Weight Loss Diet Plan: బరువు పెరగడం సులభమైనప్పటికీ తగ్గడం చాలా కష్టమని అందరికీ తెలిసిందే.. బరువు తగ్గడానికి మార్కెట్‌లో చాలా రకాల ప్రోడక్ట్స్ ఉన్నాయి. వాటిని వినియోగించడం వల్ల చాలా రకాల దుష్ప్రభావాలు వస్తున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. సహజంగా బరువు తగ్గడం చాలా మంచిదని అభిప్రాయపడుతున్నారు. బరువు తగ్గాలనుకునేవారు ప్రతి రోజు ఆహారాన్ని డైట్ పద్ధతిలో తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందొచ్చు. ఎలాంటి ఆహారాలు ప్రతి రోజు తీసుకోవడం వల్ల సులభంగా బరువు తగ్గుతారో ఇప్పుడు తెలుసుకుందాం..
కేలరీలు తక్కువ గల ఫుడ్స్ తీసుకోవాలి:
ఇడ్లీ సాంబార్:
సౌత్ ఇండియన్ ఆహారాల్లో కేలరీలు చాలా తక్కువ పరిమాణంలో ఉండే వాటిల్లో ఇడ్లీ సాంబార్ ఒకటి. ఇందులో చాలా తక్కువ పరిమాణంలో కేలరీలు, ఎక్కువ పరిమాణంలో ఫైబర్ లభిస్తుంది. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు తప్పకుండా ఇడ్లీ సాంబార్ తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఇందులో ఉండే గుణాలు శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రిస్తుంది.
మొలకలతో తయారు చేసిన సలాడ్:'
మొలకెత్తిన కాయధాన్యాలు, దోసకాయలు, టొమాటోలు, ఉల్లిపాయలను కలిపి తయారు చేసిన సలాడ్ ప్రతి రోజు తీసుకోవడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో పీచు పదార్ధాలు కూడా అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు ప్రతి రోజు ఈ సలాడ్‌ను తీసుకోవాల్సి ఉంటుంది.
Also read: BRS MLA Gampa Govardhan: రైస్ మిల్లు సిబ్బంది చెంప ఛెళ్లుమనిపించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే.. వీడియో వైరల్
పప్పులు:
పప్పుల్లో ప్రోటీన్, ఫైబర్ అధిక పరిమాణంలో లభిస్తుంది. వీటిని ప్రతి రోజు ఆహారాల్లో వినియోగించడం వల్ల శరీరం దృఢంగా మారుతుంది. అంతేకాకుండా కొలెస్ట్రాల్ పరిమాణాలు కూడా నియంత్రణలో ఉంటాయి. కాబట్టి ప్రతి రోజు డైట్‌లో రాజ్మా-రైస్, దాల్ ఖిచ్డీ తీసుకోవాల్సి ఉంటుంది.
తందూరి చికెన్:
తందూరి చికెన్‌లో కూడా తక్కువ కేలరీలు, ప్రోటీన్లు తక్కువ పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి దీనిని క్రమం తప్పకుండా తినడం వల్ల శరీర బరువు నియంత్రణలో ఉంటుంది. అధిక బరువు సమస్యలతో బాధపడేవారు తప్పకుండా డైట్‌లో పై ఆహారాలు క్రమం తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుంది.
(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
Also read: BRS MLA Gampa Govardhan: రైస్ మిల్లు సిబ్బంది చెంప ఛెళ్లుమనిపించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే.. వీడియో వైరల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook