Hyderabad: ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో జోరుగా ప్రచారం జరుగుతుంది. విమర్శలకు ప్రతి విమర్శలు చేస్తూ పొలిటికల్ లీడర్స్ ముందుకు వెళుతున్నారు. ఇటీవలే కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించటంతో అసమ్మతి నేతలు పార్టీలు మారుతున్న తరుణంలో తెలంగాణలో ఆసక్తి నెలకొంది.
అయితే ఎన్నికల నేపథ్యంలో పోలీసుల తనిఖీలో లక్షల్లో డబ్బులు పట్టుబడుతున్నాయి. ఎన్నికల ప్రవర్తన నియమావళిలో శుక్రవారం పోలీస్ అథారటీ ద్వారా 2,56,84,671 సీజ్ చేయగా ఇప్పటివరకు 42,28,92,639 నగదును సీజ్ చేశారు. ఎఫ్.ఐ.ఆర్ లు 28 నమోదు కాగా ఇప్పటి వరకు 378 నమోదు చేయడం జరిగింది.
లా అండ్ ఆర్డర్ కింద లైసెన్స్ ఆయుధాలను ఈ రోజు 10 సేకరించగా ఇప్పటి వరకు 4,449 ఆయుధాలను సేకరించారు. సి.ఆర్.పి.సి కింద నేడు 43 కేసులు ఉండగా ఇప్పటి వరకు 586 కేసులు నమోదయ్యాయి. ఈ రోజు 145 బైండోవర్ చేయగా ఇప్పటి వరకు 1609 బైండోవర్ చేయడం జరిగింది. నక్కాస్ ఆపరేషన్ 132 ఇప్పటి వరకు 1084 నక్కాస్ ఆపరేషన్స్ చేసారు. నేడు నాన్ బెయిలబుల్ వారంట్ 58 కాగా మొత్తం 715 కేసులు నమోదయ్యాయి.
ఎం.సి.సి కింద పబ్లిక్ ప్రాపర్టీస్ లో శుక్రవారం 57 వాల్ రైటింగ్ తొలగించగా.. ఇప్పటి వరకు 5147 తొలగించారు. నేడు 1048 పోస్టర్లను తొలగించగా మొత్తం 72,847 పోస్టర్లను తొలగించగా.. బ్యానర్ల విషయానికి వస్తే.. నేడు 364 బ్యానర్లను తొలగించగా.. ఇప్పటి వరకు 23,856 బ్యానర్లను తొలగించారు. నేడు 1114 విగ్రహాల మూసివేత, మొత్తం 78,407 చేపట్టారు.
Also Read: Onion Price Hike: ఆకాశాన్నంటుతున్న ఉల్లి ధరలు, తెలుగు రాష్ట్రాల్లో కిలో 60 రూపాయలు
ప్రైవేట్ ప్రార్టీలలో నేడు 163 పోస్టర్లను తొలగించగా ఇప్పటి వరకు 19,591 పోస్టర్లను తొలగించారు. నేడు 77 బ్యానర్లు తొలగించగా ఇప్పటి వరకు 4,863 తొలగించడం జరిగింది. నేడు 163 విగ్రహాల మూసివేత, మొత్తం 20,872 చేపట్టారు.ఎక్సైజ్ శాఖ ద్వారా శుక్రవారం 2129 లీటర్ల లిక్కర్ ను సీజ్ చేయడమైనది.
Also Read: JD Lakshminarayana: ఏపీ సీఎం జగన్‌ను ప్రశంసలతో ముంచెత్తిన సీబీఐ మాజీ అధికారి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..
.