7th Pay Commission: ఉద్యోగులకు ఒకేసారి డబుల్ గిఫ్ట్.. సూపర్ న్యూస్ చెప్పనున్న కేంద్రం..!

7th Pay Commission DA Hike News: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త సంవత్సరంలో డబుల్ ధమాకా ఉంటుందని ప్రచారం జరుగుతోంది. డీఏ పెంపుతోపాటు హెచ్‌ఆర్‌ఏ కూడా పెంచే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. డీఏ పెంపు ప్రకటన హోలీ గిఫ్ట్‌గా వచ్చే ఛాన్స్ ఉంది.  

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 11, 2024, 01:18 PM IST
7th Pay Commission: ఉద్యోగులకు ఒకేసారి డబుల్ గిఫ్ట్.. సూపర్ న్యూస్ చెప్పనున్న కేంద్రం..!

7th Pay Commission DA Hike News: కొత్త సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలో శుభవార్త అందే అవకాశం కనిపిస్తోంది. ఈసారి ఒకేసారి డబుల్ గుడ్‌న్యూస్ ప్రకటించే ఛాన్స్ ఉంది. డియర్‌నెస్ అలవెన్స్ (DA Hike), ఇంటి అద్దె అలవెన్స్ (HRA) కూడా పెంచవచ్చని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 46 శాతం డియర్‌నెస్ అలవెన్స్ అందుతోంది. కేంద్రం డీఏను 4 శాతం పెంచే అవకాశం ఉంది. ఈ పెంపుతో డీఏను 50 శాతానికి చేరనుంది. డీఏ పెంపునకు సంబంధించిన ప్రక్రియ మార్చిలో వచ్చే అవకాశం ఉండగా.. జనవరి 1వ తేదీ ఉంచి అమలులోకి వస్తుంది.

డీఏ, హెచ్‌ఆర్‌ఏ రెండూ ఒకేసారి పెరిగితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతంలో భారీ పెంపు ఉండనుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు హెచ్‌ఆర్ఏ నగరాన్ని బట్టి ఉంటుందనే విషయం అందరికీ తెలిసిందే. అద్దె ఇంట్లో నివసించే ఉద్యోగులకు కేంద్రం హెచ్‌ఆర్ఏ అందజేస్తుంది. టైర్-2 లేదా టైర్-III నగరాల్లో నివసించే ఉద్యోగి కంటే టైర్-1 నగరాల్లో నివసించే ఉద్యోగులు ఎక్కువ హెచ్‌ఆర్‌ఏ పొందుతారు.

సాధారణంగా డీఏ పెంపు ఏడాదికి రెండుసార్లు సవరిస్తుంది కేంద్ర ప్రభుత్వం. జనవరి, జూలైలలో AICPI ఇండెక్స్ డేటా ఆధారంగా డీఏ పెంపు ప్రకటన ఉంటుంది. ఇండెక్స్‌ డేటా వివిధ రంగాలకు సంబంధించిన ద్రవ్యోల్బణ డేటా వివరాలు ఉంటాయి. ఉద్యోగి జీతం ఎంత పెంచాలి..? అని ఈ డేటా ఆధారంగా నిర్ణయిస్తారు. అయితే తుది నిర్ణయం మాత్రం పూర్తిగా కేంద్ర ప్రభుత్వం చేతిలోనే ఉంటుంది. గతేడాది రెండుసార్లు DA ను 4 శాతం చొప్పున మొత్తం 8 శాతం పెంచింది. మరోసారి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు డియర్‌నెస్ అలవెన్స్‌లో 4 శాతం లేదా అంతకంటే ఎక్కువ పెంపు ఉంటుందని నమ్మకంతో ఉన్నారు. హోలీ గిఫ్ట్‌గా DA పెంపు ప్రకటన ఉంటుందని అంచనా వేస్తున్నారు. 

మరోవైపు ఈ ఏడాది లోక్‌సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కొత్త పే కమిషన్ అమలు కోసం కూడా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు నమ్మకంతో ఉన్నారు. డీఏ 4 శాతం పెంచితే 50 శాతానికి చేరుతుంది. మొత్తం 50 శాతం దాటితే.. బేసిక్‌లో కలిపేసి మళ్లీ జీరో నుంచి డీఏను లెక్కించాల్సి ఉంటుంది. మరి కేంద్రం కొత్త పే కమిషన్ తీసుకువస్తుందో లేదా నిబంధనల్లో మార్పు చేస్తుందో చూడాలి.  

Also Read: Sankranthi Special Trains: సంక్రాంతి రద్దీ తట్టుకునేందుకు మరిన్ని ప్రత్యేక రైళ్లు

Also Read: Home Loan Rates: హోమ్‌ లోన్స్‌ గుడ్‌ న్యూస్‌..వడ్డీ రేట్లు తగ్గబోతున్నాయ్‌..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News