Weight Loss Tips: బెస్ట్‌ బరువు తగ్గే డైట్‌ ప్లాన్‌ ఇదే, డార్క్‌ చాక్లెట్‌ కూడా చెక్‌ పెట్టొచ్చు

Best Indian Diet Plan For Weight Loss: బరువు తగ్గాలనుకునేవారు ప్రతి రోజు ఈ ఆహార పదార్థాలను తీసుకుంటే మంచి ఫలితాలు పొందుతారు. ఇందులో ఉండే గుణాలు శరీరాన్ని యాక్టివ్‌గా ఉంచేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా వ్యాయామాలు కూడా చేయాలని నిపుణులు చెబుతున్నారు.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Jul 12, 2023, 11:59 AM IST
Weight Loss Tips: బెస్ట్‌ బరువు తగ్గే డైట్‌ ప్లాన్‌ ఇదే, డార్క్‌ చాక్లెట్‌ కూడా చెక్‌ పెట్టొచ్చు

Best Indian Diet Plan For Weight Loss: బరువు తగ్గడానికి చాలా మంది వ్యాయామాలు చేస్తున్నారు. కష్టపడి జిమ్‌లో వర్కౌంట్స్ చేసిన శరీర బరువు తగ్గలేకపోతున్నారు. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ‌ముఖ్యంగా బరువు తగ్గడానికి వ్యాయామాలు చేసే క్రమంలో తప్పకుండా అనారోగ్యకరమైన ఆహారాలకు దూరంగా ఉండాల్సి ఉంటుంది. అంతేకాకుండా బరువు తగ్గడానికి ప్రత్యేక డైట్‌ను అనుసరించాల్సి ఉంటుంది. లేకపోతే బరువు తగ్గిన వెంటనే మళ్లీ పెరిగే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఊబకాయాన్ని తగ్గించేందుకునేందుకు ఈ కింది స్నాక్స్‌ను ప్రతి రోజు తీసుకోవాల్సి ఉంటుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ ఆహారాలు తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుంది:
గింజలు:

బరువు తగ్గాలనుకునేవారు డైట్‌లో తప్పకుండా జీడిపప్పు, బాదం, వాల్‌నట్‌లు, వేరుశెనగలు గింజలను తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు, ఫైబర్, అనేక విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి. ప్రతి రోజు తీసుకోవడం వల్ల గుండె సమస్యలు తగ్గుతాయి. అంతేకాకుండా ఇందులో ఉండే ఫైబర్‌ శరీర బరువును సులభంగా తగ్గిస్తుంది. అంతేకాకుండా శరీరాన్ని వేగంగా దృఢంగా చేసేందుకు కూడా సహాయపడుతుంది. ప్రతి రోజు బరువు తగ్గాలనుకునేవారు 5 బాదంపప్పులు, 2 వాల్‌నట్స్‌ కంటే అతిగా తినకూడదని నిపుణులు చెబుతున్నారు.

డార్క్‌ చాక్లెట్‌:
డార్క్‌ చాక్లెట్‌ ప్రతి రోజు తినడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఇందులో తక్కువ పరిమాణంలో కేలరీలు లభిస్తాయి. అయితే మార్కెట్‌లో లభించే వైట్‌ చాక్లెట్‌కు బదులుగా తినకూడదని నిపుణులు తెలుపుతున్నారు. బరువు తగ్గే క్రమంలో తప్పకుండా డార్క్‌ చాక్లెట్‌ తినొచ్చు. 

Also Read: Congress: రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌కు బూస్ట్.. సచిన్ పైలట్ కీలక ప్రకటన  

బ్లాక్‌ కాఫీ:
బరువు తగ్గడానికి బ్లాక్‌ కాఫీ కీలక పాత్ర పోషిస్తుంది. బ్లాక్ కాఫీ తాగే క్రమంలో పాలతో కలిపి తాగకూడదని నిపుణులు చెబుతున్నారు. ఇలా టీని ప్రతి రోజు తాగడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ పరిమాణాలు తగ్గుతాయి. అంతేకాకుండా సులభంగా బరువు తగ్గడమేకాకుండా శరీరం యాక్టివ్‌గా మారుతుంది.

సలాడ్స్‌ తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుంది:
క్రీమీ డ్రెస్సింగ్, చీజ్, నట్స్‌తో కూడిన సలాడ్స్‌ ప్రతి రోజు తీసుకుంటూ ఉంటారు. అయితే ఇలాంటి సలాడ్స్‌ ప్రతి రోజు తీసుకోవడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా బరువు తగ్గుతారని నిపుణులు చెబుతున్నారు. 

తృణధాన్యాలు:
ప్రస్తుతం తృణధాన్యాల వినియోగం పెరిగిపోయింది. వీటితో తయారు చేసిన అల్పాహారాలు ప్రతి రోజు తీసుకుంటే శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఇందులో ఉండే మూలకాలు శరీర బరువును కూడా సులభంగా తగ్గిస్తాయి. అంతేకాకుండా రక్తంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంటుంది. 

Also Read: Congress: రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌కు బూస్ట్.. సచిన్ పైలట్ కీలక ప్రకటన  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook 

Trending News