కాంగ్రెస్ ను శాసిస్తున్న గాంధీ కుటుంబం !

భారత జాతీయ కాంగ్రెస్.. ఒక సుదీర్ఘ చరిత్ర కలిగిన పార్టీ. డిసెంబర్ 28, 1885వ సంవత్సరంలో ఆవిర్భవించిన భారత జాతీయ కాంగ్రెస్ డిసెంబర్ 28, 2017న 133వ వసంతంలోకి అడుగుపెట్టబోతుంది. ఆరోజున వ్యవస్థాపక దినోత్సవం జరుపుకొంటోంది.

Last Updated : Dec 4, 2017, 04:03 PM IST
కాంగ్రెస్ ను శాసిస్తున్న గాంధీ కుటుంబం !

భారత జాతీయ కాంగ్రెస్.. ఒక సుదీర్ఘ చరిత్ర కలిగిన పార్టీ. డిసెంబర్ 28,1885వ సంవత్సరంలో ఆవిర్భవించిన భారత జాతీయ కాంగ్రెస్ డిసెంబర్ 28,2017న 133వ వసంతంలోకి అడుగుపెట్టబోతుంది. ఆరోజున వ్యవస్థాపక దినోత్సవం జరుపుకొంటోంది. దీనికి ముందే రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించడం గమనార్హం. కాంగ్రెస్ చరిత్రలోనే సుదీర్ఘకాలం పార్టీ అధ్యక్షులుగా కొనసాగిన వ్యక్తిగా శ్రీమతి సోనియా గాంధీ నిలిచారు. పార్టీ ఆవిర్భవించిన కాలం నుండి ఇప్పటివరకు 59 మంది అధ్యక్షులుగా ఉన్నారు. రాహుల్ 60వ అధ్యక్షుడు. 

1998వ సంవత్సరంలో సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించారు. గాంధీ-నెహ్రూ కుటుంబంలో సుదీర్ఘకాలం పార్టీ అధినేత్రిగా కొనసాగిన ఘనత సోనియా గాంధీకే దక్కింది. అంతకు ముందు ఈ రికార్డును సోనియా గాంధీ అత్త, ఇందిరా గాంధీకి దక్కింది. 

కాంగ్రెస్ పార్టీ ఏర్పడి అప్పుడే 133 ఏళ్లు గడిచాయి. పార్టీ అధ్యక్షులుగా ఎక్కువ కాలం పనిచేసింది కూడా గాంధీ-నెహ్రూ కుటుంబమే. ఈ సంప్రదాయం జవహర్ లాల్ తండ్రి మోతీలాల్ నెహ్రూ నుండి జరుగుతూ వస్తోంది. ఆ పరంపరలో రాహుల్ గాంధీ కూడా ఒకరు.

1. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ను 1885 డిసెంబర్ 28న మాజీ బ్రిటీష్ అధికారి ఏ.ఓ.హ్యూమ్  స్థాపించారు. ఆయన అధికార రాజకీయ ప్రయోజనాలను పొందాలనుకున్నాడు, కానీ అది విఫలమైంది మరియు ఈ పార్టీ స్వేచ్ఛా ఉద్యమంలో భాగంగా మారింది. మహాత్మా గాంధీ తరువాత కాంగ్రెస్ ను అంతం చేయడానికి ప్రతిపాదించినప్పటికీ, అది ఏకాభిప్రాయం కాలేదు.

2. నెహ్రూ కుటుంబంలో మొదటిసారి మోతీలాల్ నెహ్రూ 1919లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఎన్నికై 1920 వరకు కొనసాగారు. ఆతరువాత మరోసారి మోతీలాల్ 1929లో పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలను సంవత్సరంపాటు నిర్వర్తించారు. 

3. మోతీలాల్ తర్వాత, అతని కుమారుడు జవహర్ లాల్  నెహ్రూ లాహోర్ సమావేశంలో కాంగ్రెస్ అధ్యక్షుడిగా మారారు. 1930,1936,1937,1951,1953 మరియు 1954 సంవత్సరాల్లో జవహర్ లాల్ నెహ్రూ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఆరుసార్లు అయ్యారు. పండిట్ నెహ్రూ తర్వాత, అతని కుమార్తె ఇందిరా గాంధీ రెండుసార్లు అధ్యక్షురాలు అయ్యారు.

4. ఇందిరా గాంధీ మొదటిసారి 1959లో కాంగ్రెస్ అధ్యక్షురాలయ్యారు. 1960 వరకు కొనసాగారు. 1978లో రెండోసారి పార్టీ అధ్యక్షురాలయ్యారు. ఆరు సంవత్సరాలపాటు కొనసాగారు. 

5. ఇందిరా గాంధీ హత్య తరువాత, ఆమె కుమారుడు రాజీవ్ గాంధీ 1984 ముంబయి సెషన్లో కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 1991 వరకు ఆయన పదవిలో కొనసాగారు.

6. రాజీవ్ గాంధీ హత్య తరువాత, నెహ్రూ-గాంధీ కుటుంబం కాంగ్రెస్ కు దూరమయ్యింది. ఆ సమయంలో పార్టీకి కీర్తి ప్రతిష్టలు దెబ్బతిన్నాయి. దేశంలో ప్రాంతీయ పార్టీల హవా కొనసాగడం జరిగింది. 

7. 1998లో రాజీవ్ గాంధీ భార్య సోనియా గాంధీ రాజకీయాల్లోకి వచ్చారు. ఆమె పార్టీ అధ్యక్షురాలిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అప్పటి నుండి, ఆమె దాదాపు 19 సంవత్సరాలు అధినేత్రిగా ఉన్నారు.

8. సోనియా గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ 2004, 2009 ఎన్నికల్లో విజయం సాధించింది.

9. 2004లో ఆమె ప్రధాన మంత్రి అవుతారని అందరూ అనుకున్నారు. కానీ అప్పటి పరిస్థితుల కారణంగా ఆమె ప్రధాని రేసు నుండి తప్పుకున్నారు. తన స్థానంలో మన్మోహన్ సింగ్ దేశ ప్రధానమంత్రి అయ్యారు. ప్రధాని పదవిని త్యజించిన నాయకురాలిగా సోనియా గాంధీ చరిత్రలో నిలిచారు. 

10. ప్రస్తుతం రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీకి 60 వ అధ్యక్షుడిగా ఉంటారు. 2013 నుండి ఆయన పార్టీకి వైస్ ప్రెసిడెంట్ వ్యవహరిస్తున్నారు.

Trending News