అలీగఢ్ ప్రాంతంలోని నద్రోయి పల్లె ప్రాంతంలో ఓ దారుణం చోటు చేసుకుంది. జన్మాష్టమి సందర్భంగా స్థానిక గోపాలుడి ఆలయంలో బూరలు కట్టారు. అయితే ఆ బూరల్లో ఒకదాన్ని పేల్చిన బాలుడిపై అయిదుగురు మైనర్ బాలురు దాడి చేశాడు. ఈ క్రమంలో ఆ దాడిలో తీవ్రగాయాల బారిన పడిన ఆ బాలుడు మరణించాడు. ప్రస్తుతం ఈ దాడికి పాల్పడిన అయిదుగురు బాలురిపై ఐపీసీ 304 ఏ సెక్షన్‌తో పాటు ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ యాక్టు క్రింద కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం బాలుడి దేహాన్ని పోస్టుమార్టంకి పంపించామని.. రిపోర్టు ఇంకా రావాల్సి ఉందని క్రైం ఎస్పీ అశుతోష్ ద్వివేదీ తెలిపారు.
బాలుడిపై దాడి చేశాక నిందితులు పరారయ్యారని... తన కుమారుడిని కొడుతున్నారన్న వార్త తెలియగానే బాధితుడి తల్లి హుటాహుటిన ఆలయానికి వచ్చి చూశారని.. అప్పటికే బాలుడు మరణించాడని ఎస్పీ తెలిపారు. ఇదే ఘటనపై బాలుడికి సోదరుడి వరసైన చంద్రపాల్ మాట్లాడుతూ.. తన తమ్ముడు అప్పటికే విపరీతమైన కడుపునొప్పితో బాధపడుతున్నాడని.. అంతకు ఒక రోజు క్రితమే తనను ఆసుపత్రికి తీసుకెళ్లారని.. ఈ క్రమంలో మళ్లీ దాడి చేసినప్పుడు తనను కడుపులో విపరీతంగా కొట్టడంతో మరణించడానికి తెలిపాడు.
తన కుమారుడి మరణవార్త వినగానే బాధితుడి తల్లి గ్రామపెద్ద శ్యామ సుందర ఉపాధ్యాయ వద్దకు వెళ్లి పరిస్థితిని వివరించారని.. కాకపోతే ఆయన ఎలాంటి సహాయాన్ని చేయలేదని ఆమె తెలిపారు. ఇక చేసేదేమీ లేక.. పోలీసులకు ఫిర్యాదు చేయాల్సి వచ్చిందని ఆమె అన్నారు. బాధితుడి తల్లి సావిత్రి కూలిపని చేసుకొని బ్రతికే వ్యక్తని.. ఆమె భర్త ఎనిమిది సంవత్సరాల క్రితం మరణించారని సమాచారం. ప్రస్తుతం ఆమెకు ఒక కుమార్తె.. ముగ్గురు కుమారుడు. అందులో ఆఖరి కుమారుడిపైన మైనర్లు దాడికి పాల్పడ్డారు.