Weather Report: ఎండలా.. నిప్పులా కొలిమా.. ? పలు రికార్డులు బద్దలు కొడుతున్న ఉష్ణోగ్రతలు..

 Weather Report: ఎండలా.. నిప్పులా కొలిమా. ఏదో పని పడి బయటకు రావాలంటే భానుడి తన భగభగలతో ప్రజలను ఠారెత్తిస్తున్నాడు. ఈ గురువారం పలు చోట్ల ఉష్ణోగ్రతలు రికార్డు బ్రేక్ చేస్తున్నాయి.

Written by - TA Kiran Kumar | Last Updated : May 3, 2024, 07:14 AM IST
Weather Report: ఎండలా.. నిప్పులా కొలిమా.. ? పలు రికార్డులు బద్దలు కొడుతున్న ఉష్ణోగ్రతలు..

Weather Report: తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా భానుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. ఉదయం 8 గంటల నుంచే సూర్య ప్రతాపం పెరుగుతోంది. ఏదైనా పని ఉండి బయటకు వెళ్లాలంటే భయపడే పరిస్థితులు నెలకొన్నాయి. ఎండ తీవ్రతకు మధ్నాహ్నం రోడ్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. దాదాపు 8 జిల్లాల్లో 46 డిగ్రీలపైనే గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. హైదరాబాద్‌లో కూడా ఎన్నడు లేనట్టుగా ఉష్ణోగ్రతలు సరికొత్త రికార్డు దిశగా పరుగులు తీస్తున్నాయి. హైదరాబాద్ పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు క్రాస్ అయ్యాయి. తెలంగాణలోని ఉమ్మడి నల్గొండ జిల్లా అనుముల పేట ఇబ్రహీం పట్నంలో అత్యధికంగా 46.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయింది. సూర్యాపేట, జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి, వరంగల్, నాగర్ కర్నూల్, కరీంనగర్ జిల్లాల్లో 46 డిగ్రీలపైనే ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి.

నిర్మల్, ఆసిఫా బాద్, ములుగు, నారాయణ పేట, మహబూబ్ నగర్, భూపాలపల్లిలో ప్రాంతాల్లో 45.1 నుంచి 45.8 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. అటు ఆంధ్రప్రదేశ్‌లో ప్రకాశం జిల్లాలో ఎండ్రపల్లిలో 47.1 డిగ్రీల ఆల్ టైమ్ రికార్డు క్రియేట్  చేసింది.  తెలంగాణ, ఏపీ వ్యాప్తంగా వడగాలుల తీవ్రత అధికంగా ఉంది. దీంతో పనులపై బయటకు రావాలంటే భయపడే పరిస్థితులు నెలకొన్నాయి. ఎండ తీవ్రతకు దాదాపు నలుగురు మృతి చెందారు.

గత పది రోజులు భానుడు తన ప్రతాపం చూపిస్తూనే ఉన్నాడు. మొత్తంగా ఉదయం 8 గంటలకు ప్రారంభమైన భానుడి ప్రతాపం.. సాయంత్రం ఐదున్నర ఆరు గంటల వరకు కొనసాగుతూనే ఉంది. రోడ్లపై వేడి సెగతో ద్విచక్ర వాహనదారులు ప్రయాణం చేయడానికి అల్లాడిపోతున్నారు. అటు వ్యవసాయ పనులు చేసేవారు, భవన నిర్మాణ కార్మికులు కూడా ఎండ వేడికి ఠారెత్తిపోతున్నారు.

మొత్తంగా ఎండల్లో తిరిగే వారు.. తలపై ఏదైనా రుమాలు, టోపీ లాంటి పెట్టుకోకుండా బయటకు వెళ్లొద్దని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. అంతేకాదు అత్యవసర పనులపై బయటకు వెళ్లేవారు నీళ్లు క్యారీ చేయడం ఉత్తమం. కొబ్బరి బొండం నీళ్లతో పాటు పండ్లను.. ఇతర ఫ్రూట్ జ్యూస్ తీసుకోవడం ఒంట్లో ఉన్న వేడి చల్లబడుతోంది.

Also Read: Revanth Reddy: తెలంగాణకు మోదీ ఇచ్చిందేమీ లేదు 'గాడిద గుడ్డు' తప్ప: రేవంత్‌ రెడ్డి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News