Stomach Gas Remedies: గ్యాస్ ట్రబుల్ సమస్య నుంచి ఉపశమనం పొందడానికి వీటిని తప్పకుండా పాటించండి..!

How To Get Rid Of Stomach Gas: మారుతున్న జీవన శైలి అనుగుణంగా ఆహారంలో మార్పులు వస్తున్నాయి. దీని కారణంగా పొట్టలో వివిధ రకాల సమస్యలు ఏర్పడుతున్నాయి. అయితే ప్రస్తుతం గ్యాస్ ట్రబుల్ సమస్య పెరిగిందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : May 14, 2022, 12:43 PM IST
  • గ్యాస్ ట్రబుల్ సమస్యకు చెక్‌ పెట్టడాని 5 మార్గాలు
  • గ్యాస్‌ ఫామ్‌ అవ్వడాని కారణాలు
  • సోపు గింజల ద్వారా గ్యాస్ ట్రబుల్ సమస్యకు చెక్‌
Stomach Gas Remedies: గ్యాస్ ట్రబుల్ సమస్య నుంచి ఉపశమనం పొందడానికి వీటిని తప్పకుండా పాటించండి..!

How To Get Rid Of Stomach Gas: మారుతున్న జీవన శైలి అనుగుణంగా ఆహారంలో మార్పులు వస్తున్నాయి. దీని కారణంగా పొట్టలో వివిధ రకాల సమస్యలు ఏర్పడుతున్నాయి. అయితే ప్రస్తుతం గ్యాస్ ట్రబుల్ సమస్య పెరిగిందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఈ సమస్యను మహిళల కంటే పురుషులు ఎక్కువగా ఎదుర్కొంటున్నారని అధ్యాయనాలు పేర్కొన్నాయి. ఈ గ్యాస్ ట్రబుల్ సమస్యను  చిన్న సమస్యగా భావిస్తారు. కానీ ఇది పెద్ద పెద్ద సమస్యలకు దారి తీసే అవకాశాలున్నాయని నిపుణులు అంటున్నారు.

పొట్టలో గ్యాస్‌ ఫామ్‌ అవుతే ఇవి తప్పవు:

కడుపులో గ్యాస్ అధికంగా ఫామ్‌ కావడం వల్ల హాయిగా కూర్చోవడం కష్టం అవడమే కాకుండా.. చేసే పనులపై దృష్టి తొలగిపోయే అవకాశాలున్నాయి. ఇలువంటి పరిస్థితిలో ఈ సమస్యకు కారణాలేంటో తెలుసుకొని సమస్యకు చెక్ పెట్టడం మంచిది.

కడుపులో గ్యాస్‌ ఫామ్‌ అవ్వడాని కారణాలేంటి:

అందరికి ఉదయం నిద్రలేచిన వెంటనే ఖాళీ కడుపుతో టీ తాగడం అలవాటు. దీనిని అందరు 'బెడ్ టీ' గా పిలుస్తారు. ఏమీ తినకుండా టీ తాగడం వల్ల ఎసిడిటీ రావడమే కాకుండా.. పొట్టలో గ్యాస్ సమస్యలు వస్తాయి. అంతేకాకుండా టైమ్‌కు నిద్ర పోకపోవడం వల్ల జీర్ణక్రియ సమస్య మొదలై గ్యాస్ ట్రబుల్ సమస్యగా మారుతుంది.

గ్యాస్ ట్రబుల్ సమస్య నుంచి ఇలా విముక్తి పొందదండి:

1. సోపు గింజలను నీటిలో కలుపుకొని తాగడం వల్ల పొట్టకు సంబంధించిన అవాంతరాలు తొలగిపోతాయి. ఇందుకోసం రాత్రిపూట సోపు నీటిలో నానబెట్టి.. ఉదయాన్నే వడపోసి ఆ నీటిని తాగాలి.
2. ఆయిల్, స్పైసీ ఫుడ్ తినడం మానుకోండి. ఇవే కాకుండా ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్‌కి దూరంగా ఉండటం మంచిది.
3. పుదీనా నీటిని తాగడం, దాని ఆకులను నమలడం వల్ల వేసవి కాలంలో చాలా ఉపశమనం లభిస్తుంది.
4. చిన్న పాత్రలో నీళ్లు పోసి అందులో అల్లం వేసి మరిగించి గోరువెచ్చగా అయ్యాక తాగాలి.
5. రోజు కొద్ది సేపు నడవాలి.

(నోట్‌: ఇక్కడ అందించిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)

Also Read: Hands Symptoms: ఈ లక్షణాలు గోళ్లలో కనిపిస్తే ప్రమాదమే..!!

Also Read: Summer Drinks: ఎండాకాలంలో తీసుకోవాల్సిన జ్యూస్‌లు, వీటిని తయారుచేసుకోవడం చాలా ఈజీ..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

 

Trending News