Snoring Tips: నిద్ర‌లో గుర‌క వ‌స్తుందా..? నివారణకు ఈ చిట్కాలు పాటించండి..!

Snoring Tips: నిద్రపోయే సమయలో గురక పెట్టే అలవాటు చాలా మందిలో ఉంటుంది. వీరు గురకపెట్టడం వల్ల పక్క వాళ్లు చాలా మంది ఇబ్బంది పడతారు. కొన్ని చిట్కాలు పాటిస్తే గురక నుంచి బయటపడవచ్చు అంటున్నారు వైద్యనిపుణులు.  

Edited by - ZH Telugu Desk | Last Updated : Aug 29, 2021, 06:34 PM IST
Snoring Tips: నిద్ర‌లో గుర‌క  వ‌స్తుందా..? నివారణకు ఈ చిట్కాలు పాటించండి..!

Snoring Tips: నిద్రపోయే సమయలో గురక(Snoring) పెట్టే అలవాటు చాలా మందిలో ఉంటుంది. మనం నిద్రపోతున్నప్పుడు మన పక్కన ఉన్నవాళ్లు గురక పెడితే దానంత నరకం మరొకటి ఉండదు. నిద్రపోయేవారు గురక నుంచి బ‌య‌ట‌ప‌డాలంటే కొన్ని చిట్కాలు పాటిస్తే మేలంటున్నారు వైద్య నిపుణులు. 

గుర‌క ఎందుకు వ‌స్తుంది..?
నిద్ర సమయంలో గాలి ముక్కుల నుంచి ఊపిరితిత్తుల్లోకి వెళ్లే మార్గంలో అడ్డంకులు ఏర్పడితే అప్పుడు గురక(Snoring) వస్తుంది. అలాగే ఈ సమయంలో నోటి ద్వారా శ్వాస తీసుకునే ప్రయత్నం జరుగుతుంది. ఆ మార్గంలోనూ అవాంతరాలుంటే అప్పుడు కుచించుకుపోయిన మార్గం నుంచి గాలి వెళ్లాల్సి ఉండడంతో చుట్టుపక్కల ఉన్న కణజాలాలు కదలికకు గురై చప్పుళ్లు వస్తాయి. ఇది ఒక్క కారణం మాత్రమే. కానీ, వాస్తవంలో మరెన్నో అంశాలు ఉన్నాయి. ఇక ప్ర‌ధాన కార‌ణం మానసికపరమైన ఒత్తిడి, కంగారు, విపరీతమైన ఆలోచనాధోరణి.

నోటి ద్వారా శ్వాస..
సాధారణంగా ముక్కు ద్వారా గాలి తీసుకుంటాం. కానీ, నాసికా మార్గాల్లో అవాంతరాల వల్ల కొందరు నోటి(Mouth)తో శ్వాస(Breathing) తీసుకుంటుంటారు. అలర్జీలు, సైనస్ ఇన్ఫెక్షన్, ముక్కులోపలి భాగం వాచిపోవడం, అడినాయిడ్స్ అన్నీ కూడా శ్వాస మార్గానికి అడ్డంకులే కార‌ణం. 

పురుషుల్లో ఎక్కువ..
మహిళలతో పోలిస్తే పురుషుల్లో గురక(Snoring) సమస్య ఎక్కువగా ఉంటుంది. వాయు నాళాలు తక్కువ వ్యాకోచంతో ఉంటాయి. మెడ, గొంతు భాగంలో అధిక బరువు పడినా గురకకు దారితీస్తుంది. సైనస్ సమస్యలో ముక్కు నాసికా కుహరములు జామ్ అవుతాయి. దీంతో గాలి కష్టంగా వెళ్లాల్సి వచ్చి శబ్దం బయటకు వస్తుంది. మద్యం(Drinking), పొగతాగడం(Smoking), ట్రాంక్విలైజర్ ఔషధాలైన లోరజ్ పామ్, డైజిపామ్ కండరాలకు పూర్తి విశ్రాంతిని కలిగిస్తాయి. దానివల్ల కూడా గురక రావచ్చు. ముఖ్యంగా కార్పొరేట్‌ ఉద్యోగుల్లో ఎక్కువ మంది ఇలా గురక సమస్య(Snoring problems)తో బాధపడుతుంటారట. దీనికి కార‌ణం ప‌ని ఒత్తిడే.

చెక్ పెట్టండిలా..

  • ప్ర‌తిరోజూ రాత్రి నిద్ర‌పోయేముందు గుప్పెడు పచ్చి అటుకులను తింటే గురక రాకుండా కంట్రోల్ అవుతుంద‌ట‌.
  • అర టీ స్పోన్‌ తేనె, అర టీ స్పూన్‌ ఆలివ్‌ ఆయిల్‌ కలిపి రాత్రి నిద్రపోయే ముందు తాగితే మంచి ఫలితం కనిపిస్తుంది.
  • ఒక గ్లాసు నీటిలో ఒకటి లేదా రెండు పిప్పర్‌మెంట్‌ ఆయిల్‌ చుక్కలు వేసి రాత్రి నిద్రపోయే ముందు నోటిలో పోసుకుని బాగా పుక్కిలించాలి. దీని వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంది.
  • కొద్దిగా పిప్పర్‌మెంట్‌ ఆయిల్‌ను చేతివేళ్లకు రాసుకుని వాసన చూస్తుంటే గురక తగ్గుతుంది.
  • ఒక గ్లాసు వేడి నీటిలో అర టీ స్పూన్‌ యాలకుల చూర్ణం కలిపి రాత్రి నిద్రపోయే ముందు తాగి నిద్ర‌పోతే మంచి ఫలితం కనిపిస్తుంది.
  • రాత్రి పడుకునే ముందు మరిగే నీటిలో 4, 5 చుక్కలు యూకలిప్టస్‌ ఆయిల్‌ వేసి ఆవిరి పట్టాలి. త‌ద్వారా చాలా కంట్రోల్ అవుతుంద‌ట‌.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News