Urinary Tract Infection: మహిళలు ఈ పండు తింటే చాలు.. వారికి UTI సమస్య దరిచేరదు..

Urinary Tract Infection In Women: మహిళలకు ఎండకాలం వచ్చిందంటే చాలు యూరినరీ ఇన్ఫెక్షన్‌తో బాధపడతారు. ఇది ప్రస్తుతం చాలామంది మహిళలను వేధిస్తున్న సమస్య. దీంతో వైద్యులను సంప్రదించి మందులు తీసుకుంటున్నారు.

Written by - Renuka Godugu | Last Updated : Mar 28, 2024, 03:20 PM IST
Urinary Tract Infection: మహిళలు ఈ పండు తింటే చాలు.. వారికి UTI సమస్య దరిచేరదు..

Urinary Tract Infection In Women: మహిళలకు ఎండకాలం వచ్చిందంటే చాలు యూరినరీ ఇన్ఫెక్షన్‌తో బాధపడతారు. ఇది ప్రస్తుతం చాలామంది మహిళలను వేధిస్తున్న సమస్య. దీంతో వైద్యులను సంప్రదించి మందులు తీసుకుంటున్నారు. కానీ, కొంతమందిలో ఈ సమస్య మళ్లీ వస్తుంది. దీనికి వైద్యులు కొన్ని జీవనశైలి మార్పులు, మందులను సూచిస్తారు. అయితే, ఇవి కాకుండా కొన్ని పండ్లను మన డైట్లో చేర్చుకుంటే యూరినరీ ట్రాక్ట్‌ ఇన్ఫెక్షన్ నుంచి బయటపడొచ్చు. ఇందులోని నీటి శాతం వల్ల ఎండ వేడిమి నుంచి బయటపడొచ్చు. పుచ్చకాయ మన శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది. అందుకే యూటీఐ సమస్య ఉన్నవారు సులభంగా ఉపశమనం పొందవచ్చు. అది ఎలాగో తెలుసుకుందాం.

ఎండకాలం వచ్చిందంటే చాలు మార్కెట్లో పుచ్చకాయలు ఎక్కువగా విక్రయిస్తారు. ఇది మనల్ని ఎండ వేడిమి నుంచి రక్షిస్తుంది. పుచ్చకాయలో 92 శాతం వరకు నీరు ఉంటుంది. అందుకే ఇది మనల్ని డీహైడ్రేషన్‌కు గురికాకుండా కాపాడుతుంది. వేసవికాలం అందరూ ఇలాంటి దాహార్తిని తీర్చే పండ్లవైపు పరుగెడుతారు. అయితే, మహిళలు ముఖ్యంగా యూరినరీ ట్రాక్ట్‌ ఇన్ఫెక్షన్‌కు గురికాకుండా పుచ్చకాయను తమ డైట్లో చేర్చుకోవాలి. ఇది సులభంగా యూటీఐ సమస్య దరిచేరకుండా కాపాడుతుంది.మహిళలకు యూరినరీ ట్రాక్ట్‌ ఇన్ఫెక్షన్ వేధించనప్పుడు యూరిన్‌లో బ్యాక్టిరియా పెరుగుతుంది. ఇలాంటి వారు పుచ్చకాయను తీసుకోవాలి. ఇందులో ఉండే నీటి పరిమాణం వల్ల మన శరీరంలో నీటి పరిమాణం కూడా పెరుగుతుంది. దీంతో సులభంగా యూరినరీ ట్రాక్ట్‌ ఇన్ఫెక్షన్ నుంచి బయటపడొచ్చు.

ఇదీ చదవండి:  ఈ 6 లక్షణాలు కనిపిస్తే గుండెపోటే..! ఏం చేయాలంటే..?

ఈ యూరినరీ ట్రాక్ట్‌ ఇన్ఫెక్షన్ నీరు తక్కువగా తీసుకోవడం వల్ల వస్తుంది. నీటి పరిమాణం అధికంగా ఉండే పుచ్చకాయ తినడం వల్ల మూత్రంలో మంట సమస్య కూడా పోతుంది. పుచ్చకాయ శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది. పుచ్చకాయను జ్యూస్ లేదా సలాడ్ రూపంలో తీసుకోవచ్చు. నేరుగా కూడా పుచ్చకాయను కట్‌ చేసి తినవచ్చు. 

ఇదీ చదవండి: ఖర్బూజా గింజలను పారేస్తున్నారా? ఈ 6 ప్రయోజనాలు మిస్సయినట్లే..

అయితే, పొరపాటున కూడా పుచ్చకాయను ఫ్రిజ్‌లో పెట్టి తినకూడదు. అది రూం టెంపరేచర్‌ లో ఉన్నది మాత్రమే తినాలి. ముక్యంగా కొంతమంది సగం కట్‌ చేసిన పుచ్చకాయను ఫ్రిజ్‌లో పెడతారు. దీనివల్ల అందులో బ్యాక్టిరియా కూడా పేరుకుపోయే ప్రమాదం ఉంది. అంతేకాదు మధుమేహంతో బాధపడేవారికి పుచ్చకాయ మంచిది. డయాబెటిస్‌తో బాధపడేవారికి కూడా పుచ్చకాయ మంచిది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను సైతం నిర్వహిస్తుంది. కానీ, ఏ పండ్లు తీసుకుననా సాయంత్రం 7 లోపు తీసుకోవాలని గుర్తుంచుకోండి.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )
 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News