Strong Bones: ఎముకల బలహీనత వల్ల శరీరం డొల్లగా మారుతుంది. అనేక రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే ఎముకలు దృఢంగా మారాలంటే క్యాల్షియంతో పాటు మరెన్నో పోషకాలు శరీరానికి అవసరమవుతాయి. క్యాల్షియం అధిక మోతాదులో నాన్‌వెజ్ వంటకాల్లో లభిస్తుంది. అయితే పూర్తిగా వెజ్ తినే వారికి ఈ మూడు రకాల ఆహారాల్లో లభిస్తుంది. ఆ ఆహారాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. వీటిని పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరూ వీటిని హాయిగా తీసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
నువ్వులు:
నువ్వుల గింజలను మన ఇళ్లలో ఎక్కువగా వినియోగిస్తూ ఉంటారు. వీటిని చలి కాలంలో అధికంగా ఉపయోగిస్తారు. నువ్వులను సాధారణంగా స్వీట్లు, లడ్డులు, గజక మొదలైన వాటిలో ఎక్కువగా వాడతారు.
అయితే వీటిని క్రమం తప్పకుండా వినియోగిస్తే శరీరంలో ఎముకలను బలోపేతం చేస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. నువ్వులలో కాల్షియం, ఫాస్పరస్ పుష్కలంగా ఉండటం వల్ల ఎముకలను దృఢంగా చేస్తాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
పచ్చి పప్పులు:
పచ్చి పప్పులలో ఎముకలకు అనుకూలమైన పోషకాలతో సమృద్ధిగా ఉంటాయి. అంతేకాకుండా వీటిలో మెగ్నీషియం, ఫాస్పరస్, కాల్షియం పుష్కలంగా లభిస్తాయి. ఇవి ఎముకలకు పోషణనిచ్చి వాటిని లోపల నుంచి దృఢంగా చేస్తాయి.
రాగి గింజలు (Ragi Seeds):
రాగి గింజల్లో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. కావున వెన్నునొప్పితో బాధపడుతున్న మహిళలకు ఉపశమనాన్ని కలిగిస్తుంది. ఈ విత్తనాలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరంలో ఎముకల సమస్యలు దూరమవుతాయి.
(NOTE: ఇక్కడ అందించిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also Read: Benefits of Jamun Fruit: వేసవిలో నేరేడు తింటే స్పెర్మ్ కౌంట్ అమాంతం పెరుగుతుంది!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.
Strong Bones: ఎముకల సమస్యలతో బాధపడుతున్నారా.. అయితే వీటిని క్రమం తప్పకుండా తినండి..!
ఎముకల సమస్యలతో బాధపడుతున్నారా..
నువ్వులను క్రమం తప్పకుండా తినండి
దీని వల్ల ఎముకలు దృఢంగా మారుతాయి