Weight Loss With Empty Stomach Exercise: రోజూ వ్యాయామం చేయడం వల్ల బాడీ ఫిట్‌గా ఉంటుంది. కానీ ఖాళీ కడుపుతో వ్యాయామం చేయ్యోచ్చా..?. అస్సలు ఖాళీ కడుపుతో వ్యాయామాలు చేయడం వల్ల ఏం జరుగుతుందో తెలుసా..? ఈ రెండు ప్రశ్నలకు సరైన సమాధనం మనం ఈ రోజు తెలుసుకోబోతున్నాం.. అయితే ఖాళీ కడుపుతో వ్యాయామం చేయడం వల్ల అధిక బరువు సమస్యలు దూరమవుతాయి. అంతేకాకుండా డీహైడ్రేషన్ సమస్యలు, రక్తంలో చక్కెర స్థాయిలు కూడా తగ్గుతాయి. అయితే బరువును సులభంగా నియంత్రించుకోవాలనుకుంటే కచ్చితంగా ఇలా వ్యాయామాలు చేయోచ్చు. కావున బరువు తగ్గాలనుకునే వారు కచ్చితంగా ఈ చిట్కాను ఫాలో అవ్వాలి. అయితే ఇలా ఖాళీ కడుపుతో వ్యాయామాలు చేయడం వల్ల బరువు ఎలా తగ్గుతుందో మనం తెలుసుకుందాం..
ఖాళీ కడుపుతో వ్యాయామం చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే:
శరీర బరువును నియంత్రిస్తుంది:
ఖాళీ కడుపుతో వ్యాయామం చేయడం వల్ల శరీరానికి మంచి ఫలితాలు లభిస్తాయి. ముఖ్యంగా శరీర బరువును తగ్గించడానికి సహాయపడుతుంది. ప్రతి రోజూ ఖాళీ కడుపుతో వ్యాయామం చేయడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంటుంది. ముఖ్యంగా ఫ్యాట్‌ను బర్న్ చేస్తుంది. అంతేకాకుండా శరీరంలో అన్ని కండరాలకు చాలా మేలు చేస్తుంది. బాడీ దృఢంగా మారుతుంది.
రోగనిరోధక శక్తి పెరుగుతుంది:
ఖాళీ కడుపుతో వ్యాయామం చేయడం వల్ల శరీరం ఫిట్‌గా ఉండడమే కాకుండా శరీర రోగనిరోధక శక్తి బలపడుతుంది. ముఖ్యంగా అనారోగ్య సమస్యలను దూరం చేస్తుంది. అయితే అధిక బరువు సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఖాళీ కడుపుతో వ్యాయామాలు చేయాలి.
ఖాళీ కడుపుతో వ్యాయామం చేయడం వల్ల కలిగే నష్టాలు:
ఖాళీ కడుపుతో వ్యాయామం చేయడం వల్ల శరీరం డీహైడ్రేట్ సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశాలున్నాయి. ఇలా వర్కవుట్స్ చేయడం వల్ల కండరాలు దెబ్బతినే ప్రమాదం కూడా ఉందని నిపుణులు తెలుపుతున్నారు. అయితే వ్యాయమం చేసే క్రమంలో తప్పకుండా గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలుపుకుని తాగాలని వైద్యులు సూచిస్తున్నారు. అంతేకాకుండా మిల్క్ షేక్ లేదా బాదం షేక్ కూడా తాగవచ్చు. వ్యాయామానికి ముందు డిటాక్స్ డ్రింక్ తాగడం త్వరగా బరువు తగ్గొచ్చు.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also Read: Weight Loss Tips: ఆ నాలుగు అలవాట్లు మార్చుకుంటే..నెలలోనే బరువు తగ్గడం ఖాయం
Also Read: Weight Loss Tips: ఈ ఆహార నియమాలు పాటిస్తే ఖచ్చితంగా మీరు 12 రోజుల్లో బరువు తగ్గుతారు..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook