7th Pay Commission: వచ్చే ఏడాదిలో ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో భారీగా పెరుగుదల.. డీఏ పెంపు ఎంతంటే..?

7th Pay Commission Latest News: ఇటీవల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు అందించిన విషయం తెలిసిందే. దసరా, దీపావళి గిఫ్ట్‌గా కేంద్రం 4 శాతం డీఏను పెంచింది. దీంతో మొత్తం డీఏ 46 శాతానికి చేరుకుంది. తదుపడి డీఏ పెంపు ప్రకటన వచ్చే ఏడాదిలో రానుండగా.. ఎంత ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.   

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 29, 2023, 10:36 PM IST
7th Pay Commission: వచ్చే ఏడాదిలో ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో భారీగా పెరుగుదల.. డీఏ పెంపు ఎంతంటే..?

7th Pay Commission Latest News: వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కేంద్రం వరాల జల్లు కురిపిస్తుందని ఉద్యోగులు నమ్మకంతో ఉన్నారు. డియర్‌నెస్ అలవెన్స్ పెంపు భారీగా ఉంటుందని ఆశతో ఉన్నారు. ఈ ఏడాది రెండు సార్లు డీఏను 4 శాతం పెంచిన విషయం తెలిసిందే. దీంతో మొత్తం డీఏ 46 శాతానికి చేరుకుంది. దసరా, దీపావళి గిఫ్ట్‌గా ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం డీఏను పెంచింది. పెంచిన డీఏ జూలై 1వ నుంచి అమల్లోకి వచ్చింది.ఇక కొత్త డీఏ ప్రకటన వచ్చే ఏడాదిలోనే ఉంటుంది. అయితే కరువు భత్యాన్ని 5 శాతం పెంచాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంటే ఉద్యోగుల జీతాలు భారీగా పెరుగుతాయి. 

తాజా డేటా ప్రకారం..  డియర్‌నెస్ అలవెన్స్‌లో భారీ పెరుగుదల ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఏఐసీపీఐ సూచీ జులై, ఆగస్టు, సెప్టెంబర్ గణాంకాలను పరిశీలిస్తే.. ప్రస్తుతం 137.5 పాయింట్ల వద్ద ఉంది. డీఏ స్కోర్ 48.54 శాతం వద్ద ఉంది. అక్టోబర్‌లో ఇది 49 శాతం దాటుతుందని అంచనా ఉంది. నవంబర్, డిసెంబర్‌ల గణాంకాలు ఇంకా రావాల్సి ఉంది. ఏఐసీపీఐ సూచిక సంఖ్య డిసెంబర్‌లో విడుదలైన తరువాత డీఏ పెంపుపై క్లారిటీ రానుంది. 

వచ్చే నెలలో ఇండెక్స్ పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ద్రవ్యోల్బణం రేటులో భారీ పెరుగుదల ఉంటుందనం అంటున్నారు. 7వ వేతన సంఘం కింద ఏఐసీపీఐ పాయింట్లను బట్టి డీఏ పెంపుపై నిర్ణయం తీసుకోనుంది కేంద్రం. ప్రస్తుతం ఏఐసీపీఐ డేటా ఆధారంగా డియర్‌నెస్ అలవెన్స్ 48.50 శాతం వద్ద ఉండగా.. ఇంకా 2.5 శాతం పెరిగిచే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. మూడు నెలల డేటా అంచనా వేస్తే.. 2.40 శాతం పెరుగుదలను చూపుతోందంటున్నారు. డీఏ కాలిక్యులేటర్ ప్రకారం ఇది 51 శాతానికి చేరవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.  

అంటే డీఏ పెంపు 5 శాతం ఉంటుందని కొందరు అంటుండగా.. 4 శాతమే ఉంటుందని మరికొన్ని వర్గాలు చెబుతున్నాయి. డీఏ 50 శాతం దాటితే.. మొత్తాన్ని బేసిక్ శాలరీలో కలిపి మళ్లీ జీరో నుంచి లెక్కించాల్సి ఉంటుంది. అప్పుడు మళ్లీ కొత్త వేతన సంఘం అమలు చేయాల్సి ఉంటుంది. అయితే కేంద్ర వద్ద కొత్త వేతన సంఘం అమలు చేసే ఆలోచన లేకపోవడంతో డీఏ 50 శాతం లోపలే ఉండే అవకాశం ఉంది. అయితే ఎన్నికల సంవత్సరం కావడంతో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయమైన తీసుకునే ఛాన్స్ ఉందని ఉద్యోగ సంఘాలు అంటున్నాయి.  

Also Read: Assembly Election 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై బెట్టింగ్ రాయుళ్ల కన్ను..కోట్ల రూపాయల్లో బెట్టింగ్ నిర్వహణ..

Also Read: Vivo S18 Pro Price: శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్లోకి Vivo S18, Vivo S18 Pro మొబైల్స్..ధర, విడుదల తేదీ వివరాలు ఇవే..  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News