Causes Of Type 1 Diabetes: ప్రస్తుతకాలంలో చాలా మంది వయసుతో సంబంధం లేకుండా డయాబెటిస్ సమస్య బారిన పడుతున్నారు. దీని వల్ల అనేక అనారోగ్య సమస్యలు కలుగుతున్నాయి. ఈ డయాబెటిస్ రెండు రకాలు ఒకటి టైప్ -1 , టైప్-2 డయాబెటిస్‌గా ఆరోగ్య నిపుణులు చెబుతారు. అయితే టైప్ -1 డయాబెటిస్ లక్షణాలు ఎంటి? అది ఎలా వస్తుంది అనేది తెలుసుకుందాం.
టైప్ -1 డయాబెటిస్ అనేది ఒక దీర్ఘకాలిక వ్యాధి. ఇది శరీరంలో ఇన్సులిన్ లోపం వల్ల వస్తుంది. ఇన్సులిన్ అనేది గ్లూకోజ్ (చక్కెర) ను శక్తి కోసం కణాలలోకి తీసుకెళ్లడానికి సహాయపడే హార్మోన్. టైప్ -1 డయాబెటిస్‌లో, శరీరం ఇన్సులిన్ ను ఉత్పత్తి చేయదు, దీనివల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరుగుతాయి.
ప్రారంభ లక్షణాలు:
అధిక దాహం:
తరచుగా మూత్ర విసర్జన కారణంగా శరీరం చాలా నీటిని కోల్పోతుంది. దీని కారణంగా దాహం కలుగుతుంది. ఇది టైప్ -1 డయాబెటిస్‌కు మొదటి లక్షణంగా నిపుణులు తెలుపుతున్నారు.
అధిక మూత్ర విసర్జన:
ఎక్కువ గ్లూకోజ్ ను శరీరం నుంచి బయటకు పంపడానికి శరీరం ప్రయత్నిస్తుంది.
తీవ్రమైన ఆకలి:
శరీరం శక్తి కోసం కణాలలోకి గ్లూకోజ్ ను తీసుకెళ్లలేకపోతుంది.
బరువు తగ్గడం:
శరీరం కండరాలను విచ్ఛిన్నం చేసి శక్తి కోసం ఉపయోగించుకుంటుంది.
అలసట:
శరీరానికి శక్తి లేకపోవడం వల్ల అలసట బారిన పడుతారు.
మసక దృష్టి:
అధిక రక్తంలో చక్కెర కళ్ళ లెన్స్‌లను దెబ్బతీస్తుంది.
మూత్రంలో చక్కెర:
మూత్ర పరీక్షలో చక్కెర ఉనికి.
మూత్రంలో కిటోన్స్:
శరీరం శక్తి కోసం కొవ్వును విచ్ఛిన్నం చేసినప్పుడు ఏర్పడతాయి.
తీవ్రమైన లక్షణాలు:
డయాబెటిక్ కీటోఅసిడోసిస్:
ఇది ఒక ప్రాణాంతక పరిస్థితి, ఇది చికిత్స చేయకపోతే మరణానికి దారితీస్తుంది.
DKA యొక్క లక్షణాలు: వికారం, వాంతులు, కడుపు నొప్పి, శ్వాసలో అసిటోన్ వాసన, స్పృహ కోల్పోవడం.
ఎవరికి టైప్ 1 డయాబెటిస్ వచ్చే అవకాశం ఉంది?
కుటుంబ సభ్యుల:
కుటుంబంలో ఎవరికైనా టైప్ 1 మధుమేహం ఉంటే, మీకు వచ్చే అవకాశం ఎక్కువ.
వయస్సు:
చాలా మంది టైప్ 1 మధుమేహంతో 20 సంవత్సరాల వయస్సు లోపు బాధపడతారు.
జన్యుశాస్త్రం:
కొన్ని జన్యువులు టైప్ 1 డయాబెటిస్‌కి మీ ప్రమాదాన్ని పెంచుతాయి.
చికిత్స:
టైప్-1 డయాబెటిస్‌కి శాశ్వత పరిష్కారం లేదు కానీ చికిత్స ద్వారా నియంత్రించవచ్చు. చికిత్సలో ఇన్సులిన్ ఇంజెక్షన్లు, ఆరోగ్యకరమైన ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వంటివి ఉంటాయి.
Also read: Diarrhea After Eating Bananas: అరటిపండ్లు తిన్న వెంటనే మలవిసర్జన..కారణాలు ఇవే..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712