Weight Loss Tablets: సైడ్‌ఎఫెక్ట్స్‌ లేకుండా శరీర బరువును తగ్గించే మందులు ఇవే!

Weight Loss Tablets Without Side Effects: బరువు తగ్గాలనుకునేవారు ఔషధాలు వినియోగిస్తున్నారు. వీటిని వినియోగించడం వల్ల బరువు తగ్గినప్పటికీ కొన్ని సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 15, 2023, 05:23 PM IST
Weight Loss Tablets: సైడ్‌ఎఫెక్ట్స్‌ లేకుండా శరీర బరువును తగ్గించే మందులు ఇవే!

 

Weight Loss Tablets Without Side Effects: ప్రపంచ వ్యాప్తంగా స్థూలకాయ సమస్య విపరీతంగా పెరుగుతోంది. చిన్నపిల్లల నుంచి పెద్దవారి దాకా ఈ సమస్య బారిన పడుతున్నారు. అయితే ఈ స్థూలకాయం సమస్యలు రావడానికి వివిధ కారణాలున్నాయి. ఆధునిక జీవనశైలి కారణంగా చాలా మంది అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. ఇదే క్రమంలో చాలా మంది శరీర బరువు కూడా పెరుగుతున్నారు. అయితే బరువు పెరిన వారు తమ అందన్నీ కూడా కోల్పోవాల్సి వస్తోంది. యువతలో చాలా మంది స్థూలకాయం బాధపడేవారు ముందుగానే వాటి కారణంగా వచ్చే దీర్ఘకాలిక వ్యాధులను దృష్టిలో పెట్టుకుని వెయిట్‌ లాస్‌ కోసం వివిధ రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే చాలా మంది బరువు తగ్గడానికి కఠినమైన డైట్‌లను కూడా పాటిస్తున్నారు.

ఇంకొంతమంది వెయిట్ లాస్‌ అవ్వడానికి వైద్యులను కూడా ఆశ్రయిస్తున్నారు. మరికొందరైతే వ్యాయామాలతో పాటు ఇంటి చిట్కాలను అనుసరిస్తున్నారు. యువతలో ఎక్కువగా మంది బరువు తగ్గడానికి ఔషధాలను వినియోగిస్తున్నారు. అయితే చాలా మందిలో అవగాహన లేకపోవడంత వల్ల అధిక రసాయనాలు కలిగిన ఔషధాలను వినియోగిస్తున్నారు. వీటికి బదులుగా వైద్య నిపుణులు సూచించిన ప్రిస్క్రిప్షన్ ఔషధాలను వినియోగించడం చాలా మంచిదని నిపుణులు తెలుపుతున్నారు.

ప్రస్తుతం చాలా మంది వైద్యులు బరువు తగ్గడానికి Wegovy అనే ఔషధాన్ని ఎక్కువగా వినియోగిస్తున్నారు. దీనిని ఇంజెక్షన్ ద్వారా తీసుకుంటారు. ఇందులో ఉండే గుణాలు సెమాగ్లుటైడ్ GLP-1 హార్మోన్స్‌ సమతుల్యం చేసేందుకు సహాయపడుతుంది. అలాగే ఇన్సులిన్‌ను ఉత్పత్తిని కూడా ప్రభావితం చేస్తుంది. దీని కారణంగా మెదడులోని ఆకలి అనే అంశాన్ని తొలగించేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుంది. దీంతో సులభంగా ఆకలి కోరికలు కూడా తొలగిపోతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. 2021లోని ట్రయల్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం..ఊబకాయం ఉన్న పెద్దవారిలో ఈ డ్రగ్‌ వాడడం వల్ల శరీర బరువులో దాదాపు 15 శాతం తగ్గారని వెల్లడించారు.  

Also Read: Vivo Y27 Price: ఫ్లిఫ్‌కార్ట్‌లో Vivo Y27 మొబైల్‌ కేవలం రూ.12,499కే..ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ వివరాలు.. 

ఈ మందులు సురక్షితమేనా?
Ozempic డ్రగ్‌ను 2017 సంవత్సరం నుంచి టైప్ 2 డయాబెటిస్‌కు చికిత్సకు వినియోగిస్తున్నారని..కాబట్టి దీనిని తగిన మోతాదులో వినియోగించడం వల్ల సురక్షితంగా బరువు తగ్గొచ్చని నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ డ్రగ్‌ను అతిగా వినియోగించడం వల్ల దుష్ప్రభావాలు వచ్చే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. దీని కారణంగా చాలా మందిలో వికారం, మలబద్ధకం,  జీర్ణవ్యవస్థ సమస్యలు వస్తాయి. కాబట్టి దీనిని అతిగా వినియోగించకపోవడం మానుకుంటే మంచిదని వైద్య నిపుణులు తెలుపుతున్నారు.

శాశ్వతంగా తీసుకోవాలా?
 ఒక ట్రయల్‌లో కొన్ని రోజులు Wegovy డ్రగ్‌ను తీసుకున్న వారిలో బరువు తగ్గిన తర్వాత..దీనిని వినియోగించడం మానుకుంటే దాదాపు బరువులో మూడింట రెండు వంతుల బరువును తిరిగి పొందారని నిపుణులు తెలిపారు. అయితే దీనిని తీసుకోవడం వల్ల బరువు తగ్గినప్పటికీ కొన్ని రోజుల్లో బరువు పెరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ డ్రగ్‌ తీసుకున్నవారిలో ఆధునిక జీవనశైలిని మానుకోవాల్సి ఉంటుంది. 

Also Read: Vivo Y27 Price: ఫ్లిఫ్‌కార్ట్‌లో Vivo Y27 మొబైల్‌ కేవలం రూ.12,499కే..ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ వివరాలు.. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News