసారే సూరత్‌లో సత్తా చాటింది.   

Written by - Md. Abdul Rehaman | Last Updated : Feb 23, 2021, 10:19 PM IST
  • గుజరాత్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ క్లీన్‌స్వీప్
  • సూరత్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 27 స్థానాల్లో విజయం సాధించి రెండో స్థానంలో నిలిచిన పార్టీ
  • సూరత్ ఎన్నికల్లో విజయం నేపధ్యంలో ఫిబ్రవరి 26న అరవింద్ కేజ్రీవాల్ పర్యటన
Aap in Gujarat: గుజరాత్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆప్ సత్తా, సూరత్‌లో రెండో స్థానంలో నిలిచిన పార్టీ

Aap in Gujarat: ఆమ్ ఆద్మీ పార్టీ నెమ్మదిగా విస్తరిస్తోంది. ప్రధాని మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్‌లో అరవింద్ కేజ్రీవాల్ ఎంట్రీ ఇచ్చారు. కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేసిన తొలిసారే సూరత్‌లో సత్తా చాటింది. 

గుజరాత్(Gujarat )రాష్ట్రంలో జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ( Bjp )దాదాపుగా క్లీన్‌స్వీప్ చేసింది. ఆరు కార్పొరేషన్లనూ బీజేపీ కైవసం చేసుకుంది. అయితే ఇదే సమయంలో ఆమ్ ఆద్మీ పార్టీ( Aam aadmi party) కూడా సత్తా చాటింది. ఢిల్లీకే పరిమితం కాదని చాటి చెప్పింది. కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేసిన తొలిసారే సత్తా చాటింది. సూరత్  కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ తరువాత అతిపెద్ద పార్టీగా నిలిచి రికార్డు సాధించింది. మోదీ సొంతరాష్ట్రంలో పాగా వేయడంతో ఆమ్ ఆద్మీ పార్టీ హర్షం వ్యక్తం చేస్తోంది. ఢిల్లీ పాలన గుజరాత్ రాష్ట్రానికి అవసరమంటోంది. సూరత్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకు ఒక్క డివిజన్ కూడా దక్కకపోవడం విశేషం.

సూరత్ కార్పొరేషన్‌లో మొత్తం 120 స్థానాలుండగా..బీజేపీ 93 స్థానాల్లో విజయం సాధించగా..మిగిలిన 27 స్థానాల్ని ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) కైవసం చేసుకుంది. అయితే మిగిలిన కార్పొరేషన్లలో మాత్రం ఆప్ బోణీ కొట్టలేకపోయింది.  అహ్మదాబాద్, సూరత్, వడోదర, రాజ్‌కోట్, భావ్‌నగర్, జామ్ నగర్ కార్పొరేషన్లకు ఎన్నికలు జరగగా..అన్నింటిని బీజేపీ కైవసం చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ ఆరు కార్పొరేషన్లు కలిపి 58 డివిజన్లలోనే విజయం సాధించగలిగింది. సూరత్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ( Delhi CM Arvind kejriwal) హర్షం వ్యక్తం చేశారు. ఫిబ్రవరి 26న సూరత్‌లో పర్యటించేందుకు సిద్దమయ్యారు. ఆప్‌కు పంజాబ్, గోవా తరువాత గుజరాత్‌లో బలపడే అవకాశమొచ్చింది.

Also read: Assembly elections: నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ మార్చ్ 7న విడుదల కానుందా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News