Wrong Combination with papaya: బొప్పాయి ఆరోగ్యకరమైన పండు ఇది అన్నీ సీజన్లలో అందుబాటులో ఉంటుంది. ముఖ్యంగా ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. అంతేకాదు ఇందులో గ్లైసెమిక్ సూచి కూడా తక్కువ, సులభంగా జీర్ణం అవుతుంది కూడా. బొప్పాయిలో విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అయితే, కొన్ని రకాల ఆహారాలు బొప్పాయితో కలిపి తినకూడదు. అవి ఏంటో తెలుసుకుందాం.
పాలు..
బొప్పాయిలో పప్పైన్, కైమోపపైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. దీన్ని పాలతోపాటు తీసుకోకూడదు. ఎందుకంటే పాలు, యోగార్ట్‌తో కలిపి తీసుకోకూడదు. దీంతో అజీర్తి, గ్యాస్, కడుపులో నొప్పి సమస్యలు మొదలవుతాయి.
పచ్చి బొప్పాయి..
పండిన బొప్పాయి ఎంతో రుచికరంగా ఉంటుంది. పచ్చని లేదా పండని బొప్పాయి లేటెక్స్ ఉంటుంది. ఇది గొంతులో అలెర్జీ సమస్యకు దారితీస్తుంది. ఇందులో ఎక్కువ ప్రోటీన్లు ఉంటాయి. బొప్పాయిలో ఉండే ఎంజైమ్‌లు ప్రోటీన్ సులభంగా విడగొడతాయి. ఇది జీర్ణ సమస్యలకు దారితీస్తుంది. బొప్పాయితో కలిపి మటన్, చేపలు, తోఫు కూడా తీసుకోకూడదు. ఇవి జీర్ణ సమస్యలను కలిగిస్తుంది.
పులియబెట్టిన ఆహారాలు..
పులియబెట్టిన ఆహారాలలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కిమ్చి కొన్ని రకాల పచ్చల్లో ప్రోబయోటిక్స్, ఎంజైమ్‌లు ఉంటాయి. బొప్పాయితో కలిపి ఈ ఆహారాలు తీసుకుంటే జీర్ణ సమస్యలకు దారితీస్తుంది.
ప్రోటీన్ ఫుడ్స్..
బొప్పాయిలో ఉండే ఎంజైమ్ ప్రోటీన్లను సులభంగ విడగొడుతుంది. ఇది జీర్ణ సమస్యలకు దారితీస్తుంది. ప్రోటీన్ ఎక్కువగా ఉన్న ఆహారాలు తీసుకోవడం మానుకోవాలి. అంటే మాంసం, చేపలు, తోఫులో ప్రోటన్లు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీటితోపాటు బొప్పాయి తినకూడదు.
ఇదీ చదవండి: ఈ ఉల్లిపాయలు ఆరోగ్యానికి హానికరం.. వండుకునే ముందు తస్మాత్ జాగ్రత్త..!
కొవ్వు ఆహారాలు..
బొప్పాయిలో కొవ్వులు తక్కువగా ఉంటాయి. దీన్ని ఎక్కువ ప్రోటీన్ ఉండే ఆహారాలతో పాటు కలిపి తీసుకోకూడదు. అంటే ఫ్రైడ్ ఆహరాలు,ఫ్యాటీ మాంసం, క్రీమీ సాస్ వీటితో కలిపి తింటే జీర్ణ సమస్యలకు దారితీస్తుంది. ఇది కడుపులో అజీర్తి, ఉబ్బరానికి దారితీస్తుంది.
స్పైసీ ఫుడ్స్..
బొప్పాయితో కలిపి అతిగా మసాలాలు ఉండే ఆహారాలు తినకూడదు. ఇది కూడా కడుపు సంబంధిత సమస్యలకు దారితీస్తుంది. మసాలాలు ఎక్కువగా ఉండే ఆహారాలతో బొప్పాయి కలిపి తీసుకోవడం వల్ల యాసిడ్ రిఫ్లక్స్, గుండె మంటకు కూడా దారితీస్తుంది.
సోయా ఫుడ్స్..
సోయా ఉత్పత్తులతో కలిపి కూడా బొప్పాయి తినకూడదు. ఇందులో ఖనిజాలు కూడా పుష్కలంగా ఉంటాయి.
ఇదీ చదవండి: ఈ 4 సూపర్ ఫుడ్స్ తో మంచి నిద్ర.. గుండె ఆరోగ్యం.. మీ డైట్లో ఉన్నాయా?
సిట్రస్ పండ్లు..
బొప్పాయి అంటేనే సిట్రస్ పండు దీంతో ఇతర సిట్రస్ పండ్లు అంటే విటమిన్ సీ ఉండే ఆహారాలు తినకూడదు. ఇది యాసిడిటీ, గుండెమంటకు దారితీస్తుంది.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం. వీటిని పాటించే ముందు వైద్య సలహా తీసుకోవాలి. ఈ సమాచారాన్ని Zee Media ధృవీకరించలేదు)
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి