Viral Video: కుప్పకూలిన మూడంతస్తుల భవనం

నిర్మాణంలో ఉన్న ఓ మూడంతస్తుల భవనం చూస్తుండగానే సెకన్ల వ్యవధిలో కుప్పకూలిపోయింది. భవనం (Building Collapse in Bengaluru) కుప్పకూలిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Last Updated : Jul 29, 2020, 10:01 AM IST
Viral Video: కుప్పకూలిన మూడంతస్తుల భవనం

చిన్న నిర్లక్ష్యమైనా కొన్నిసార్లు భారీ నష్టాలకు గురిచేస్తోంది. అందుకు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఇదే తరహాలో ఓ ఘటన చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న ఓ మూడంతస్తుల భవనం చూస్తుండగానే సెకన్ల వ్యవధిలో కుప్పకూలిపోయింది (Building Collapsed). కర్ణాటక రాజధాని బెంగళూరులోని మేజెస్టిక్ ప్రాంతం (Building Collapse in Bengaluru)లో మంగళవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. GHMC: ఆస్తి‌పన్నుపై వడ్డీ 90శాతం తగ్గింపు

నిర్మాణం చేపట్టిన ప్రాంతానికి పక్కన ఖాళీ ప్రదేశం ఉంది. ఈ నేపథ్యంలో అసలు ఏమాత్రం జాగ్రత్తలు పాటించకుండా.. గట్టి పునాది లేకుండా నిర్మిస్తున్న ఓ భవనం క్షణాల్లో కుప్పకూలిపోయింది. అయితే ఆ సమయంలో అందులో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. భవనం కుప్పకూలిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భారీగా పెరిగిన బంగారం ధర.. వెండి రికార్డులు

పోకిరి లేడీ విలన్ Sheeva Rana Hot Photos వైరల్   
నితిన్, షాలిని పెళ్లి వేడుక ఫొటోలు

Trending News