Heavy Rains in Telangana: హైదరాబాద్ లో కురుస్తున్న భారీ వర్షాలకు పలు కాలనీలతో సహా లోతట్టు ప్రాంతాలన్నీ నీటమునిగాయి. రహదారులన్నీ జలమయమయ్యాయి. దీంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలతో హైదరాబాద్ లో రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది. మియాపూర్ లో అత్యధికంగా 14 సెంటీమీటర్లు, అత్యల్పంగా బహదూరాపురాలో 8.2 సెంటీమీటర్ల రెయిన్ ఫాల్ నమోదైందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. ఎమర్జెన్సీ అయితే తప్ప బయటకు రావద్దని జీహెచ్ఎంసీ అధికారులు స్పష్టం చేశారు.
తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు వివిధ జిల్లాల్లోని చెరువులు, కుంటలు, జలాశయాలు జలకళను సంతరించుకున్నాయి. వచ్చే మూడు రోజులు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో అలర్ట్ గా ఉండాలని జిల్లా కలెక్టర్లను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కారదర్శి శాంతికుమారి ఆదేశించారు. తాజాగా కలెక్షర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎస్.. జిల్లాల్లోని పరిస్థితులు గురించి అడిగి తెలుసుకున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో జరిగే నష్టాన్ని నివారించడానికి సంబంధిత మండల, పంచాయతీరాజ్ తదితర అధికారులతో తరుచూ టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించాలని అధికారులను సీఎస్ ఆదేశించారు. ప్రభావిత ప్రాంతాల నుంచి ప్రజలను తరలించడంతోపాటు వారికి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసేలా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని సీఎస్ సూచించారు.
వచ్చే రెండు రోజులపాటు భారీ వర్షాలు
అల్పపీడన ప్రభావంతో రానున్న రెండు రోజుల్లో తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. బుధవారం, గురువారాల్లో రాష్ట్రంలో ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది ఐఎండీ. ఇప్పటి వరకు రాజన్న సిరిసిల్ల, నిజామాబాద్ జిల్లాల్లో 60 శాతానికిపైగా వర్షపాతం నమోదైంది. ఇప్పటివరకు ఉత్తరవాయువ్య జిల్లాల్లో ఎక్కువగా వర్షాలు పడ్డాయని ఐఎండీ పేరకొంది.
Also Read: Heavy Rains Alert: తెలంగాణలో భారీ వర్షాలు, స్కూళ్లకు సెలవులు, ఏయే జిల్లాల్లో రెడ్ అలర్ట్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook