Telangana - Jan Lok Poll Survey: తెలంగాణ లోక్ సభ ఎన్నికలపై సీ ఓటర్ సంచలన సర్వే.. ఆ పార్టీ వైపే ప్రజల మొగ్గు..

Telangana Lok Sabha 2024: దేశ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల హడావుడి నెలకొంది. ఇప్పటికే వివిధ పార్టీలు ఎన్నికల్లో గెలవడానికి వ్యూహ ప్రతి వ్యూహాలు రచిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా విడుదలైన జన్ లోక్ పాల్ సర్వే మరో సంచలన సర్వే విషయాలను పంచుకుంది.

Written by - TA Kiran Kumar | Last Updated : Apr 17, 2024, 12:48 PM IST
Telangana - Jan Lok Poll Survey: తెలంగాణ లోక్ సభ ఎన్నికలపై సీ ఓటర్ సంచలన సర్వే.. ఆ పార్టీ వైపే ప్రజల మొగ్గు..

Telangana Lok Sabha Elections 2024: 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పిటి నుంచి ఇక్కడ రాజకీయ ముఖ చిత్రమే మారిపోయింది. అటు ఈ ఎన్నికల్లో బీజేపీ అనూహ్యంగా పుంజుకొని 8 సీట్లు గెలవడంతో ఈ పార్టీలో జోష్‌ పెరిగింది. మరోవైపు ప్రధాన మంత్రి మోదీ మేనియా కూడా ఆ పార్టీకి కలిసొచ్చే అంశాలున్నాయి. మరోవైపు మాజీ సీఎం కవిత అరెస్ట్ వ్యవహారంతో బీఆర్ఎస్ శ్రేణులు నైరాశ్యంలో కూరుకుపోయాయి. దీంతో లోక్ సభ ఎన్నికల్లో ప్రధాన పోటీ బీజేపీ Vs కాంగ్రెస్ అన్నట్టుగా తయారైంది.

ఈ సారి తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ డబుల్ డిజిట్ లక్ష్యంగా పెట్టుకుంది. అందుకు తగ్గట్టు కార్యాచరణ ప్రణాళిక రచిస్తోంది. ఈ సారి తెలంగాణ ఎన్నికల్లో అత్యధిక సీట్ల లక్ష్యంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇక్కడ 15కు పైగా ఎన్నికల ప్రచార సభలు.. రోడ్‌ షోలు నిర్వహించనున్నారు. మరోవైపు తమిళనాడు నుంచి అన్నామలై, కర్ణాటక నుంచి తేజస్వీ సూర్య, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు కేంద్ర మంత్రులైన అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, స్మృతి ఇరానీ వంటి నేతలు కూడా ఇక్కడ ప్రచారంలో పాల్గొనబోతున్నారు.

ఈ సారి ఎన్నికల్లో బీఆర్ఎస్ ఖాతా తెరవాలని చూస్తుంది. దీని కోసం పార్టీ అధ్యక్షుడు కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, హరీష్ రావు వంటి నేతలు ఇప్పటి నుంచే ప్రచారంలో దిగనున్నారు. కేసీఆర్ భారీ బహిరంగ సభలు పెట్టనున్నారు. ముఖ్యంగా మెదక్, నాగర్ కర్నూల్ స్థానాలపై వీళ్లు గురిపెట్టినట్టు సమాచారం.

ఇప్పటి వరకు అన్ని సర్వేలు నంబర్స్ మీద సర్వేలు వచ్చాయి. ఈ సర్వే ప్రకారం ఈ సారి లోక్‌ సభ ఎన్నికల్లో ఆయా పార్టీలకు వచ్చే ఓట్ షేర్ ఇక్కడ ఇచ్చింది.

15 మార్చి 2024  నుంచి 15 ఏప్రిల్ 2024 మధ్య ఇచ్చారు.
ఇందులో  కాంగ్రెస్ పార్టీకి గత నెలలో 35.40 % శాతం ఉంటే..  +0.61 % ఓటు శాతం పెరిగి 36.01 % కి చేరింది.
మరోవైపు BJP గత నెల వరకు 29.23 %  నుంచి +3.99 % పెరిగి 33.22% కి పెరిగింది.
ఇక BRS గత నెలలో 26.42% నుంచి -3.71% ఓటింగ్ పడిపోయి 22.71% ఉంది.
ఇతరులు 8.95 %  నుంచి తగ్గి 0.89% తగ్గి 8.06 % పరిమితమైంది.

మొత్తంగా తెలంగాణలో వచ్చే నెల13న 4వ విడతలో ఎన్నికల జరగనున్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ ప్రకటించిన క్యాండిడేట్స్ అంతా ఇన్‌ఫ్లూయిన్స్ చేసేవాళ్లు కాదనే వాదన వినిపిస్తున్నాయి. ఒకవేళ బీఆర్ఎస్ పుంజుకుంటే అది కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకుకు గండిపడే అవకాశం  ఉంది. మొత్తంగా ఈ సర్వేలో బీజేపీ దాదాపు 4 శాతం వరకు ఓట్ షేర్ పెంచుకుంటే.. కాంగ్రెస్ పార్టీ 0 .61శాతం పెంచుకుంది. రాబోయే ఈ రోజుల్లో గాలి  ఎటు మల్లుతుందో చూడాలి. అటు న్యూస్ ఎక్స్ సర్వేలో  తెలంగాణలో కాంగ్రెస్ పారటీ  8 ఎంపీ సీట్లు.. బీజేపీ 5 ఎంపీ.. బీఆర్ఎస్ 3 ఎంపీ సీట్లు గెలిచే అవకాశాలున్నాయిని పేర్కొంది.

Read More: Happy Sri Rama Navami 2024: శ్రీ రాముడి స్పెషల్ కోట్స్, శక్తివంతమైన స్తోత్రాలు మీకోసం..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News