పొగ మంచుతో కాలువలో పడిన కారు.. ఆరుగురు మృతి!

ఉత్తరాదిని కప్పేసిన పొగ మంచు కారణంగా అనేక చోట్ల రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. పొగ మంచు కారణంగా రహదారి కనిపించక వాహనదారులు ప్రమాదాలబారిన పడుతున్నారు. తాజాగా డిసెంబర్ 29 ఆదివారం రాత్రి సైతం ఉత్తర్ ప్రదేశ్‌లోని గ్రేటర్ నొయిడాలో అటువంటి ప్రమాదమే చోటుచేసుకుంది.

Last Updated : Dec 30, 2019, 09:57 AM IST
పొగ మంచుతో కాలువలో పడిన కారు.. ఆరుగురు మృతి!

ఢిల్లీ: ఉత్తరాదిని కప్పేసిన పొగ మంచు కారణంగా అనేక చోట్ల రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. పొగ మంచు కారణంగా రహదారి కనిపించక వాహనదారులు ప్రమాదాలబారిన పడుతున్నారు. తాజాగా డిసెంబర్ 29 ఆదివారం రాత్రి సైతం ఉత్తర్ ప్రదేశ్‌లోని గ్రేటర్ నొయిడాలో అటువంటి ప్రమాదమే చోటుచేసుకుంది. గ్రేటర్ నొయిడాలోని డంకౌర్ ప్రాంతంలో ఖెర్లి కాలువపై నుంచి వెళ్తున్న మారుతి ఎర్టిగా కారు అదుపుతప్పి కాలువలో పడిపోయిన ప్రమాదంలో ఆరుగురు మృత్యువాత పడ్డారు. రాత్రి 11.40 గంటలకు ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన సమయంలో కారులో మొత్తం 11 మంది ఉన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే కారులోంచి 11 మందిని వెలికి తీసి ఆస్పత్రికి తరలించినప్పటికీ.. అప్పటికే అందులో ఆరుగురు చనిపోయినట్టు వైద్యులు ధృవీకరించారు. చనిపోయిన వారిని మహేష్ (35), కిషన్ లాల్ (50), నీరేష్ (17), రామ్ కిలాడీ (75), మల్లు (12), నేత్ర పాల్ (40)గా గుర్తించారు. గాయపడిన మిగతా ఆగురురిలో ఒకరు ఉత్తర్ ప్రదేశ్ పోలీసు సిబ్బంది కూడా ఉన్నారు. పొగ మంచు కారణంగానే ఈ దుర్ఘటన చోటుచేసుకున్నట్టు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. 

ఢిల్లీలో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. సోమవారం తెల్లవారుజామున 5.30 గంటలకు సఫ్దర్‌జంగ్‌లో 4.6 డిగ్రీల సెల్సియస్, పాలం వద్ద 4.8 డిగ్రీల సెల్సియస్ డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎదురుగా ఉన్నవేవి కనిపించే వీల్లేకుండా పలు చోట్ల జీరో విజిబిలిటీ రికార్డవగా మరికొన్ని చోట్ల 100 మీటర్ల మేర విజిబిలిటీ రికార్డయింది. ఢిల్లీని మంచు దుప్పటి కప్పేయడంతో ఢిల్లీ విమానాశ్రయంలో పలు విమానాల రాకపోకలు సైతం నిలిచిపోయాయి.

Trending News