Watermelon Seeds: అలసట, నీరసం వంటి సమస్యలకు చెక్‌ పెట్టడంలో ఈ గింజలు ఎంతో మేలు చేస్తాయి..

Watermelon Seeds Health Benefits: ప్ర‌స్తుత కాలంలో మ‌న‌లో చాలా మంది నీర‌సం, బ‌ల‌హీన‌త, అలసట వంటి అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నారు. బలహీనత, నీరసం ఉన్నప్పుడు బలమైన ఆహారం తీసుకోవాలని ఆరోగ్యనిపుణులు చెబుతూ ఉంటారు. దీని కోసం కొన్ని గింజలను తీసుకోవడం వల్ల ఈ సమస్య నుంచి బయటపడవచ్చని వైద్యలు చెబుతున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 2, 2024, 10:19 AM IST
Watermelon Seeds: అలసట, నీరసం వంటి సమస్యలకు చెక్‌ పెట్టడంలో ఈ గింజలు ఎంతో మేలు చేస్తాయి..

Watermelon Seeds Health Benefits: మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే శరీరానికి కావాల్సిన పోషక ఆహారం తీసుకోవాల్సి ఉంటుంది. షోషక ఆహారం అనేది కేవలం గుడ్లు, చేపలు, మాంసం, ఆకుకూరలు మాత్రమే కాకుండా కొన్ని గింజలను తీసుకోవడం చాలా మంచిదని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. వీటిని తీసుకోవడం వల్ల నీరసం, అలసట వంటి సమస్యల నుంచి బయటపడవచ్చు.  అయితే ఎలాంటి గింజలు తీసుకుంటే మనం  నీర‌సాన్ని త‌గ్గించుకోవచ్చు అనేది తెలుసుకుందాం.

ప‌ల్లీలు: నీరసంతో బాధపడుతున్నవారు ప్రతిరోజు పల్లీలను తీసుకోవడం వల్ల ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. వీటిని నేరుగా తీసుకోవడం కంటే నానబెట్టిన తీసుకోవడం వల్ల శరీరానికి బలం చేకూరుతుంది. 

పచ్చికొబ్బరి:  నీరసం, అలసట తగ్గించడంలో పచ్చికొబ్బరిని కూడా సహాయపడుతుంది.  పచ్చి కొబ్బరిలో  కొలెస్ట్రాల్‌ ఉండదని నిపులు చెబుతున్నారు. దీని తీసుకోవడం వల్ల  శరీరం బలంగా ఉంటుంది.

వాటర్ మిలన్ గింజలు: వాటర్ మిలన్ గింజలు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. దీని తీసుకోవడం వల్ల విటమిన్స్‌తో పాటు మెగ్నీషియం, ఐరన్, పొటాషియం, కాపర్, జింక్ శరీరానికి పుష్కలంగా లభిస్తాయి. దీని వల్ల శరీరం బలంగా, చురుకుగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. 

పొద్దు తిరుగుడు గింజలు: పొద్దు తిరుగుడు గింజలు  నీర‌సాన్ని త‌గ్గుతుంది. అంతేకాకుండా ఈ గింజలలో ఫైబర్‌ కంటెంట్‌ ఉంటుంది. శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో ఎంతో మేలు చేస్తుంది.

గుమ్మ‌డి గింజ‌లు: నానబెట్టిన తీసుకోవడం వల్ల నీరసం తగ్గుతుంది. గుమ్మడి గింజల్లో ఐరన్‌, జింక్, మెగ్నీషియం అధికంగా లభిస్తాయి. ఇందులో ఉండే ఐరన్‌ శరీరాని బలంగా తయారు చేయడంలో సహాయపడుతుంది.

నువ్వులు: నువులు మనం తీసుకొనే మాంసం కంటే ఐదు రెట్లు బలమైన ఆహారమని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. దీని ప్రతిరోజు మన ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల నీరసం వంటి సమస్యలకు చెక్‌ పెట్టవచ్చు.

కాబట్టి ఈ గింజలను నానబెట్టి తీసుకోవడం వల్ల నీరసం, అలసట సమస్య నుంచి బయట పడవచ్చని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. ఇది మనంలోని నీరసాన్ని తగ్గించి ఉత్సాహంగా ఉండేలా చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. మార్కెట్‌లో లభించే మందుల కన్నా ఈ సహాజమైన గింజలను తీసుకోవడం వల్ల శరీరం ఎంతో ధృడంగా ఉంటుందని వైద్యులు సూచిస్తున్నారు.

Also Read: Stomach Cancer Symptoms: పొట్టలో ఈ లక్షణాలు ఉన్నవారు తస్మాత్ జాగ్రత్త.. క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉంది..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News