8th Pay Commission:కేంద్ర సర్కార్ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. త్వరలోనే 8వ పే కమిషన్.. ఇది ఎప్పుడు వర్తిస్తుందో తెలుసా..?

8th Pay Commission Updates: కేంద్ర ఉద్యోగులకు మరో గుడ్ న్యూస్ అందింది.  ప్రస్తుతం కేంద్ర సర్కార్ ఉద్యోగులకు  7వ వేతన సంఘం కింద వేతనాలు అందుతున్నాయి. అయితే త్వరలోనే  ఉద్యోగులకు 8వ వేతన సంఘం కింద జీతం లభించనుంది. 8వ వేతన సంఘం కోసం ఉద్యోగులు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు. త్వరలో అది సాకారం కాబోతోంది. 

Written by - Srisailam | Last Updated : Jul 21, 2022, 02:28 PM IST
  • కేంద్ర ఉద్యోగులకు గుడ్ న్యూస్
  • త్వరలోనే 8వ పే కమిషన్
  • ఉద్యోగులకు పెరగనున్న జీతాలు
8th Pay Commission:కేంద్ర సర్కార్ ఉద్యోగులకు గుడ్ న్యూస్..  త్వరలోనే 8వ పే కమిషన్.. ఇది ఎప్పుడు వర్తిస్తుందో తెలుసా..?

8th Pay Commission Updates: కేంద్ర ఉద్యోగులకు మరో గుడ్ న్యూస్ అందింది.  ప్రస్తుతం కేంద్ర సర్కార్ ఉద్యోగులకు  7వ వేతన సంఘం కింద వేతనాలు అందుతున్నాయి. అయితే త్వరలోనే  ఉద్యోగులకు 8వ వేతన సంఘం కింద జీతం లభించనుంది. 8వ వేతన సంఘం కోసం ఉద్యోగులు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు. త్వరలో అది సాకారం కాబోతోంది.  8వ వేతన సంఘం అమల్లోకి వస్తే కేంద్ర ఉద్యోగుల జీతం భారీగా పెరగనుంది. 8వ వేతన సంఘం అమలుతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల బేసిక్‌లో పెరుగుదల ఉంటుంది. దీని కారణంగా ఉద్యగులకు దాదాపు అన్ని అలవెన్సులు పెరుగుతాయి.ఉద్యోగుల జీతం భారీగా హైక్ కానుంది. 

ప్రస్తుతం 7వ వేతన సంఘం కింద ఉద్యోగుల కనీస ప్రాథమిక వేతనం రూ.18,000 కాగా,,  గరిష్ట ప్రాథమిక వేతనం 56,900. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఆధారంగా, రివైజ్డ్ బేసిక్ పే పాత బేసిక్ పే నుండి లెక్కించబడుతుంది. పే కమిషన్ నివేదికలో ఫిట్‌మెంట్ అంశం కూడా ఒక ముఖ్యమైన సిఫార్సు.ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ద్వారా ఉద్యోగి బేసిక్ శాలరీ పెరుగుతుంది. 7వ పే కమిషన్ సిఫార్సులలో ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2.57  ఉంది. దీని ఆధారంగా కేంద్ర ఉద్యోగుల వేతనాలను సవరించారు. గణాంకాలను పరిశీలిస్తే 7వ వేతన సంఘంలో వేతనాలు స్వల్పంగానే పెరిగాయి. కాని  బేసిక్ వేతనం మాత్రం 18 వేల రూపాయలకు పెరిగింది. ఇప్పుడు 8వ వేతన సంఘంలో ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను 3.68 రెట్లు పెంచవచ్చని చెబుతున్నారు. అంటే ఉద్యోగుల కనీస వేతనం రూ.18 వేల నుంచి రూ.26 వేలకు పెరగనుంది. 

ఏ పే కమీషన్‌లో జీతాలు పెంచారో చూద్దాం.. 

4వ పే కమిషన్ 

ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్

 జీతం పెంపు 27.6%
 
కనీస పే స్కేల్: రూ. 750

5వ పే కమిషన్ 

ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 

జీతం పెంపు: 31%
 
కనీస పే స్కేల్: రూ. 2,550

6వ పే కమిషన్ 

ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్: 1.86 రెట్లు, 

జీతం పెంపు: 54%

కనీస పే స్కేల్: రూ.7,000

7వ పే కమిషన్ 

ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్: 2.57 రెట్లు, 

జీతం పెంపు: 14.29%

కనీస పే స్కేల్: రూ. 18,000

8వ వేతన సంఘం ఎప్పుడు వస్తుంది?

ఇప్పుడు 8వ వేతన సంఘం ఎప్పుడు వస్తుందనేది ప్రశ్న. దీనికి సంబంధించి నిపుణులు భిన్నమైన వాదనలు చేస్తున్నారు. ఇకపై ప్రభుత్వం తదుపరి పే కమిషన్‌ను పరిగణనలోకి తీసుకోనుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి, అయితే అలా చేయడం సాధ్యం కాదని నిపుణులు భావిస్తున్నారు. 8వ వేతన సంఘం రావడానికి ఇంకా సమయం ఉంది. 2026 కంటే ముందు 2024లో కూడా ఎన్నికలు జరగాల్సి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులను నిరాశపరచదని భావిస్తున్నారు. ఎన్నికలకు ముందే  

8వ వేతన సంఘం అమలులోకి వస్తుందని ఆశిస్తున్నారు. దీంతో తదుపరి వేతన సంఘం రావడం ఖాయమంటున్నారు, జనవరి 1, 2026 నాటికి అమలులోకి వస్తుందని ధీమాగా చెబుతున్నారు. జీతాలు పెంచాలన్న డిమాండ్‌కు సంబంధించి త్వరలో నోట్‌ను సిద్ధం చేసి ప్రభుత్వానికి అందజేయనున్నట్లు సెంట్రల్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ అధికారి ఒకరు తెలిపారు. ప్రభుత్వం తమ డిమాండ్లను అంగీకరించని పక్షంలో సంఘం ఆధ్వర్యంలో ఆందోళనకు దిగుతామన్నారు. ఈ ఉద్యమంలో ఉద్యోగులతో పాటు పెన్షన్ పొందిన ఉద్యోగులు కూడా పాల్గొంటారన్నారు.

Also read:EPFO: ఈపీఎఫ్‌ఓలో పెరుగుతున్న ఖాతాదారుల సంఖ్య..మేలో ఎంత మంది చేరారంటే..!

Also read:Presidential Election Result-LIVE* Updates: కొనసాగుతున్న భారత రాష్ట్రతి ఎన్నికల కౌంటింగ్..విజయం ఎవరిదో..!

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News