Meghalaya Congress : మేఘాలయలో కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ..టీఎంసీలోకి 12 మంది ఎమ్మెల్యేలు

12 Of 17 Congress MLAs Join Trinamool In Meghalaya : మేఘాలయ అసెంబ్లీలో కాంగ్రెస్‌ పార్టీకి ఉన్న 17 మంది ఎమ్మెల్యేల్లో మాజీ సీఎం ముకుల్‌ సంగ్మాతో పాటు మొత్తం 12 మంది తృణమూల్‌ కాంగ్రెస్‌లోకి ఫిరాయించారు. మేఘాలయ అసెంబ్లీలో విపక్ష నాయకుడిగా వ్యవహరిస్తున్న ముకుల్‌ సంగ్మా కొంతకాలంగా కాంగ్రెస్‌ అధినాయకత్వంపై అసంతృప్తితో ఉన్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 25, 2021, 02:24 PM IST
  • కాంగ్రెస్‌ పార్టీకి ఈశాన్య రాష్ట్రమైన మేఘాలయలో ఎదురుదెబ్బ
  • అసెంబ్లీలో పార్టీకి ఉన్న 17 మంది ఎమ్మెల్యేల్లో 12 మంది రాజీనామా
  • మాజీ సీఎం ముకుల్‌ సంగ్మాతో పాటు మొత్తం 12 మంది తృణమూల్‌ కాంగ్రెస్‌లోకి ఫిరాయింపు
  • మేఘాలయా అసెంబ్లీలోప్రధాన ప్రతిపక్షంగా అవతరించిన టీఎంసీ
Meghalaya Congress : మేఘాలయలో కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ..టీఎంసీలోకి 12 మంది ఎమ్మెల్యేలు

12 Congress MLAs Join Trinamool In Meghalaya Congress has failed to play role of main opposition party in the country  says Former Meghalaya CM Mukul Sangma: కాంగ్రెస్‌ పార్టీకి ఈశాన్య రాష్ట్రమైన మేఘాలయలో తాజాగా ఎదురుదెబ్బ తగిలింది. మేఘాలయ అసెంబ్లీలో కాంగ్రెస్‌ పార్టీకి ఉన్న 17 మంది ఎమ్మెల్యేల్లో (17 MLAs) మాజీ సీఎం ముకుల్‌ సంగ్మాతో (Mukul Sangma) పాటు మొత్తం 12 మంది తృణమూల్‌ కాంగ్రెస్‌లోకి ఫిరాయించారు. మేఘాలయ అసెంబ్లీలో విపక్ష నాయకుడిగా వ్యవహరిస్తున్న ముకుల్‌ సంగ్మా కొంతకాలంగా కాంగ్రెస్‌ అధినాయకత్వంపై అసంతృప్తితో ఉన్నారు.

మేఘాలయ కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా విన్సెంట్‌ హెచ్‌. పాలాను నియమించినప్పటి నుంచి ముకుల్‌ సంగ్మాకు ఆయనకు మధ్య విబేధాలు తలెత్తాయి. అలాగే తన అభిప్రాయానికి విలువివ్వకుండా విన్సెంట్‌ నియామకం జరిగిందనేది ఆయన అసంతృప్తికి ప్రధాన కారణం. చివరకు సంగ్మా టీఎంసీ గూటికి చేరారు. 

మొత్తానికి కాంగ్రెస్‌కు చెందిన 12 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. మాజీ సీఎం ముకుల్‌ సంగ్మా తన మద్దతుదారులైన 11 మంది ఎమ్మెల్యేలతో కలిసి తృణమూల్‌ కాంగ్రెస్‌లో (trinamool congress) చేరారు. ఈ మేరకు అసెంబ్లీ స్పీకర్‌ మెత్బా లింగ్డోకు (metbah lyngdoh) తిరుగుబాటు ఎమ్మెల్యేలు లేఖ రాశారు. ఇక కాంగ్రెస్‌కు చెందిన 17 మంది ఎమ్మెల్యేల్లో 12 మంది తమ పార్టీలో చేరినట్లు టీఎంసీ (TMC) ప్రకటించింది. దీంతో మేఘాలయా అసెంబ్లీలో టీఎంసీ ప్రధాన ప్రతిపక్షంగా అవతరించినట్లయింది. ఈశాన్య రాష్ట్రాల్లో పాగా వేయాలని చూస్తున్న టీఎంసీ.. కాంగ్రెస్‌లో ఉన్న గ్రూపు రాజకీయాలను తనకు అనుకూలంగా మలచుకునేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉంది.

Also Read : IND vs NZ 1st Test:మయాంక్ విఫలం..చెలరేగిన గిల్! లంచ్ బ్రేక్ కు భారత్ స్కోర్ ఎంతంటే??

2023లో జరగనున్న మేఘాలయ అసెంబ్లీ ఎన్నికలపై (Meghalaya Assembly elections) ఇప్పటి నుంచే టీఎంసీ కసరత్తు చేస్తోంది. ఎన్నికల వ్యూహకర్త.. మమతా బెనర్జీకి సన్నిహితుడైన ప్రశాంత్‌ కిశోర్‌కు (Prashant Kishore) చెందిన టీమ్ కొంతకాలంగా షిల్లాంగ్‌లో మకాం వేసి క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితిపై సర్వే చేస్తోంది. తాజాగా ముకుల్‌ సంగ్మా చేరికతో టీఎంసీ (TMC) బలపడినట్లైంది. కాగా దేశంలో ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించడంలో కాంగ్రెస్ విఫలమైందంటూ మేఘాలయ మాజీ సీఎం ముకుల్ సంగ్మా అన్నారు.

Also Read : Tomato prices: ప్రభుత్వం చొరవతో అక్కడ కిలో టమాటా ధర రూ.85-100..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News