Weight Gain During Pregnancy: గర్భిణీ స్త్రీలు క్రమంగా ఇలా బరువు పెరిగితే ప్రమాదమే, ఎందుకో తెలుసా?

Excess Weight and Weight Gain During Pregnancy: గర్భిణీ స్త్రీలు బరువు పెరగడం వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ క్రింద సమస్యలతో చాలామంది గర్భిణీ స్త్రీలు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. కాబట్టి తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.  

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 24, 2023, 06:42 PM IST
Weight Gain During Pregnancy: గర్భిణీ స్త్రీలు క్రమంగా ఇలా బరువు పెరిగితే ప్రమాదమే, ఎందుకో తెలుసా?

Excess Weight and Weight Gain During Pregnancy: ప్రపంచవ్యాప్తంగా ఊబకాయంతో బాధపడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరిగి పోతుంది. ప్రస్తుతం చాలామంది ఊబకాయం సమస్యలతో బాధపడుతున్నారు. ముఖ్యంగా ఈ సమస్య బారిన పురుషులే కాకుండా స్త్రీలు కూడా పడడం విశేషం. అయితే చాలామంది స్త్రీలలో గర్భం దాల్చిన తర్వాత ఊబకాయం సమస్యలు వస్తున్నాయి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం.. గర్భం దాల్చిన తర్వాత ఊబకాయం సమస్యలు వస్తే చాలా రకాల అనారోగ్య సమస్యలు వచ్చే ఛాన్స్ ఉందని పేర్కొంది. అయితే ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయో..? ఊబకాయంతో బాధపడుతున్న గర్భిణీ స్త్రీలు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

ఈ తీవ్ర అనారోగ్య సమస్యలకు దారి తీయవచ్చు:
మధుమేహం:

ప్రస్తుతం చాలామంది స్త్రీలు మధుమేహం బారిన పడుతున్నారు. అయితే ఆరోగ్య నిపుణుల ప్రకారం గర్భాధారణ తర్వాత ఊబకాయం సమస్యల బారిన పడితే సులభంగా మధుమేహం ఇతర దీర్ఘకాలిక దారి తీయవచ్చని తెలిపారు. కాబట్టి గర్భాధారణ సమయంలో వయస్సు మించిన బరువు ఉండడం మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 

ప్రీ-ఎక్లాంప్సియా:
ఈ వ్యాధి తల్లిని, పిల్లను ఎంతో ప్రభావితం చేసే వ్యాధి. ఈ వ్యాధి బారిన ఒక్కసారి పడితే తీవ్ర అనారోగ్య సమస్యలతో పాటు గర్భం కోల్పోయే అవకాశాలు కూడా ఉన్నాయి. ప్రీ-ఎక్లాంప్సియా వల్ల అధిక రక్తపోటు, మూత్రపిండాల విఫలం, అవయవాలు చెడిపోవడం వంటి చాలా రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. అయితే ఇలాంటి సమస్య రావడానికి ప్రధాన కారణాలు గర్భధారణ సమయంలో అధిక బరువు పెరగడమేనని ఆరోగ్య నిపుణులు పేర్కొన్నారు.

గర్భస్రావం:
గర్భం దాల్చిన తర్వాత ఊబకాయం సమస్యలతో బాధపడే వారిలో గర్భస్రావం సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు తప్పకుండా పలు జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ప్రెగ్నెంట్ లేడీస్ కేవలం ఆరోగ్యకరమైన ఆహారాలను తీసుకోవాల్సి ఉంటుంది. 

సిజేరియన్ డెలివరీ:
సాధారణ బరువు ఉన్న గర్భం దాల్చిన మహిళ కంటే ఊబకాయం సమస్యతో బాధపడుతున్న స్త్రీలే సిజేరియన్ డెలివరీ జన్మనిచ్చే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీని కారణంగా చాలామందిలో ఇన్ఫెక్షన్లతో పాటు సిండ్రోమ్ సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి గర్భధారణ సమయంలో తప్పకుండా శరీర బరువును నియంత్రించుకోవడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా డెలివరీ సమయాల్లో కేవలం ఆరోగ్యకరమైన ఆహారాలను తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

Also Read: Rahul Gandhi: సంచలన నిర్ణయం.. రాహుల్ గాంధీపై వేటు.. పార్లమెంట్ సభ్యత్వం రద్దు  

Also Read: AP MLC Elections Results: సీఎం జగన్ డేరింగ్ స్టెప్.. ఆ ఇద్దరికి నో టికెట్.. ఓడిపోతామని తెలిసినా..!  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News