కిడ్నీ లేదా మూత్రపిండాలు మన శరీరంలో అతి ముఖ్యమైన అవయవం. కిడ్నీలు మన శరీరంలో ఎన్నో పనులను పూర్తి చేయడంలో సహాయపడతాయి. శరీర విధులనిర్వహణలో కీలక పాత్ర పోషిస్తాయి కావున కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుకోవడం ఎంతో ముఖ్యం. ఆరోగ్యకరమైన డైట్ తో పాటు తగిన పరిమాణంలో నీటిని తాగడం ద్వారా కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. తగినంత నీటిని తాగడం ద్వారా కిడ్నీలు దెబ్బ తినే ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు. అంతేకాకుండా కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి కిడ్నీలను డిటాక్స్ చేసుకోవడం చాలా అవసరం. కొన్ని ప్రత్యేకమైన డీటాక్స్ డ్రింక్స్ ను మీ డైట్ లో కలుపుకోవటం ద్వారా కిడ్నీల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. కిడ్నీలను ఏ విధంగా డిటాక్స్ చేయాలో తెలుసుకుందాం.
కిడ్నీ డిటాక్స్ డ్రింక్స్..
యాపిల్ వెనిగర్ తో చేసే డ్రింక్
యాపిల్ సైడర్ వెనిగర్‌లో ఉండే యాంటీ-ఆక్సిడెంట్లు మరియు సిడ్రిక్ యాసిడ్ కిడ్నీలో రాళ్లను కరిగించడంతో పాటు.. టాక్సిన్స్‌ను తొలగించడంలో కూడా సహాయపడుతుంది. అంతేకాకుండా దీని సహాయంతో ఒక డిటాక్స్ డ్రింక్ తయారు చేసుకోవచ్చు, దీన్ని తయారు చేయడానికి ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో ఒక చెంచా ఆపిల్ సైడర్ వెనిగర్ కలిపి.. రోజూ తాగడం ద్వారా కిడ్నీలను డిటాక్సిఫై చేసుకోవచ్చు.
Also Read: Chandrababu Case: ఏసీబీ, హైకోర్టు, సుప్రీంకోర్టులో చంద్రబాబు కేసుల వివరాలు ఇలా
దానిమ్మ జ్యూస్..
దానిమ్మలో తగిన పరిమాణంలో పోటాషియం ఉంటుంది. ఇది కిడ్నీలో రాళ్ల సమస్యని తగ్గించడంలో ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఇందులో ఉండే ఎన్నో గుణాలు కిడ్నీలో రాళ్లు తయారీని కూడా ఆపుతుంది. కావున రోజూ తాజా దానిమ్మ జ్యూస్ ని తాగడం కిడ్నీలకు ఎంతో ఉపయోగకరం.
బీట్ రూట్ జ్యూస్..
బీట్ రూట్ జ్యూస్ లో బీటైన్ ఉంటుంది, ఇది చాలా ప్రయోజనకరమైన ఫైటోకెమికల్. ఇందులో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉంటాయి. కావున రోజు బీట్ రూట్ జ్యూస్ తాగడం ద్వారా కిడ్నీలు డిటాక్స్ అవ్వడంతో పాటు కిడ్నీల్లో రాళ్లు ఏర్పడే ప్రమాదం కూడా తగ్గుతుంది.
Also Read: Samsung Galaxy F04 Price: Samsung Galaxy F04పై స్పెషల్ డీల్..రూ.1,499కే పొందండి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook