Hyderabad Metro Rail Record: హైదరాబాద్ మెట్రో రైలుతో ప్రయాణికలు అనుబంధం కొనసాగుతూనే ఉంది. ప్రతి రోజూ సగటున 5 లక్షల మంది ప్రయాణికులు మెట్రో రైలులో తమ డెస్టినేషన్ చేరుకుంటున్నారు. తాజాగా మెట్రో రైలు 50 కోట్ల ప్రయాణికుల మైలురాయిని చేరుకున్నట్టు హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ తెలిపారు. ఈ సందర్భంగా ప్రయాణికుల కోసం ప్రత్యేకంగా గ్రీన్ మైల్ లాయల్టీ క్లబ్‌ను శుక్రవారం మెట్రో రైల్ సంస్థ ప్రారంభించింది. ప్రస్తుతం ఉన్న హైదరాబాద్ మెట్రో రైలు నెట్‌వర్క్‌ను 5 దశల్లో 69.2 కిలో మీటర్ల మేర పూర్తి చేశారు. ఎంజీబీఎస్ నుంచి ఫలక్‌నుమా పాతబస్తీ అలైన్‌మెంట్ మాత్రం ఇంకా పూర్తి కాలేదు. త్వరలో అక్కడ పనులు ప్రారంభం కానున్నాయి. హైదారాబాద్ మెట్రో రైలును 2017 నవంబర్ 29న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. ముందుగా మియాపూర్ - అమీర్ పేట - నాగోల్ రూట్లో సేవలు మొదలయ్యాయి.
ఆ తర్వాత దశల వారీగా 69.2 కిలో మీటర్ల రూట్ అందుబాటులోకి వచ్చింది కారిడార్ - 1 మియాపూర్ నుంచి ఎల్బీ నగర్ రూట్లో రోజుకు సగటున రెండున్నర లక్షల మంది ప్రయాణిస్తున్నారు. అటు కారిడార్ -3 నాగోల్ - రాయ దుర్గం మార్గంలో దాదాపు రెండున్నర నుంచి మూడు లక్షల మంది ప్రయాణం చేస్తున్నారు. కారిడార్ - 2 జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ మార్గంలో కొంత దూరమే అందుబాటులోకి రావడంతో అక్కడ చాలా తక్కువ మందే ప్రయాణం కొనసాగిస్తున్నారు. నిత్యం ప్రయాణం చేస్తున్న 5 లక్షల మంది ప్రయాణికుల్లో ఐటీ ఉద్యోగులే దాదాపు లక్షన్నర మంది ఉన్నారు. విద్యార్ధులు 1.2 లక్షల మంది ఉన్నట్టు తెలిపారు. జూలై 2023లో 40 కోట్ల ప్రయాణికుల మైలురాయిని అందుకుంది. మే 1 2024న యేడాది లోపే 50 కోట్ల ప్రయాణికుల మైలురాయిని అందుకోవడం విశేషం.
ప్రస్తుతం మెట్రో రైళ్లకు డిమాండ్ ఏర్పడింది. తక్కువ ఖర్చుతో ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ప్రయాణం సాగుతుండటంతో ఎక్కువ మంది పీక్ టైమ్‌లో మెట్రోలో ప్రయాణించడానికి ఇంట్రెస్ట్ చూపెడుతున్నారు. సరిపడా మెట్రో రైల్లు లేకపోవడంతో ప్రయాణికులు ఎన్నో ఇబ్బందులను ఫేస్ చేయాల్సి వస్తోంది. సరిపడా మెట్రో రైల్లు లేకపోవడంతో పాత గవర్నమెంట్ లీజుకైనా తీసుకొని మెట్రో రైల్లు నడపాలని ఆదేశించింది. కొత్త ప్రభుత్వం రావడంతో ఆ ప్రయత్నం ముందుకు సాగలేదు. కొత్త ప్రభుత్వం ఇచ్చే ఆదేశాలను బట్టి మెట్రో నడుచుకునే అవకాశాలున్నాయి. ప్రస్తుతం మెట్ర కారిడార్ -2 లో ఎంజీబీఎస్ నుంచి ఫలక్‌నుమా.. చంద్రాయణా గుట్ట టూ ఎయిర్ పోర్ట్ వరకు పనులను త్వరలో మొదలు పెట్టనున్నారు.
మెట్రోరైళ్లు చాలక.. ప్రయాణికుల ఆదరణతో మెట్రోరైలు ఎప్పటికప్పుడు సరికొత్త మైలురాళ్లు చేరుకుంటోంది. ఉదయం, సాయంత్రం మెట్రోరైళ్లు చాలక ప్రయాణికులకు తిప్పలు తప్పడం లేదు. సరిపడా మెట్రోరైళ్లు లేకపోవడమే దీనికి కారణం. గత ప్రభుత్వం లీజుకైనా తీసుకుని నడపాలని ఆదేశించింది. ప్రభుత్వం మారడంతో ఈ ప్రతిపాదన అటకెక్కింది. కొత్త సర్కారు ఆదేశాలను బట్టి మెట్రో నడుచుకునే అవకాశం ఉంది. ఎన్నికలు ముగిసిన అనంతరం సీఎంతో భేటి తర్వాత దీనిపై స్పష్టత వచ్చే సూచనలు ఉన్నాయి.
Also Read: Revanth Reddy: తెలంగాణకు మోదీ ఇచ్చిందేమీ లేదు 'గాడిద గుడ్డు' తప్ప: రేవంత్ రెడ్డి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter