8th Pay Commission Latest Update: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇటీవలె డీఏ పెంపు ప్రకటన రావడంతో ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే మరోశుభ వార్త రానుందని ప్రచారం జరుగుతోంది. వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం బంపర్ గిఫ్ట్ ఇవ్వనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఉద్యోగులను ఆకర్షించేందుకు 8వ వేతన సంఘంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇదే జరిగితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు భారీగా పెరగనున్నాయి. ఈ మేరకు చర్చలు జరుగుతున్నాయని అంటున్నారు.
8వ వేతన సంఘంపై కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్ కరాద్ కూడా పార్లమెంట్‌లో మాట్లాడారు. 8వ వేతన సంఘం ఏర్పడిన తర్వాత ఉద్యోగుల శాలరీ భారీగా పెరుగుతుందని చెప్పారు. 7వ వేతన సంఘంతో పోల్చి.. కొత్త పే కమిషన్ శాలరీని లెక్కిస్తారు. కొత్త వేతన సంఘం 2024 సంవత్సరం చివరి నాటికి ఏర్పాటు చేస్తారని భావిస్తున్నారు. ఆ తరువాత ఒకటి రెండేళ్లలో అమలవుతుంది. అంటే.. 2025 చివరి నాటికి లేదా 2026 ప్రారంభంలో 8వ వేతన సంఘం అమలు కానుందని చెబుతున్నారు. కొత్త పే కమిషన్‌లో కీలక మార్పులు జరిగే అవకాశం ఉంది. ఫిట్‌మెంట్ ఆధారంగా కాకుండా.. వేరే ఫార్ములా ద్వారా జీతాలు పెంచేందుకు ప్రభుత్వం యోచిస్తోంది.
Also Read: Covid-19 Latest Updates: మళ్లీ భారీగా పెరిగిన కరోనా కేసులు.. ఈ ప్రాంతాల్లో ఆంక్షలు
ఎప్పుడు ఎంత జీతం పెరిగింది..?
==> 4వ వేతన సంఘంలో కేంద్ర ఉద్యోగుల జీతం 27.6 శాతం పెరిగింది. బేసిక్ శాలరీ రూ.750గా నిర్ణయించారు.
==> ఐదో వేతన సంఘంలో ఉద్యోగుల జీతం 31 శాతం పెరిగింది. కనీస వేతనం నెలకు రూ.2550గా ఉంది.
==> ఆరో వేతన సంఘంలో ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను 1.86 రెట్లు పెంచారు. దీంతో ఉద్యోగుల బేసిక్ శాలరీ 54 శాతం పెరిగింది. బేసిక్ శాలరీ రూ.7 వేలు అయింది.
==> 7వ వేతన సంఘంలో ఫిట్‌మెంట్ అంశాన్ని ప్రాతిపదికగా పరిశీలిస్తే 2.57 రెట్లు పెరిగింది. జీతం పెంపు-14.29 శాతం పెంచగా.. బేసిక్ శాలరీ రూ.18 వేలు అయింది.
==> ఎనిమిదో పే కమిషన్‌లో ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను ప్రాతిపదికగా తీసుకోవచ్చు. దీని ఆధారంగా ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను 3.68 రెట్లకు పెంచే అవకాశం ఉంది. ఇదే జరిగితే ఉద్యోగుల బేసిక్ శాలరీ 44.44 శాతం పెరగనుంది. అప్పుడు కనీస వేతనం రూ.18 వేల నుంచి రూ.26 వేలు లేదా అంతకంటే ఎక్కువగా ఉండనుంది.
Also Read: IPL 2023 Updates: చెన్నైపై గెలిచిన రాజస్థాన్‌కు షాక్.. సంజూ శాంసన్‌కు ఫైన్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.