ఒకే బిల్డింగ్‌లో 41 మందికి కరోనావైరస్

ఒకే బిల్డింగ్‌లో నివాసం ఉంటున్న వారిలో 41 మందికి కరోనావైరస్ సోకిన ఘటన ఢిల్లీలోని క‌పాషేరా ప్రాంతం టెకె వాలి గల్లీలో కలకలం సృష్టించింది. ఏప్రిల్ 18వ తేదీనే ఇదే బిల్డింగ్‌కి చెందిన ఓ వ్య‌క్తికి కరోనావైరస్ సోకినట్టు గుర్తించారు.

Last Updated : May 2, 2020, 11:40 PM IST
ఒకే బిల్డింగ్‌లో 41 మందికి కరోనావైరస్

హైద‌రాబాద్‌: ఒకే బిల్డింగ్‌లో నివాసం ఉంటున్న వారిలో 41 మందికి కరోనావైరస్ సోకిన ఘటన ఢిల్లీలోని క‌పాషేరా ప్రాంతం టెకె వాలి గల్లీలో కలకలం సృష్టించింది. ఏప్రిల్ 18వ తేదీనే ఇదే బిల్డింగ్‌కి చెందిన ఓ వ్య‌క్తికి కరోనావైరస్ సోకినట్టు గుర్తించారు. అతడి నుంచే ఆ బిల్డింగ్ వాసులు అందరికీ కరోనా వైరస్ పాజిటివ్ వ్యాపించి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. బిల్డింగ్‌తో పాటు అక్కడి పరిసరాల్లో కలిపి మొత్తం 175 మంది శ్యాంపిళ్ల‌ను సేక‌రించగా.. వారికి 67 మందికి సంబంధించిన ఫ‌లితాలు ఇవాళ వెల్లడయ్యాయి. ఇవాళ ఫలితాలు వెల్లడైన వారిలో 41 మందికి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. 

Also read : తెలంగాణలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు

ఏప్రిల్ 19నే బిల్డింగ్‌ని సీలింగ్ చేసి శానిటైజ్ చేసినప్పటికీ.. అందులో ఉన్న వారిలో అత్యధిక మందికి కరోనా సోకడం ఆందోళనరేకెత్తిస్తోంది. మరోవైపు కరోనా ఫ‌లితాలు ఆలస్యంగా రావ‌డంపై సైతం స్థానికులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. పరీక్షల ఫలితాలు ఆలస్యంగా వెల్లడయ్యాయని... కానీ ఈలోపే కరోనా బాధితులు.. ఎంతమందికి కరోనా అంటించి ఉంటారోనని స్థానికులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఢిల్లీలో ఇప్ప‌టి వ‌ర‌కు 3,738 మందికి కరోనా వైరస్ సోకగా.. వారిలో 61 మంది చనిపోయారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..  

Trending News