Mystery Respiratory Virus: హైదరాబాద్‌లో మిస్టరీ వైరస్.. లక్షణాలు ఇవే..!

Hyderabad Mystery Respiratory Viru Symptoms: హైదరాబాద్‌లో కొత్త వైరస్ విస్తృతంగా వ్యాపిస్తోంది. శ్వాసకోశ సంబంధిత జబ్బులు ఉన్నా.. స్వైన్ ఫ్లూ టెస్టులు చేయగా నెగిటివ్ రిజల్ట్స్ వచ్చాయి. దీంతో మిస్టరీ వైరస్ ఏంటి అని వైద్య నిపుణులు ఆరా తీస్తున్నారు. లక్షణాలు ఏంటంటే..?  

Written by - ZH Telugu Desk | Last Updated : Sep 2, 2023, 11:37 PM IST
Mystery Respiratory Virus: హైదరాబాద్‌లో మిస్టరీ వైరస్.. లక్షణాలు ఇవే..!

Hyderabad Mystery Respiratory Viru Symptoms: కరోనా నుంచి పూర్తిగా కోలుకుని ప్రజలు తమ పనుల్లో బిజీగా ఉన్న తరుణంలో హైదరాబాద్‌ను మిస్టరీ వైరస్ భయపెడుతోంది. స్వైన్ ఫ్లూ, ఇన్‌ఫ్లుఎంజా, అడెనోవైరస్ వంటి లక్షణాలతో ఉండే ఈ వైరస్ బారినపడి ఆసుపత్రుల్లో చేరుతున్నారు. ఇది అంతర్లీన ఆరోగ్య పరిస్థితులతో పిల్లలు, పెద్దలపై ప్రభావం చూపిస్తోంది. స్వైన్ ఫ్లూ, కోవిడ్-19, ఇన్‌ఫ్లుఎంజా కోసం విస్తృతమైన పరీక్షలు నిర్వహించగా.. ఎక్కువగా నెగిటివ్ రిజల్ట్స్‌ వచ్చాయి. అయితే ఈ మిస్టరీ వైరస్ గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆరోగ్య నిపుణులు అన్నారు. వైరస్ రికవరీ రేటు 100 శాతం వద్ద ఉందని.. రోగులు సాధారణంగా ఐదు రోజులలో కోలుకుంటారని చెప్పారు. ఇది వైరల్ ఇన్‌ఫెక్షన్లకు ప్రామాణిక వ్యవధి అని తెలిపారు.

ఈ మిస్టరీ వైరస్ లక్షణాలు ముక్కు కారటం, గొంతు నొప్పి, పొడి దగ్గు, జ్వరంతో పాటు శరీర నొప్పులు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు కలిగి ఉంటాయి. ప్రతి 100 మంది వ్యక్తులలో ఆరు నుంచి ఏడుగురు ఈ వైరస్ బారిన పడ్డారు. వారిలో తక్కువ అభివృద్ధి చెందిన రోగనిరోధక వ్యవస్థ కారణంగా పిల్లల్లో 50శాతం కేసులు నమోదయ్యాయి. ఇతర 50 శాతం మంది రోగులను ధూమపానం చేసేవారుగా ఉన్నట్లు గుర్తించారు.

ఈ వ్యాధి లక్షణాలు మొదట్లో ఎగువ శ్వాసకోశంలో కనిపిస్తాయి. తరువాత దిగువ శ్వాసకోశాన్ని ప్రభావితం చేస్తాయి. ఇన్‌ఫ్లుఎంజా A, B, స్వైన్ ఫ్లూ (H1N1), ఏవియన్ ఫ్లూ (H3N2), డెంగ్యూతో సహా వివిధ వైరస్‌ల కోసం పరీక్షలు నిర్వహించారు. ముఖ్యంగా ఈ పరీక్షల్లో కొన్ని తప్పుడు సానుకూల ఫలితాలు వచ్చాయి. అదృష్టవశాత్తూ ముందస్తుగా గుర్తించడంతో చికిత్సను త్వరగా అందిస్తున్నారు.  శ్వాసకోశ సమస్యలు ఎదుర్కొంటున్న వారికి ఓసెల్టామివిర్ అనే యాంటీవైరల్ ఔషధంతో చికిత్స చేస్తారు.

ఇది మంచి ఫలితాలను ఇచ్చింది. చికిత్సతో పాటు రోగులు హైడ్రేషన్‌ను కొనసాగించాలని.. పూర్తిగా కోలుకునే వరకు ఐసోలేషన్‌ను పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. తుమ్మినప్పుడు లేదా దగ్గేటప్పుడు ముక్కు, నోటిని కప్పుకోవడం, N95 మాస్క్‌లు ధరించడం, సామాజిక దూరం పాటించడం, రెగ్యులర్ శానిటైజేషన్, ఇన్‌ఫ్లుఎంజా టీకాలు వేయడం వంటి జాగ్రత్తలు పాటించాలని సూచించారు. 

Also Read: Deepthi Murder Case: దీప్తి హత్య కేసులో సంచలన విషయాలు.. దారుణంగా చంపేసిన చందన  

Also Read: Mission Aditya L1: నింగిలోకి దూసుకెళ్లిన ఆదిత్య L1.. ఇస్రో మరో ప్రయోగం సక్సెస్  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News