Weight Loss Drink: అల్లం రసంతో బరువు తగ్గడం ఎలాగో తెలుసా? ఇలా చేస్తే 99% తగ్గడం ఖాయం..

Weight Loss Drink: చలికాలంలో సులభంగా బరువు తగ్గాలనుకుంటున్నవారు ప్రతిరోజు ఆయుర్వేద నిపుణులు సూచించిన ఈ అల్లం రసాన్ని తాగడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు అంతేకాకుండా ఇందులో ఉండే గుణాలు ఇతర దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కూడా శరీరాన్ని రక్షించేందుకు సహాయపడతాయి. కాబట్టి మీరు కూడా ఓసారి ట్రై చేయండి.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 12, 2023, 11:22 PM IST
Weight Loss Drink: అల్లం రసంతో బరువు తగ్గడం ఎలాగో తెలుసా? ఇలా చేస్తే 99% తగ్గడం ఖాయం..

 

Weight Loss Drink: శీతాకాలంలో చాలామంది ఎక్కువగా అల్లం టీ ని తాగుతూ ఉంటారు. ఎందుకంటే ఇందులో అనేక రకాల ఆయుర్వేద గుణాలు లభిస్తాయి. కాబట్టి జలుబుతో పాటు ఇతర ఇన్ఫెక్షన్ల నుంచి శరీరాన్ని రక్షించేందుకు సహాయపడతాయి. అయితే అల్లం లో ఉండే ఔషధ మూలకాలు ఇన్ఫెక్షన్లను తగ్గించడమే కాకుండా ఇతర దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కూడా సులభంగా ఉపశమనం కలిగిస్తాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. 

అల్లంలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు శరీర పరువును తగ్గించేందుకు కీలక పాత్ర పోషిస్తాయి. అంతేకాకుండా కొలెస్ట్రాల్ ను నియంత్రించడానికి కూడా సహాయపడతాయట. అలాగే జీర్ణక్రియను మెరుగుపరిచి మలబద్ధకం సమస్యలను పూర్తిగా తగ్గించేందుకు సహాయపడుతుందని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. అయితే అల్లం టీ తాగడం వల్ల నిజంగానే బరువు తగ్గుతారా? అసలు ఆయుర్వేద నిపుణులు ఏం చెబుతున్నారో? మనం ఇప్పుడు తెలుసుకుందాం.

బరువు తగ్గాలనుకునేవారు అల్లాన్ని ఇలా తీసుకోండి:
అల్లం రసం:

క్రమం తప్పకుండా అల్లం రసాన్ని తాగడం వల్ల సులభంగా బరువు తగ్గుతారని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు అల్లం రసంలో నిమ్మరసం తేనె కలుపుకొని తాగడం వల్ల సులభంగా మంచి ఫలితాలు పొందుతారని వారంటున్నారు. అంతేకాకుండా ఈ డ్రింక్ తాగడం వల్ల శరీరం హైడ్రేట్ గా ఉండటమే కాకుండా రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. కాబట్టి శీతాకాలంలో తరచుగా అనారోగ్య సమస్యలతో బాధపడేవారు తప్పకుండా అల్లం రసాన్ని తాగాల్సి ఉంటుంది. 

అల్లం, నల్ల మిరియాలు:
అల్లం రసంలో నల్ల మిరియాల పొడిని కలుపుకొని తాగడం వల్ల వేగంగా బరువు తగ్గుతారట. కాబట్టి సులభంగా ఆరోగ్యంగా బరువు తగ్గాలనుకునేవారు ఒక కప్పు నీటిలో అల్లం రసాన్ని వేసుకొని అందులోనే నల్ల మిరియాల పొడి, తేనె కలుపుకొని ఉదయాన్నే తాగాల్సి ఉంటుంది. ఇలా తాగడం వల్ల శరీరంలోని కొలెస్ట్రాల్ కూడా సులభంగా కరిగిపోతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. 

Also Read: విజయ్ దేవరకొండ ఫ్యామిలీని తన ఫ్యామిలీ అని చెప్పేసిన రష్మిక... ఫైనల్ గా కన్ఫర్మేషన్

అల్లం, గ్రీన్ టీ:
సాధారణంగా ప్రతిరోజు గ్రీన్ టీ తాగే వారిలో సులభంగా కొలెస్ట్రాల్ కలుగుతుంది అయితే ఇదే గ్రీన్ టీ లో అల్లం రసాన్ని కలుపుకొని తాగితే రెట్టింపు ప్రయోజనాలు కలుగుతాయనట. ఎలాంటి శ్రమ లేకుండా బరువు తగ్గాలనుకునేవారు తప్పకుండా గ్రీన్ టీ లో అల్లం రసాన్ని కలుపుకొని తాగాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఇలా తాగడం వల్ల కొందరిలో సైడ్ ఎఫెక్ట్స్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తప్పకుండా ఆయుర్వేద నిపుణులు సంప్రదించి ఈ చిట్కాను ఫాలో అవ్వాలి.

అల్లం, యాపిల్ వెనిగర్:
అల్లం రసంలో యాపిల్ వెనిగర్ వాటర్ ని కలుపుకొని తాగడం వల్ల సులభంగా బరువు తగ్గొచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అల్లం లో ఉండే ఆయుర్వేద గుణాలు బరువు తగ్గించడమే కాకుండా శరీరంలోని పేరుకుపోయిన యూరికి యాసిడ్ పరిమాణాలను కూడా సులభంగా నియంత్రిస్తాయి. కాబట్టి వీటి రెండింటిని మిక్స్ చేసుకొని తాగడం వల్ల బరువు తగ్గడమే కాకుండా కీళ్ల నొప్పులకు కూడా చెక్ పెట్టొచ్చు.

Also Read: విజయ్ దేవరకొండ ఫ్యామిలీని తన ఫ్యామిలీ అని చెప్పేసిన రష్మిక... ఫైనల్ గా కన్ఫర్మేషన్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News