Latest Update on 8th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలకు సంబంధించి ఇటీవల పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. డీఏ పెంపు ప్రకటన కోసం ఉద్యోగులు ఎదురుచూస్తున్న తరుణంలో మరో వార్త తెరపైకి వచ్చింది. 8వ పే కమిషన్ ఏర్పాటు చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతానికి ఇంకా అధికారిక ప్రకటన లేకపోయినా.. వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని అందరూ అంచనా వేస్తున్నారు. మోదీ ప్రభుత్వం నుంచి 8వ వేతన సంఘానికి గ్రీన్ సిగ్నల్ రానుందని ఉద్యోగులు నమ్మకంతో ఉన్నారు.
సాధారణంగా ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి కొత్త పే కమిషన్ సిఫార్సులు వర్తిస్తాయి. ప్రస్తుతం అమలులో ఉన్న 7వ వేతన సంఘం 2013లో ఏర్పాటు చేశారు. 2016 నుంచి అమలు చేశారు. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు భారీగా పెరిగిన విషయం తెలిసిందే. 7వ వేతన సంఘం ఏర్పాటు చేసి పదేళ్లయిన నేపథ్యంలో కొత్త కమిషన్ ఏర్పాటుపై చర్చ మొదలైంది. 8వ వేతన సంఘం ఈ ఏడాది ఏర్పాటు చేస్తే.. 2026 నుంచి అమలు చేసే అవకాశం ఉంటుంది. వచ్చే ఏడాది దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికలకు కంటే ముందు ఉద్యోగులకు భారీ గిఫ్ట్ ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం.
Also Read: Ram Charan-Upasana: మెగా వారసురాలు వచ్చేసింది.. తల్లిదండ్రులు అయిన రామ్ చరణ్, ఉపాసన
ప్రస్తుతం కేంద్ర ఉద్యోగుల బేసిక్ శాలరీ నెలకు రూ.18 వేల నుంచి రూ.56,900 వరకు ఉంది. 8వ వేతన సంఘం అమలు తర్వాత ఉద్యోగుల బేసిక్ శాలరీలో భారీ పెరుగుదల ఉండనుంది. పే కమిషన్ నివేదికలో ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ కూడా పెరగనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. 8వ వేతన సంఘం డిమాండ్‌పై యూనియన్ త్వరలో ప్రభుత్వంతో చర్చలు జరపనుందని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నాయకులు చెబుతున్నారు. కమిషన్ అమలుపై ప్రభుత్వానికి మెమోరాండం కూడా సమర్పిస్తామని పేర్కొంటున్నారు. తమ డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం అంగీకరించకపోతే.. ఆందోళనకు దిగుతామని హెచ్చరిస్తున్నారు. అయితే ఉద్యోగుల ఆందోళన కంటే ముందే కేంద్ర ప్రభుత్వమే గిఫ్ట్ ఇస్తుందని ప్రచారం జరుగుతోంది.
Also Read: Bandi Sanjay: పీఆర్‌సీకి ఏర్పాటుకు బండి సంజయ్ రిక్వెస్ట్.. సీఎం కేసీఆర్‌కు బహిరంగ లేఖ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి