Skin Glowing Foods: చర్మం నిగనిగలాడాలని కోరుకుంటున్నారా.. అయితే క్రమం తప్పకుండా వీటిని తినండి..!

Skin Glowing Foods: అందరూ ఆరోగ్యకరమైన, అందమైన, స్పష్టమైన చర్మాన్ని కోరుకుంటారు. దీని కోసం మార్కెట్ లో వివిధ రకాల ప్రొడక్ట్ లభిస్తున్నాయి. కానీ ఇవి ఆశించిన ఫలితాలను అను ఇవ్వలేక పోతున్నాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 17, 2022, 05:58 PM IST
  • చర్మ సౌందర్యం కోసం డార్క్ చాక్లెట్ ని తినండి
  • ఇందులో అనేక పోషక విలువలు ఉంటాయి
  • బొప్పాయి పండు కూడా చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది
  Skin Glowing Foods: చర్మం నిగనిగలాడాలని కోరుకుంటున్నారా.. అయితే క్రమం తప్పకుండా వీటిని తినండి..!

Skin Glowing Foods: అందరూ ఆరోగ్యకరమైన, అందమైన, స్పష్టమైన చర్మాన్ని కోరుకుంటారు. దీని కోసం మార్కెట్ లో వివిధ రకాల ప్రొడక్ట్ లభిస్తున్నాయి. కానీ ఇవి ఆశించిన ఫలితాలను అను ఇవ్వలేక పోతున్నాయి. అయితే ఈ అంశంపై ఆరోగ్య నిపుణులు కొన్ని రకాల అధ్యయనాలు చేశారు. శరీరానికి పోషక విలువలు అందించే ఆహారం తీసుకుంటేనే చర్మ సౌందర్య వంతంగా ఉంటుందని తేలింది. శరీరం ఆరోగ్యంగా ఉంటేనే చర్మం ఆరోగ్యంగా ఉంటుందని అధ్యయనాలు పేర్కొన్నాయి. చర్మ పరిరక్షణకు కోసం, సౌందర్యం కోసం పలురకాల కూరగాయలను క్రమం తప్పకుండా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఈ కూరగాయలు అనేక రకాల విటమిన్లు ఉండడం వల్ల చర్మానికి ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆ కూరగాయలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

టమోటా :

టొమాటోల్లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. అంతేకాకుండా వీటిలో ప్రోటీన్, మినరల్స్, లైకోపీన్‌తో నిండి ఉంటాయి. ఇవి చర్మాన్ని మెరుగ్గా చేసేందుకు సహాయపడతాయి.

బొప్పాయి :

చర్మ సంరక్షణ కోసం మరో మంచి ఆహారం బొప్పాయి పండు. ఇది చర్మాన్ని శుభ్రంగా చేసి.. మొటిమలు రాకుండా రక్షిస్తుంది. బొప్పాయిలో పపైన్ అనే పదార్థం ఉంటుంది. కావున ఇది చాలా ప్రభావవంతగా చర్మాన్ని మృదువుగా, కాంతివంతంగా చేస్తుంది. ముఖ్యంగా చనిపోయిన చర్మ కణాలను సులభంగా తొలగిస్తుంది. 

డార్క్ చాక్లెట్ :

 కోకో పౌడర్‌లో యాంటీఆక్సిడెంట్లు అధిక పరిమాణంలో ఉంటాయి. ఇది చర్మానికి అనేక రకాలుగా మేలు చేస్తుంది. కేవలం  కోకో పౌడర్‌తో లభించే డార్క్ చాక్లెట్లే చర్మానికి మంచిది. మార్కెట్లో లభించే ఇతర ఉత్పత్తులు ఆరోగ్యానికి హాని కలిగించవచ్చు.

 దోసకాయ:

దోసకాయను వాటర్ ప్యాక్డ్ ఫుడ్ గా పిలుస్తారు. ఇది చర్మానికి చాలా ఆరోగ్యకరమైనది. ఇది చర్మాన్ని తేమగా ఉంచి.. చల్లదనాన్ని ఇస్తుంది. అంతేకాకుండా ముడతలు పడకుండా కాపాడుతుంది.

Also Read: Tulsi Uses And Benefits: తులసి మొక్క తరుచుగా ఎండిపోతుందా.. అయితే ఇలా చేయండి..!

Also Read: Secunderabad Agnipath Protests: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో అల్లకల్లోలం.. అంతా ప్రీ-ప్లాన్డ్‌ గానే జరిగిందా..?

 

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x