Bad Cholesterol : కొలెస్ట్రాల్ తో ఇబ్బందులు పడుతున్నారా.. ఈ ఫుడ్స్ తింటే చాలు..

Cholesterol Tips : ఈమధ్య మారిపోయిన లైఫ్‌స్టైల్‌, చెడు ఆహార అలవాట్ల వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. ముఖ్యంగా చిన్న వయసులోనే గుండె సమస్యలు కూడా వస్తున్నాయి. చాలా వరకు గుండె సంబంధిత వ్యాధులు అధిక కొలెస్ట్రాల్‌‌‌‌‌ వల్లే వస్తాయి. కానీ చిన్న టిప్స్ ఫాలో అవుతూ ఉంటే మన శరీరం లో పేరుకుపోయి ఉన్న చెడు కొలెస్ట్రాల్ ను మనం కంట్రోల్ చేయచ్చు.   

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Apr 24, 2024, 11:32 AM IST
Bad Cholesterol : కొలెస్ట్రాల్ తో ఇబ్బందులు పడుతున్నారా.. ఈ ఫుడ్స్ తింటే చాలు..

Healthy Lifestyle: కొలెస్ట్రాల్ మనం తీసుకునే ఆహారం నుంచీ, శరీరం లోపలా తయారవుతుంది. శరీరంలో కొలెస్ట్రాల్ లివర్‌లో తయారవుతుంది. సంతృప్త కొవ్వు, ట్రాన్స్ ఫ్యాట్స్‌ ఎక్కువగా ఉండే ఆహారంలో కొలెస్ట్రాల్‌ ఎక్కుగా ఉంటుంది. ఆహారం ద్వారా పొందే కొలెస్ట్రాల్ మనం తీసుకునే పాలు, పాలపదార్థాలు, మాంసాహారం, చేపలు, గుడ్లులోని పచ్చసొన నుంచి అందుతుంది. పాల ఉత్పత్తులు, నూనెలలో సంతృప్త కొవ్వు ఎక్కువగా ఉన్నందున... వాటిని తక్కువగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. 

శరీరం లో అధిక కొలెస్ట్రాల్ ఉంటే గుండె ఆరోగ్యానికి చాలా ప్రమాదం. గుండె జబ్బులు, స్ట్రోక్ వచ్చే ప్రమాదం కొలెస్ట్రాల్ వల్లే ఎక్కువగా ఉంటుంది. కానీ మన ఆహార అలవాట్లలో కొన్ని మార్పులు చేర్పులు చేస్తే మన బాడీ లో కొలెస్ట్రాల్ ను కూడా కంట్రోల్ చేయవచ్చు.

రోజూ వెల్లుల్లి తీసుకుంటే కొలెస్ట్రాల్ 10% తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. వెల్లుల్లిలో ఉండే విటమిన్ బి 6, విటమిన్ సి, ఫైబర్, మెగ్నీషియం, కాల్షియం, ప్రోటీన్ బరువు తగ్గటంలో కూడా దోహద పడతాయి. రోజుకు 500 నుంచి మిల్లీ గ్రాముల వెల్లిల్లి మాత్రం తీసుకుంటే చాలు. మంచి రిజల్ట్ ఉంటుంది.

స్పూన్‌ ధనియాలు నీళ్లలో వేసి కాసేపు మరిగించి వడగాట్టి తాగితే కూడా కొలెస్ట్రాల్‌ మీద ప్రభావం ఉంటుంది. అందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు అధిక కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తాయి. అందులో ఉండే ఫోలిక్ యాసిడ్, విటమిన్ సి, విటమిన్ ఎ, బీటా కెరోటిన్, కాపర్, జింక్‌, ఐరన్‌ గుండె ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తాయి. 

రాత్రి మొత్తం మెంతులను నీళ్ళల్లో నానబెట్టి ఉదయం ఆ నీళ్ళను తాగితే కొలెస్ట్రాల్ తగ్గుతుంది. మెంతులలో ఉండే స్టెరాయిడ్ సపోనిన్లు కొలెస్ట్రాల్ పెరగడాన్ని నెమ్మదిస్తాయి. అంతేకాకుండా మెంతుల్లో ఫైబర్, ఐరన్, విటమిన్ ఎ, డి కూడా పుష్కలంగా ఉన్నాయి కాబట్టి అది జీర్ణ శక్తిని పెంచి శరీరంలో పేరుకుని ఉన్న కొవ్వును కరిగిస్తుంది. 

తృణధాన్యాలు కూడా కొలెస్ట్రాల్ ను నియంత్రిస్తాయి. తృణధాన్యాల వల్ల డయాబెటిస్‌ కంట్రోల్‌ అవుతుంది. బరువు కూడా సహజంగా తగ్గుతాం సహాయపడతాయి. తృణధాన్యాలలో అధికంగా ఉండే ఫైబర్ కొలెస్ట్రాల్, గుండె జబ్బులు, అధిక బరువు, టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాలను రాకుండా తొలగిస్తుంది. 

క్యాబేజీ, క్యాలీ ఫ్లేవర్, బ్రోకలీ, టొమాటో, క్యాప్సికమ్‌, క్యారెట్, ఆకు కూరలతో పాటు ఉల్లిపాయలు కూడా మన ఆహారంలో చేర్చుకోవాలి. ఈ కూరగాయలలో ఫైబర్, ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి అలాగే క్యాలరీ లు తక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ కాయగూరలు తినటం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది.

మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కొన్నిసార్లు కొలెస్ట్రాల్ స్థాయి పెరుగుతుంది. అలాంటప్పుడు అనారోగ్యం మొదలవుతుంది. అందుకే కొలెస్ట్రాల్ కి సంబంధించిన లక్షణాలు కనిపించినా వెంటనే డాక్టర్ ను కలవడం మంచిది.

Read More: Taslima Mohammad:సోషల్ మీడియాలో బిల్డప్ లు.. తస్లీమా మహమ్మద్ ఆస్తులు చూసి కళ్లు తేలేస్తున్న ఏసీబీ అధికారులు..

Read More: Smita Sabharwal: వరల్డ్ బుక్ డే... వైరల్ గా మారిన స్మితా సబర్వాల్ చేసిన లేటెస్ట్ ట్వీట్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

 

Trending News