Back Pain: ఇంట్లో వైద్యంతో వెన్నునొప్పి మటు మాయం, ఈ 5 నియమాలు పాటిస్తే చాలు..!

Back Pain: ప్రస్తుతం నేటి కాలంలో చిన్న పెద్ద అనే తేడా లేకుండా వెన్ను నొప్పి సమస్య ఎదుర్కొంటున్నారు. ఈ ఆరోగ్య సమస్య కొందరికి బరువైన వస్తువులను ఎత్తడం వల్ల వస్తే..మరికొందరికి సరైన నిద్రలేకపోవడం వల్ల  వస్తున్నాయని నిపుణులు తెలిపారు. వెన్నునొప్పి శరీరంలో వచ్చే అన్నినొప్పులతో పొలిస్తే చాలా సాధరణం. కానీ భారత్‌లో ఇప్పుడు ఈ వెన్నునొప్పుల సమస్యలు అధికమయ్యాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 24, 2022, 07:28 PM IST
  • ఇంట్లో వైద్యంతో వెన్నునొప్పి మటు మాయం
  • 5 నియమాలు పాటిస్తే చాలు
  • రోజు 30 నిమిషాలు నడవాలి
Back Pain: ఇంట్లో వైద్యంతో వెన్నునొప్పి మటు మాయం, ఈ 5 నియమాలు పాటిస్తే చాలు..!

Back Pain: ప్రస్తుతం నేటి కాలంలో చిన్న పెద్ద అనే తేడా లేకుండా వెన్ను నొప్పి సమస్య ఎదుర్కొంటున్నారు. ఈ ఆరోగ్య సమస్య కొందరికి బరువైన వస్తువులను ఎత్తడం వల్ల వస్తే..మరికొందరికి సరైన నిద్రలేకపోవడం వల్ల  వస్తున్నాయని నిపుణులు తెలిపారు. వెన్నునొప్పి శరీరంలో వచ్చే అన్నినొప్పులతో పొలిస్తే చాలా సాధరణం. కానీ భారత్‌లో ఇప్పుడు ఈ వెన్నునొప్పుల సమస్యలు అధికమయ్యాయి. సాధరణంగా ఇల్లు శుభ్రం చేస్తున్న సమయంలో కానీ..పని చేస్తున్నప్పుడు కానీ ఏదో ఒక రకంగా వెన్ను నొప్పులకు గురవుతుంటారు. కొన్ని కొన్ని సార్లు ఈ నొప్పి భరించలేని విధంగా మారే అవకాశాలుంటాయని నిపుణులు పేర్కొన్నారు. దీర్ఘకాలిక వెన్నునొప్పిలకు డాక్టర్‌ను సంప్రదించడం మంచిది. కానీ కొన్ని సందర్భాల్లో వచ్చే చిన్న చిన్న వెన్నునొప్పులను ఇంట్లోనే నయం చేసుకోవచ్చు. యితే వెన్ను నొప్పినుంచి విముక్తి పొందడానికి ఇంట్లోనే చికిత్స చేసుకోవడం ఉత్తమమని వాషింగ్టన్ యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ సెయింట్ లూయిస్‌ వెల్లడించింది. ఇంట్లో పొందే చికిత్సను ఎలాంటి ఔషదాలు లేకుండా తేలికగా చేసుకోవచ్చని తెలిపింది. అయితే ఈ నొప్పి నుంచి విముక్తి కొన్ని నియమాలు పాటించాల్సి ఉంటుంది.

1. రోజు 30 నిమిషాలు నడవాలి:

వెన్ను నొప్పి ఉన్న రోగులు నడవకూడదు, కదల కూడదు అని అపోహాలున్నాయి. కానీ వీరు నిత్యం 25 నుంచి 30 నిమిషాలు పాటు నడిస్తే వెన్నునొప్పిని తగ్గించడంలో సహాయపడుతుందని నిపుణులు తెలిపారు. ఈ వెన్ను నొప్పి రావడానికి మొదటి కారణం కదలకుండా కూర్చొవడమేనని అట్లాంటాలోని ఎమోరీ యూనివర్శిటీ వెల్లడించింది. కాబట్టి వెన్నునొప్పి వచ్చినప్పుడు నడుస్తూ ఉండాలని యూనివర్శిటీ పేర్కొంది.

2. క్రమం తప్పకుండా  వ్యాయామాలు:

క్రమం తప్పకుండా వ్యాయామాలు చేయడం ద్వారా వెన్నుముఖ వద్ద కండరాలు అభివృద్ధి చెందుతాయి. కావున వెన్నునొప్పి ఉన్నవారు నొప్పి నుంచి విముక్తి పొందడానికి  వ్యాయామం కీలక పాత్ర పోషిస్తుంది. దీని కోసం వ్యాయామాలు, యోగాను తప్పని సరిగా చేయాలి. అప్పుడే కండరాలు బలోపేతమవుతాయి.

3. బరువును తగ్గించడం:
అధిక బరువు ఈ వెన్ను నొప్పికి దారి తీస్తుంది. వెన్నునొప్పిని నివారించడానికి బరువును తప్పకుండా తగ్గించుకోవాల్సి ఉంటుంది. అయితే బరువును తగ్గించుకోవడానికి ఫిట్‌నెస్ ట్రైనర్ సహాయం తీసుకోవాల్సి ఉంటుంది.

4. ధూమపానానికి దూరం:

పరిశోధకులు తెలిపిన వివరాల ప్రకారం..ధూమపానం చేసే వారి వెన్నుముకలతో పొల్సిస్తే..ధూమపానం చేయ్యని వారి వెన్నుముకలు బలంగా ఉంటాయని పేర్కొన్నారు. ధూమపానం చేస్తే అధికంగా వెన్నుముక సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని తెలిపారు. కనుక వెన్నుముక సమస్యలు ఉన్న వారు ధూమపానం మానేయడం మంచిదని వైద్యులు తెలిపారు.

5. ఐస్ ముక్కతో మర్దన:
 
వెన్నునొప్పి నుంచి ఉపశమనం పొందడానికి ఐస్ ముక్కలు మర్దన ఎంతో సహకరిస్తుంది. ఐస్ ముక్క సాధారణంగా నొప్పి నుంచి చాలా ఉపశమనాన్ని అందిస్తుంది.  అయితే ఐస్ ముక్కతో 20 నిమిషాలు పాటు మర్దన చేస్తే నొప్పి నుంచి విముక్తి పొందవచ్చని వైద్య నిపుణులు తెలిపారు.

Also Read:  Mangapeta Village Unity: ప్రభుత్వసాయం కోసం వేచిచూడని మంగపేట గ్రామస్తులు..!

Also Read: Koratala siva-Jr Ntr: కొరటాల శివ సినిమాలో సూపర్ స్లిమ్‌గా కన్పించనున్న తారక్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News