/telugu/photo-gallery/rain-alert-expected-in-these-4-key-districts-of-telugu-states-imd-weather-alert-issued-rn-180901 AP: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. ముఖ్యంగా ఆ 4 జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం.. ఐఎండి హెచ్చరిక AP: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. ముఖ్యంగా ఆ 4 జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం.. ఐఎండి హెచ్చరిక 180901

8th Pay Commission Latest Updates: డియర్‌నెస్ అలవెన్స్‌ పెంపు ప్రకటన కోసం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. శుక్రవారం సాయంత్రం  6.30 గంటలకు మోదీ అధ్యక్షతన జరిగే మంత్రివర్గ సమాదేశంలో డీఏ పెంపుపై ప్రకటన వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఈఏ) భేటీ మరికాసేపట్లో ప్రారంభం కానుంది. ఈసారి కరువు భత్యాన్ని 4 శాతం పెంచుతూ ప్రకటన రానుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అదేవిధంగా 8వ వేతన సంఘాన్ని పరిగణనలోకి తీసుకోవాలనే డిమాండ్ కూడా తెరపైకి వస్తోంది. 7వ వేతన సంఘం నిబంధనలను 8వ వేతన సంఘంగా మార్చాలని కోరుతున్నారు.

కేంద్ర బడ్జెట్ 2023 సమయంలోనే 8వ వేతన సంఘం అమలు ప్రణాళికకు సంబంధించిన ప్రకటన వెలువడుతుందని ఉద్యోగులు అంచనా వేశారు. అయితే అలాంటి ప్రకటనేమీ చేయలేదు. ఇప్పుడు తాజా నివేదికలు 8వ వేతన సంఘంపై ప్రభుత్వ ఉద్యోగుల్లో మళ్లీ ఆశలు రేకెత్తిస్తున్నాయి. సాధారణంగా ప్రతి పదేళ్లకు ఒకసారి ప్రభుత్వ ఉద్యోగుల వేతన సంఘం నిబంధనలు మారుతూ ఉంటాయి. 5వ, 6వ, 7వ పే కమిషన్ల అమలులో ఈ నమూనా కనిపించింది.

8వ వేతన సంఘం అమలు ఎప్పుడు..?

8వ వేతన సంఘంపై అధికారిక ప్రకటన లేనప్పటికీ.. కేంద్రం దీనిపై కసరత్తు ప్రారంభించి 2024లో ప్రకటించవచ్చని ఇటీవలి నివేదికలు పేర్కొంటున్నాయి. 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు కేంద్రం 8వ వేతన సంఘాన్ని ప్రకటించవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులకు ముందస్తు ఎన్నికల ప్రోత్సాహాన్ని ఇస్తుంది. అయితే ఎన్నికల ఫలితాలు వెలువడి కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ విషయమై చర్చలు తీవ్ర స్థాయికి చేరుకునే అవకాశం ఉంది.

ఈ నివేదికలు నిజమైతే 2024 చివరి నాటికి 7వ వేతన సంఘం స్థానంలో 8వ పే కమిషన్‌ను రూపొందించవచ్చు. ఈ సిఫార్సులకు ఆమోదం లభిస్తే 2026 వరకు అమలు చేయవచ్చు. 8వ వేతన సంఘం అమలులోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగులకు వేతన స్కేల్‌లో కింది స్థాయి నుంచి అత్యున్నత స్థాయి వరకు భారీ ఇంక్రిమెంట్లు ఇవ్వనుంది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు డీఏ ప్రకటన కోసం చూస్తున్నారు. నాలుగు శాతం పెరిగితే.. 42 శాతానికి చేరుకుంటుంది.

Also Read: YSRCP MLAs Suspended: నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలపై వేటు.. ఆ ఇద్దరు వీళ్లే..!  

Also Read: NPS 2023: పెన్షన్ విధానంపై కేంద్రం ముందడుగు.. లోక్‌సభలో ఆర్థిక మంత్రి ప్రకటన  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Section: 
English Title: 
8th pay commission update central govt likely take decision on 8th pay commission before lok sabha elections 2024
News Source: 
Home Title: 

8th Pay Commission: కేంద్ర ప్రభుత్వం సూపర్ గిఫ్ట్.. ఉద్యోగులకు డబుల్‌ బెనిఫిట్..?
 

8th Pay Commission: కేంద్ర ప్రభుత్వం సూపర్ గిఫ్ట్.. ఉద్యోగులకు డబుల్‌ బెనిఫిట్..?
Caption: 
8th Pay Commission (Source: File)
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
8th Pay Commission: కేంద్ర ప్రభుత్వం సూపర్ గిఫ్ట్.. ఉద్యోగులకు డబుల్‌ బెనిఫిట్..?
ZH Telugu Desk
Publish Later: 
No
Publish At: 
Friday, March 24, 2023 - 17:38
Created By: 
Krindinti Ashok
Updated By: 
Krindinti Ashok
Published By: 
Krindinti Ashok
Request Count: 
101
Is Breaking News: 
No