17 people died After Roof Collapses in Muradnagar UP | న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. రాష్ట్రంలోని ఘాజియాబాద్ మురాద్‌నగర్‌లో భవనం పైకప్పు కూలి 17మంది మృతి చెందారు. చాలా మంది గాయాలపాలయ్యారు. ఘాజియాబాద్ జిల్లా మురాద్‌నగర్‌లోని శ్మశానవాటిక కాంప్లెక్స్ పైకప్పు (roof collapses) కూలిపోయింది. ఈ ఘటనలో సుమారు 60 మంది వరకు శిథిలాల కింద చిక్కుకున్నారు. సమాచారం అందుకున్న (Uttar Pradesh) అధికార యంత్రాంగం అక్కడకు చేరుకొని వెంటనే సహాయక చర్యలు చేపట్టింది.
गाजियाबाद: मुरादनगर में बारिश की वजह से छत गिरी, क़रीब 10-12 लोगों के फंसे होने की आशंका है। बचाव अभियान चल रहा है। pic.twitter.com/1WUHO5MLys
— ANI_HindiNews (@AHindinews) January 3, 2021
ఈ ప్రమాదంలో (roof collapse incident) ఇప్పటివరకు 17 మంది మరణించగా.. శిథిలాల కింద చిక్కుకున్న 38 మందిని రక్షించారు. గాయాలపాలైన వారిని ఆసుపత్రికి తరలిస్తున్నారు. సంఘటనా స్థలంలో ఇంకా సహాయచర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని.. దోషులుగా తేలిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామమని కమిషనర్ అనిత సి మేష్రామ్ తెలిపారు. Also Read: Farmers Protests Updates: చలి, వర్షంలో.. 39వ రోజుకు చేరిన రైతుల ఆందోళన
17 people have died so far while 38 people have been rescued after a shed collapsed in Muradnagar. We've started a probe & we'll take strict action against those found guilty: Anita C Meshram, Divisional Commissioner, Meerut on Muradnagar roof collapse incident https://t.co/4geUbeviit pic.twitter.com/PgrXJ0ftY6
— ANI UP (@ANINewsUP) January 3, 2021
అయితే ఈ ఘటనపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath), కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాధ్ (Rajnath Singh) సింగ్ విచారం వ్యక్తం చేశారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని ఉత్తరప్రదేశ్ సీఎం అధికారులను ఆదేశించారు. Also read: COVID-19 Vaccine: ప్రతీ భారతీయుడికి గర్వకారణం: ప్రధాని మోదీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook