Building Collapses: భివండిలో కూలిన భవనం.. 10 మంది మృతి

మహారాష్ట్ర (Maharashtra) లోని రాయ్‌ఘడ్ జిల్లా మహద్‌ తాలుకాలోని కాజల్‌పురాలో ఐదంతస్థుల భవనం కూలిన సంఘటన మరువక ముందే మరో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. అదే రాష్ట్రంలోని థానే జిల్లా భీవండి పట్టణం (Bhiwandi ) లో మూడంతస్థుల భవనం కూలి చాలామంది ప్రాణాలు కోల్పోయారు.

Last Updated : Sep 21, 2020, 08:45 AM IST
Building Collapses: భివండిలో కూలిన భవనం.. 10 మంది మృతి

Bhiwandi building collapses Incident: భివండి: మహారాష్ట్ర (Maharashtra) లోని రాయ్‌ఘడ్ జిల్లా మహద్‌ తాలుకాలోని కాజల్‌పురాలో ఐదంతస్థుల భవనం కూలిన సంఘటన మరువక ముందే మరో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. అదే రాష్ట్రంలోని థానే జిల్లా భీవండి పట్టణం (Bhiwandi ) లో మూడంతస్థుల భవనం కుప్పకూలి ( building collapses )చాలామంది ప్రాణాలు కోల్పోయారు. మూడంతస్థుల భవనంలో నివసిస్తున్న వారంతా గాఢ నిద్రలో ఉండగానే.. సోమవారం తెల్లవారుజూమున నాలుగు గంటల ప్రాంతంలో అకస్మాత్తుగా కుప్పకూలింది. ఈ ఘోర ప్రమాదంలో 10 మంది మృతి చెందగా.. శిథిలాల కింద మరో 25 మంది చిక్కుకోని ఉంటారని థానే మునిసిపల్ అధికారులు పేర్కొంటున్నారు. అయితే ఈ ప్రమాదం సంభవించగానే.. స్థానికులు హుటాహుటిన 20మందిని కాపాడారు. వెంటనే పోలీసులు, ఎన్‌డీఆర్‌ఎఫ్‌ (NDRF) బృందాలు అక్కడికి చేరుకొని సహాయక చర్యలను చేపట్టారు. ఇంకా రెస్క్యూ కొనసాగుతూనే ఉంది. మరణాల సంఖ్య ఇంకా పెరిగే అవకాశముంది. Also read: Narendra Modi: 7 రాష్ట్రాల సీఎంలతో మోదీ సమావేశం..!

సహాయక చర్యల్లో ఎన్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది ఒక చిన్నారిని సురక్షితంగా బయటకు తీశారు. అయితే భీవండీ పట్టణంలోని పటేల్ కాంపౌండ్ ప్రాంతంలో 1984లో ఈ భవనాన్ని నిర్మించినట్లు మునిసిపల్ అధికారులు వెల్లడించారు. భవనంలో దాదాపు 20కి పైగా ఫ్లాట్లు ఉండగా.. నివాసితులు గాఢ నిద్రలో ఉండగా ప్రమాదం సంభవించింది. అయితే ఆ భవనంలో ఇంకా ఎంతమంది చిక్కుకున్నారనేది స్పష్టంగా తెలియరాలేదు. ఇదిలాఉంటే ఆగస్టు 24న మహారాష్ట్రలోని రాయ్‌ఘడ్‌లో భవనం కూలి దాదాపు 18 మంది వరకు మరణించిన సంగతి తెలిసిందే.  Also read: MS Dhoni: అరుదైన ఘనత సాధించిన ఎంఎస్ ధోనీ

Trending News