COVID-19 Vaccine: కరోనా టీకా తీసుకున్న వార్డ్ బాయ్ ఆకస్మిక మృతి

COVID-19 Vaccine: Ward Boy In UP Dies After Taking Corona Vaccine: దేశ వ్యాప్తంగా కరోనా టీకాలు విజయవంతంగా కొనసాగుతున్నాయని సంతోషిస్తున్న తరుణంలో షాకింగ్ న్యూస్. కరోనా టీకా తీసుకున్న ఓ వ్యక్తి 24 గంటల్లోగా చనిపోయాడు. కరోనా వ్యాక్సిన్ ప్రారంభించిన శనివారం రోజు టీకా తీసుకున్న 46 ఏళ్ల వ్యక్తి ఆకస్మికంగా మృతిచెందాడు.

Written by - Shankar Dukanam | Last Updated : Jan 18, 2021, 03:59 PM IST
  • దేశ వ్యాప్తంగా కరోనా టీకాలు విజయవంతంగా కొనసాగుతున్నాయి
  • అయితే కరోనా టీకా తీసుకున్న 24 గంటల్లోనే ఓ వ్యక్తి మరణించాడు
  • అతడు ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్ ఆసుపత్రిలో వార్డు బాయ్
COVID-19 Vaccine: కరోనా టీకా తీసుకున్న వార్డ్ బాయ్ ఆకస్మిక మృతి

COVID-19 Vaccine: Ward Boy In UP Dies After Taking Corona Vaccine: దేశ వ్యాప్తంగా కరోనా టీకాలు విజయవంతంగా కొనసాగుతున్నాయని సంతోషిస్తున్న తరుణంలో షాకింగ్ న్యూస్. కరోనా టీకా తీసుకున్న ఓ వ్యక్తి 24 గంటల్లోగా చనిపోయాడు. ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో కరోనా వ్యాక్సిన్ ప్రారంభించిన శనివారం రోజు టీకా తీసుకున్న 46 ఏళ్ల వ్యక్తి శ్వాస సంబంధింత సమస్యతో మరణించడం ఆందోళన కలిగిస్తోంది.

కరోనా టీకాలు సురక్షితమా, కాదా అనే అనుమానాలు ఇంకా ప్రజలకు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అత్యవసర వినయోగం నిమిత్తం భారత్‌లో కోవాగ్జిన్, కోవిషీల్డ్ టీకా(Corona Vaccine)లకు ఆమోదం లభించం తెలిసిందే. జనవరి 16న కరోనా టీకాలు ప్రారంభించగా.. యూపీలోని మొరాదాబాద్ జిల్లా ఆసుపత్రిలో వార్డ్‌బాయ్‌గా పనిచేస్తున్న 46 ఏళ్ల మహిపాల్ సింగ్ సీరమ్ ఇనిస్టిట్యూట్ రూపొందించిన కోవిషీల్డ్ కరోనా టీకా తీసుకున్నాడు.

Also Read: COVID-19 Vaccine: కరోనా వ్యాక్సిన్ తీసుకునే మద్యం ప్రియులకు చేదువార్త..

మహిపాల్ సింగ్ శనివారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో కోవిషీల్డ్ టీకా తీసుకోగా.. 24 గంటలు గడిచిలోగా ఆదివారం నాడు చనిపోయాడు. శ్వాస సంబంధిత సమస్య, ఛాతీలో నొప్పి రావడంతో కోవిషీల్డ్ టీకా(Covishield Vaccine) తీసుకున్న వార్డ్ బాయ్ చనిపోయినట్లు సమాచారం. దీనిపై చీఫ్ మెడికల్ ఆఫీసర్ స్పందించినట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా తెలిపింది.

Also Read: COVID-19 Vaccine: కరోనా వ్యాక్సిన్ తీసుకున్నవారిలో ఏ లక్షణాలు కనిపిస్తాయంటే..

వార్డు‌బాయ్ మహిపాల్ సింగ్ నైట్ షిఫ్ట్‌లో డ్యూటీ చేస్తుంటాడు. అయితే ఛాతీలో నొప్పి రావడంతో పాటు శ్వాస సంబంధిత సమస్యతో అతడు కన్నుమూశాడని చెప్పిన మెడికల్ ఆఫీసర్.. అయితే టీకా తీసుకోవడం కారణంగా మాత్రం అతడు చనిపోయి ఉండడని అభిప్రాయపడ్డారు. వార్డ్ బాయ్ మరణానికి గల కారణాలను తెలుసుకునేందుకు పూర్తి స్థాయిలో పరీక్షలు చేపట్టినట్లు వెల్లడించారు. 

Also Read: WhatsApp: ప్రైవసీ పాలసీ నచ్చలేదా.. మీ వాట్సాప్ అకౌంట్ ఇలా డిలీట్ చేసుకోండి  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News