Blood Circulation Improving Fruits: మనశరీర ఆరోగ్యానికి రక్తప్రసరణ ఎంతో ముఖ్యం. బ్లడ్ సర్క్యూలేషన్ కు ఏ అడ్డంకి లేకుండా జాగ్రత్తపడాలి. కొన్ని రకాల పండ్లు తీసుకోవడం వల్ల రక్తప్రసరణ మెరుగుపడుతుంది. అవేంటో తెలుసుకుందాం.ఆరోగ్య నిపుణుల ప్రకారం కొన్ని రకాల పండ్లలో రక్తప్రసరణను మెరుగుపరిచే లక్షణం ఉంటుంది. ఇవి రక్తనాళాలను రిలాక్స్ చేసి సాగేలా చేస్తుంది. ఇంకా ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది. ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు కార్డియోవాస్క్య్యూలర్ సిస్టంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. దీంతో బ్లడ్ ప్రెజర్ కూడా సాధారణంగా ఉంటుంది.
బ్లూబెర్రీ..
బ్లూబెర్రీల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఆంథోసియానైన్స్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇవి రక్తనాళాల పనితీరును మెరుగుపరుస్తాయి. అంతేకాదు గుండె సంబంధిత సమస్యలను రాకుండా నివారిస్తాయి. బ్లూబెర్రీల్లో విటమిన్ సీ, ఫైబర్ అధికంగా ఉంటుంది ఈ రెండు కూడా బ్లడ్ సర్క్యూలేషన్‌కు ఎంతో ముఖ్యం.
విటమిన్ సీ..
విటమిన్ సీ ఉండే పండ్లు కూడా రక్తనాళాలను బలపరిచేలా సహాయం చేస్తాయి. అంతేకాదు ఇవి కొల్లాజెన్ ఉత్పత్తికి కూడా ప్రేరేపిస్తాయి. ఇందులో ఉండే ఫ్లేవనాయిడ్స్ రక్తసరఫరాను మెరుగుపరుస్తాయి. ఇన్ఫ్లమేషన్ సమస్యను తగ్గిస్తుంది.
ఇదీ చదవండి: రాగులతో ఇలా ఈజీగా బరువుతగ్గండి.. వీరు మాత్రం అస్సలు ముట్టకూడదు..
పుచ్చకాయ..
ఇందులో కూడా అమినో యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి, దీన్ని సిట్రల్లైన్ అంటారు. ఇది శరీరంలో ఆర్జినైన్ గా మారుతుంది. ఆర్జినైన్ మన శరీరంలో నైట్రిక్ యాసిడ్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది రక్త సరఫరా మార్గాన్ని విస్తరింపజేసి రక్తనాళాలను రిలాక్స్ చేస్తుంది. దీంతో రక్తప్రసరణ మెరుగవుతుంది. పుచ్చకాయలో ఉండే లైకోపీన్లో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది ఇది గుండె ఆరోగ్యానికి ఎంతో మంచిది.
దానిమ్మ..
దానిమ్మలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటుంది. అంతేకాదు రక్తప్రసరణను పెంచే పాలిఫెనల్స్ ఉంటాయి.
ఇది బ్లడ్ సర్క్యూలేషన్‌ను పెంచుతాయి. బ్లడ్ ప్రెజర్ సమస్యను కూడా దానిమ్మ తగ్గిస్తుంది. దానిమ్మ కూడా మన శరీరంలో నైట్రిక్ యాసిడ్‌ను ఉత్పత్తి చేస్తుంది.
ఇదీ చదవండి: చిలగడదుంప అద్భుతాలు.. దీని లాభాలు తెలుస్తే అసలు వదలరు !
కీవీ..
కీవీల్లో కూడా విటమిన్ సీ, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఫ్లేవనాయిడ్స్, కెరోటినాయిడ్స్ కూడా ఉంటాయి. ఇది రక్తనాళాలకు ఆక్సిడేటివ్ డ్యామేజ్ కాకుండా కాపాడతాయి. వాటిని మరింత ఆరోగ్యవంతం చేయడానికి తోడ్పడతాయి.
సమతుల ఆహారం..
సమతుల ఆరోగ్యకరమైన ఆహారం మన డైట్లో చేర్చుకుంటే రక్తప్రసరణ మెరుగవ్వడమే కాదు. ఏ ఇతర అనారోగ్య సమస్యలు కూడా దరిచేరకుండా ఉంటాయి. ఇవి పాటిస్తూ కొన్ని ఆరోగ్యకరమైన ఎక్సర్‌సైజులు చేస్తే సరిపోతుంది.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook