Garlic Benefits: వెల్లుల్లి రెండు రెమ్మలు చాలు..చలికాలం సమస్యలకు చెక్, మగవారి లైంగిక శక్తి కూడా

Garlic Benefits: చలికాలంలో ప్రధానంగా ఎదురయ్యే సమస్య ఇమ్యూనిటీ తగ్గిపోవడం. ఫలితంగా వివిధ రకాల అంటురోగాలకు గురి కావల్సి ఉంటుంది. మరి ఈ సమస్య నుంచి ఎలా ఉపశమనం పొందాలి..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Oct 30, 2022, 08:56 PM IST
Garlic Benefits: వెల్లుల్లి రెండు రెమ్మలు చాలు..చలికాలం సమస్యలకు చెక్, మగవారి లైంగిక శక్తి కూడా

చలికాలంలో వాతావరణం చాలా ఆహ్లాదంగానే ఉంటుంది. కానీ ఆరోగ్యపరంగా ఇబ్బందులు తప్పవు. చలికాలం వచ్చిందంటే అనారోగ్యం వెంటాడుతుంటుంది. అంటురోగాల ముప్పు ఉంటుంది. చిన్న చిట్కాతోనే ఈ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.

చలికాలంలో అనారోగ్య సమస్యలకు ప్రధాన కారణం ఇమ్యూనిటీ పడిపోవడమే. చలికాలంలో ఎప్పుడూ రోగ నిరోధక శక్తి క్షీణిస్తుంది. ఇమ్యూనిటీ ఎప్పుడైతే తగ్గిందో..వివిధ రకాల అంటురోగాల అంటుకుంటాయి. అయితే వెల్లుల్లి తినడం ద్వారా చలికాలం సమస్యల్నించి కాపాడుకోవచ్చు. ఎందుకంటే వెల్లుల్లి ఆరోగ్యానికి అంత మంచిది. ఇమ్యూనిటీ తగ్గడంతో బ్యాక్టిరియల్, ఫంగస్ వ్యాధులు దాడి చేస్తాయి. చలికాలంలో ఫ్లూ, జలుబు, వైరల్ ఫీవర్లు, కడుపు నొప్పి సమస్యలు ఎక్కువౌతాయి. కేవలం 2 వెల్లుల్లి రెమ్మలతో ఈ సమస్యల్ని దూరం చేయవచ్చు.

చలికాలంలో వెల్లుల్లితో కలిగే ప్రయోజనాలు

1. చలికాలంలో శరీరంలోని రోగ నిరోధక శక్తి క్షీణిస్తుంది. ఫలితంగా వ్యాధులు త్వరగా సోకుతాయి. అందుకే చలికాలంలో ఆరోగ్యపరంగా సంరక్షణ చాలా అవసరం. దీనికోసం వెల్లుల్లి తినమని ఆయుర్వేద వైద్య నిపుణులు సూచిస్తున్నారు. వెల్లుల్లి అనేది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. వివిధ రకాల ఇన్‌ఫెక్షన్లు, ఫ్లూ నుంచి రక్షణ లభిస్తుంది.

2. శరీరంలో సాధారణంగా కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరగడం, తగ్గడం జరుగుతుంటుంది. ఇది ఆరోగ్యానికి మంచిది కాదు. ఈ సమస్యకు వెల్లుల్లి అద్భుతంగా పనిచేసతుంది. వెల్లులి గుండె రోగులకు కూడా చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. చలికాలంలో ఎదురయ్యే జాయింట్ పెయిన్స్ సమస్య కూడా వెల్లుల్లితో దూరమౌతుంది. రక్తపోటు సంబంధిత సమస్యలకు వెల్లుల్లి మంచి ఔషధం. వెల్లుల్లి రోజూ తినడం అలవాటు చేసుకుంటే..రక్త సరఫరా కూడా మెరుగవుతుంది.

3. ఆయుర్వేదం ప్రకారం వెల్లుల్లితో చాలా ప్రయోజనాలున్నాయి. ఇమ్యూనిటీ బూస్టర్‌గా పనిచేయడమే కాకుండా..జలుబు, దగ్గు సమస్యల్నించి విముక్తి కల్గిస్తుంది. వెల్లుల్లి ఉపయోగంతో గొంతు సమస్యలు కూడా పరిష్కారమౌతాయి.

4. రాత్రి నిద్రించేముందు ఫ్లై చేసిన వెల్లుల్లి తినడం వల్ల శరీరంలోని విష పదార్ధాలు బయటకు వచ్చేస్తాయి. క్రమం తప్పకుండా వెల్లుల్లి తీసుకుంటే...టెస్టోస్టిరోన్ హార్మోన్ లెవెల్స్ పెరుగుతాయి. ఫలితంగా మగవారి లైంగిక శక్తి పెరుగుతుంది. రోజంతా ఎనర్జిటిక్‌గా ఉంటారు.రోజూ పరగడుపున కొద్దిగా కాల్చిన వెల్లుల్లి రెమ్మల్ని తీసుకుంటే..ఆరోగ్యం పూర్తిగా ఫిట్‌గా ఉంటుంది. ఏ విధమైన సమస్యలు రానేరావు.

Also read: Home Remedies: చలికాలం వచ్చేసింది, సీజనల్ వ్యాధుల్నించి రక్షించే హెర్బల్ డ్రింక్స్ ఇవే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu  

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News