Tea For Weight Loss: 7 రోజుల్లో ఆరోగ్యంగా బరువు తగ్గొచ్చు, నమ్మట్లేదా ఇది చదవండి!

Tea For Weight Loss: శరీర బరువును సులభంగా నియంత్రించడానికి ప్రతి రోజూ ఆహారంతో పాటు గ్రీన్‌ తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో ఉండే గుణాలు చాలా రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగించడమేకాకుండా కొలెస్ట్రాల్‌ను సులభంగా తగ్గిస్తాయి.  

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 1, 2023, 02:56 PM IST
Tea For Weight Loss: 7 రోజుల్లో ఆరోగ్యంగా బరువు తగ్గొచ్చు, నమ్మట్లేదా ఇది చదవండి!

Tea For Weight Loss: ఆధునిక జీవన శైలి కారణంగా చాలా మంది అనారోగ్య సమస్యల బారిన పడడమేకాకుండా శరీర బరువు పెరుగుతున్నారు. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు వ్యాయామాలతో పాటు వాకింగ్‌ చేస్తున్నారు. మరికొందరైతే డైట్‌ పద్దతిలో ఆహారాలు తీసుకుంటున్నారు. అయినప్పటికీ బరువు తగ్గడం లేదు. అయితే ఇలాంటి శరీర బరువు సులభంగా తగ్గడాని ఆయుర్వేద నిపుణులు సూచించిన పలు టీలను ప్రతి రోజూ తాగాల్సి ఉంటుంది. ఇందులో ఉండే ఆయుర్వేద గుణాలు చాలా రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగించి కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తాయి. కాబట్టి ప్రతి రోజు బరువు తగ్గాలనుకునేవారు ఈ కింద పేర్కొన్న టీలను తీసుకోవాల్సి ఉంటుంది.

బరువు తగ్గించే టీలు ఇవే:
1. బ్లాక్ టీ బరువు తగ్గిస్తుంది:

బ్లాక్ టీ అంటే చాలా మంది ఇష్టపడి తాగుతూ ఉంటారు. అయితే ప్రతి రోజూ బ్లాక్‌ని తాగడం వల్ల శరీరానికి చాలా ప్రయోజనాలు కలగడమేకాకుండా శరీర బరువు తగ్గుతారని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే కెఫిన్ బరువును తగ్గించడమేకాకుండా కొలెస్ట్రాల్‌ను సులభంగా తగ్గించడానికి సహాయపడుతుంది.

2. పుదీనా టీ:
పుదీనా టీలో చాలా రకాల ఔషధ గుణాలు లభిస్తాయి. కాబట్టి దీనిని ప్రతి రోజూ తాగితే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అంతేకాకుండా సీజనల్‌ వ్యాధుల నుంచి సులభంగా శరీరాన్ని రక్షిస్తాయి. అయితే ఈ ఆకులతో తయారు చేసిన టీని ప్రతి రోజూ తాగడం వల్ల బరువు తగ్గొచ్చని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి ప్రతి రోజూ డైట్‌లో తప్పకుండా పుదీనా టీని తీసుకోవాల్సి ఉంటుంది.

3. గ్రీన్ టీ కూడా సులభంగా బరువును తగ్గిస్తాయి:
సులభంగా ఆరోగ్యంగా బరువు తగ్గాలనుకునేవారు ప్రతి రోజూ గ్రీన్‌ టీని తాగాలని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే చాలా రకాల గుణాలు అనారోగ్య సమస్యల నుంచి ఉపశనం కలిగించడమేకాకుండా రోగనిరోధక శక్తిని కూడా పెంచడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా తరుచుగా అనారోగ్య సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఈ టీని తాగాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

ఈ మూడు టీలలో ఉండే ఆయుర్వేద గుణాలు శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్‌ను సులభంగా నియంత్రిస్తాయి. అంతేకాకుండా గుండె సమస్యల బారిన పడకుండా సహాయపడుతుంది. కాబట్టి తప్పకుండా ప్రతి రోజూ ఈ మూడు టీలను తీసుకోవాల్సి ఉంటుంది.

Also Read:  Anupama Parameswaran Saree pics : కొప్పున పూలెట్టుకొని.. అందమంటే అనుపమదేనా?.. చీరకట్టుకే కళ వచ్చిందా?

Also Read: Amala Akkineni : కుక్కల మీద అలాంటి కామెంట్లు చేసిందా?.. అమల నిజంగానే అలా అనేసిందా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News