World Cancer Day 2023: క్యాన్సర్ సోకడానికి ఐదు కారణాలు ఏంటో తెలుసా ?

World Cancer Day 2023: ఫిబ్రవరి 4న యావత్ ప్రపంచం వరల్డ్ క్యాన్సర్ డే ని జరుపుకుంటోంది. క్యాన్సర్ వ్యాధిపై ప్రపంచానికి అవగాహన కల్పించే లక్ష్యంతోనే వరల్డ్ క్యాన్సర్ డేని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా క్యాన్సర్ వ్యాధికి కారకాలుగా నిలిచిన కొన్ని సాధారణ అంశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 3, 2023, 07:10 PM IST
World Cancer Day 2023: క్యాన్సర్ సోకడానికి ఐదు కారణాలు ఏంటో తెలుసా ?

World Cancer Day 2023: వరల్డ్ క్యాన్సర్ డే గురించి కొన్ని ఆసక్తికరమైన అంశాలను తెలుసుకుందాం. క్యాన్సర్ వ్యాధి సోకడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఇందులో అతి ముఖ్యమైనవి మనిషి లైఫ్ స్టైల్ కాగా తీసుకునే ఆహారం మరో కారణం. ఈ రెండూ ప్రధానమైనవి. ఇవే కాకుండా ఇంకెన్నో కారణాలు క్యాన్సర్ వ్యాధికి కారకాలుగా నిలిచాయి. క్యాన్సర్ వ్యాధిని ఎంత త్వరగా గుర్తిస్తే అది నయం అవడానికి అంత ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఎంత ఆలస్యంగా గుర్తిస్తే.. చికిత్స అంత క్రిటికల్ అవుతుంది. 

స్మోకింగ్..
పొగ తాగడం, పొగాకు ఉత్పత్తులు సేవించడం క్యాన్సర్ బారిన పడటానికి ప్రధాన కారణం అవుతున్నాయి. నేరుగా ఊపిరితిత్తుల పని తీరును దెబ్బ తీయడంతో పాటు నోరు, గొంతు భాగాలు చెడిపోయి క్యాన్సర్ సోకే అవకాశాలు అధికంగా ఉంటాయి. అందుకే సాధారణ వ్యక్తుల జీవిత కాలంతో పోలిస్తే.. స్మోకింగ్ చేసే వారి జీవిత కాలం చాలా తక్కువగా ఉంటుందని అనేక అధ్యయనాల్లో తేలింది.

ఒబేసిటీ..
స్థూలకాయంతో బాధపడే వారిలో చాలా మంది లావుగా ఉండటం వల్ల తమ అందం దెబ్బతింటోంది అని మాత్రమే ఆందోళన చెందుతుంటారు. లావుగా ఉండటం వల్ల అంద వికారంగా కనిపిస్తున్నాం అనే ఆందోళన వారిని వెంటాడుతుంటుంది. కానీ లావుగా తయారవ్వడం వల్ల కంటికి కనపడని మరో అతి పెద్ద సమస్య ఏంటంటే.. కాలక్రమంలో క్యాన్సర్ బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉండటం. లావుగా ఉండే వారిలో హై బిపి, టైప్ 2 డయాబెటిస్ తో పాటు వివిధ రకాల క్యాన్సర్ల బారిన పడే ప్రమాదం కూడా ఎక్కువే అని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.

ఆల్కాహాల్ సేవించడం
మోతాదుకు మించి ఆల్కాహాల్ సేవించే అలవాటు ఉన్న వారు క్యాన్సర్ వ్యాధి బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉందని పలు పరిశోధనల్లో తేలింది. మద్యం సేవించే అలవాటు ఉన్న వారు స్మోకింగ్ కూడా చేస్తే.. వారికి క్యాన్సర్ సోకే అవకాశాలు అత్యధికం.

ఆహారపు అలవాట్లు
జంక్ ఫుడ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్, నిల్వ చేసిన మాంసం, గ్యాస్ బబుల్స్ ఉండే డ్రింక్స్ తీసుకోవడం వల్ల పేగు క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. 

ఇన్‌ఫెక్షన్స్..
కొన్నిరకాల ఇన్‌ఫెక్షన్స్ శరీరంలో దీర్ఘకాలంపాటు ఉండటం వల్ల అవి క్యాన్సర్‌కి దారి తీసే ప్రమాదం ఉంది.

ఇది కూడా చదవండి : Free Life Insurance Scheme: ఈపీఎఫ్ ఖాతాదారులకు రూ. 7 లక్షల బెనిఫిట్

ఇది కూడా చదవండి : Budget 2023: కేంద్రం ఇచ్చేది 6 శాతం తీసుకునేది 12 శాతం.. ఏంటో తెలుసా ?

ఇది కూడా చదవండి : Reasons For Rejecting Loans: శాలరీ భారీగా ఉన్నప్పటికీ.. బ్యాంకు లోన్ ఎందుకు రిజెక్ట్ అయిందో తెలుసా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News