7th Pay Commission DA Hike News: కొత్త సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్‌లకు గుడ్‌న్యూస్ అందే అవకాశం కనిపిస్తోంది. కొత్త ఏడాదిలో డీఏ, డీఆర్ 4 శాతం పెరిగే అవకాశం ఉంది. జూలై నుంచి అక్టోబర్ నెల వరకు AICPI డేటాను కార్మిక మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. నవంబరు, డిసెంబర్‌ల డేటా ఇంకా రావాల్సి ఉంది. ఈ డేటా తరువాత కొత్త సంవత్సరంలో డీఏ ఎంత పెరుగుతుందో తేలిపోనుంది. బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం డీఏ పెంపును ప్రకటించే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.
ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 46 శాతం డీఏ అందుతోంది. దీపావళికి ముందు కేంద్ర ప్రభుత్వం డీఏను పెంచగా.. జూలై నుంచి అమల్లోకి వచ్చింది. డీఏలో తదుపరి పెంపు జనవరి 2024లో ఉంటుంది. మార్చి నెలలో హోలీ సందర్భంగా ప్రకటించే అవకాశం ఉందని అంటున్నారు. AICPI ఇండెక్స్ వార్షిక డేటా ఆధారంగా డీఏ, డీఆర్ రేట్లు జనవరి, జూలైలలో సవరిస్తున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది జనవరి, జూలైతో మొత్తం 8 శాతం డీఏను పెంచింది. తదుపరి డీఏ 2024 సంవత్సరంలో పెంచనున్నారు. జూలై నుంచి డిసెంబర్ 2023 వరకు AICPI సూచిక డేటాపై డీఏ పెంపు ఆధారపడి ఉంటుంది.
నవంబర్ 30న కార్మిక మంత్రిత్వ శాఖ AICPI ఇండెక్స్ అక్టోబర్ గణాంకాలను విడుదల చేసింది. దీనిలో 0.9 పాయింట్ల పెరుగుదలతో మొత్తం 138.4కి చేరుకుంది. డీఏ స్కోరు 49 శాతానికి చేరుకుంది. వచ్చే ఏడాది డీఏ నుంచి 4 శాతం లేదా 5 శాతం పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అయితే నవంబర్, డిసెంబర్‌ల గణాంకాలు ఇంకా రావాల్సి ఉండగా.. 2024లో డీఏ ఎంత పెరుగుతుందనేది క్లారిటీ రానుంది. డీఏ స్కోర్ 50 శాతం లేదా అంతకంటే ఎక్కువ అయితే.. ఉద్యోగుల జీతం సవరిస్తారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 7వ వేతన సంఘం ప్రకారం డీఏ 50 శాతానికి చేరినప్పుడు ప్రాథమిక వేతనానికి డీఏను యాడ్ చేసి.. జీరో నుంచి లెక్కిస్తారు.
పెంచిన డీఏ బడ్జెట్ సమయంలో లేదా ఫిబ్రవరి-మార్చి నెలలో ప్రకటించే ఛాన్స్ ఉంది. లోక్‌సభ ఎన్నికలు వచ్చే ఏడాది ఏప్రిల్, మేలో జరిగే అవకాశం ఉంది. ఎన్నికల కోడ్ అమల్లోకి రాకముందే డీఏ పెంపుపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ఉద్యోగులు భావిస్తున్నారు. డీఏ పెంపుతో 48 లక్షలకు పైగా కేంద్ర ఉద్యోగులు, 68 లక్షల మంది పెన్షనర్లకు లబ్ధి చేకూరనుంది.
Also Read: Tamil Nadu Road Accident: తమిళనాడులో కారు ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ అయ్యప్ప భక్తులు మృతి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ గిఫ్ట్.. డీఏ పెంపుపై అప్పుడే ప్రకటన