కోమలమైన పెదవుల కోసం..

          

Last Updated : Nov 12, 2017, 04:03 PM IST
కోమలమైన పెదవుల కోసం..

ఇది శీతాకాలం. ఈ కాలంలో చలికి పెదవులు పగలడం, పొడిబారడం సర్వసాధారణమే. కానీ పెదవులు పగలడం పట్టించుకోకపోతే నల్లగా మారే అవకాశం ఉందని బ్యూటీషన్లు అంటున్నారు. కాబట్టి పెదవుల ఆరోగ్యం కోసం ఈ సరళమైన చిట్కాలను పాటించి సమస్యలను తగ్గించుకోండి. 

* చలికాలంలో పెదవులకు బాదంనూనె రాసుకుంటే పెదవులు పగలవు.

* రోజూ రాత్రిపూట పడుకోబోయే ముందు వెన్న, గ్లిజరిన్ కలిపివున్న క్రీమును పెదవులకు రాసుకోవాలి.

* గోరువెచ్చని నెయ్యిని కూడా పెదవులకు రాసుకోవచ్చు లేదా ఆలివ్ ఆయిల్ కూడా రాసుకోవచ్చు.

* పెదవులను పంటితో కోరుక్కోకుండా జాగ్రత్తగా ఉండాలి.

* నల్లగా మారిన పెదవులకు నిమ్మరసం రంగు తీసుకువస్తుంది. 15 పావు గంట తరువాత పదవులను గోరువెచ్చని నీటితో కడిగేయండి.

* కీరదోసకాయ రసాన్ని పెదవులకు పూయండి. దాంతో పెదవులు పొడిబారకుండా మృదువుగా మారుతాయి.

* గులాబీ రేకుల్ని మెత్తగా నూరి పెట్రోలియంజెల్లీ కలపాలి. ఆ మిశ్రమాన్ని పెదవులకు పూసి పావుగంట తరువాత కడిగేయాలి. ఇలా చేస్తే కొన్ని రోజులకు పెదవులు గులాబీరంగుల్లో మారుతాయి.

* రోజుకు రెండుసార్లు మీగడ రాసుకున్నా పెదవులు మృదువుగా తయారవుతాయి.

* రోజూ పెదవులకు కాసింత తేనె రాసినా ఫలితం ఉంటుంది.

Trending News