Discount On Liquor: కరోనా వ్యాక్సిన్ వేయించుకుంటే లిక్కర్ పై డిస్కౌంట్

Discount On Liquor: కరోనా వ్యాక్సిన్ పంపిణీ విస్తృతం చేసేందుకు మధ్యప్రదేశ్​లోని మందసుర్​ జిల్లా అధికారులు వినూత్న ప్రయత్నం చేపట్టారు. రెండో డోసు టీకా తీసుకున్న వారికి మద్యం సీసాలపై 10 శాతం డిస్కౌంట్​ ఇప్పిస్తామని ప్రకటించారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 24, 2021, 10:34 AM IST
Discount On Liquor: కరోనా వ్యాక్సిన్ వేయించుకుంటే లిక్కర్ పై డిస్కౌంట్

Discount On Liquor: కరోనా టీకాను విస్తృతంగా పంపిణీ చేసేందుకు ప్రభుత్వాలు అన్ని విధాలా ప్రయత్నిస్తున్నా.. అనేక చోట్ల ప్రజలు టీకా తీసుకునేందుకు ఇంకా ఆసక్తి చూపడం లేదు. చాలామంది ఒక డోసు టీకాకే పరిమితమయ్యారు. ఈ నేపథ్యంలో రెండో డోసు తీసుకున్న వారికి మద్యం సీసాలపై 10 శాతం డిస్కౌంట్​ ఇస్తామంటూ మధ్యప్రదేశ్​ మందసుర్​ జిల్లా అధికారులు ఆఫర్​ చేస్తున్నారు.

బుధవారం (నవంబరు 24) రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం భారీ ఎత్తున టీకా పంపిణీ కార్యక్రమం చేపట్టనుంది. ఈ సందర్భంగా ఎక్కువమంది రెండో డోసు తీసుకునేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు. తాము ప్రకటించిన ఆఫర్​కు మంచి స్పందన లభిస్తే భవిష్యత్తులో రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో కూడా దీనిని అమలు చేస్తామని మందసుర్​ జిల్లా ఎక్సైజ్​ ఆఫీసర్​ అనిల్​ సచిన్​ వెల్లడించారు.

అధికారుల ప్రతిపాదనను మందసుర్​ బీజేపీ ఎమ్మెల్యే యశ్​పాల్​ సింగ్​ తప్పుపట్టారు. ఇది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కాదని.. దీని వల్ల మద్యం వినియోగాన్ని మరింత ప్రోత్సహించినట్టు అవుతుందని అభిప్రాయపడ్డారు. ఇదే విషయాన్ని బీజేపీ ఎమ్మెల్యే ట్వీట్ చేశారు.    

Also Read:FIR Against Kangana Ranaut: మరో వివాదంలో కంగనా రనౌత్.. ముంబయిలో ఆమెపై కేసు నమోదు

Also Read: త్వరలో తగ్గనున్న ఇంధన ధరలు, చమురు నిల్వలు తీసేందుకు కేంద్రం నిర్ణయం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook  

Trending News