Body Pains: తీవ్రమైన ఒంటి నొప్పులు, అలసట నుంచి క్షణాల్లో ఉపశమనం

Body Pains: ఒంటి నొప్పులనేవి తీవ్రమైన సమస్యగా మారుతుంటాయి. సాధారణంగా తీవ్రమైన అలసట కారణంగానే ఈ పరిస్థితి ఉంటుంది. అయితే ఈ ఒంటి నొప్పుల్ని దూరం చేసే సులభమైన చిట్కాల గురించి తెలుసుకుందాం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Aug 3, 2022, 10:48 PM IST
Body Pains: తీవ్రమైన ఒంటి నొప్పులు, అలసట నుంచి క్షణాల్లో ఉపశమనం

Body Pains: ఒంటి నొప్పులనేవి తీవ్రమైన సమస్యగా మారుతుంటాయి. సాధారణంగా తీవ్రమైన అలసట కారణంగానే ఈ పరిస్థితి ఉంటుంది. అయితే ఈ ఒంటి నొప్పుల్ని దూరం చేసే సులభమైన చిట్కాల గురించి తెలుసుకుందాం..

రోజువారీ పని ఒత్తిడి, లేదా ఎక్కువగా తిరగడం వల్ల తీవ్రమైన ఒంటి నొప్పులు, అలసట ఎదురౌతుంటాయి. సాధారణంగా ఈ పరిస్థితి వృద్ధుల్లో ఎక్కువగా కన్పిస్తుంటుంది. కానీ ప్రస్తుతం చెడు లైఫ్‌స్టైల్, చెడు ఆహారపు అలవాట్లకారణంగా వయస్సుతో సంబంధం లేకుండా అందరికీ ఎదురౌతోంది. మీకు కూడా ఇదే పరిస్థితి ఉంటే..ఒళ్లు నొప్పులతో బాధపడుతుంటే వైద్యుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. కొన్ని సులభమైన చిట్కాలతో ఒంటి నొప్పులు, అలసట నుంచి ఉపశమనం పొందవచ్చు..

అలసట, ఒంటి నొప్పులకు చిట్కాలు

1. పసుపు అద్భుతంగా పనిచేస్తుంది. పసుపులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. పాలలో కలిపి పసుపు తీసుకోవడం వల్ల ఒంటి నొప్పులు దూరమవడమే కాకుండా..అలసట కూడా పోతుంది. హాయిగా నిద్రపడుతుంది. 

2. మరో పద్దతి బాడీ మస్సాజ్. దీనివల్ల శరీరంలోని మాంసకృతులకు ఉపశమనం కలుగుతుంది. దీనికోసం ఆవాల నూనె లేదా కొబ్బరి నూనెతో బాడీ మస్సాజ్ చేస్తే మంచి ఫలితాలుంటాయి. ఒంటి నొప్పులు, అలసట దూరమౌతాయి.

3. తీవ్రమైన అలసట అనేది డీహైడ్రేషన్ లక్షణాల్లో ఒకటి. శరీరంలో నీటి శాతం తక్కువైతే డీహైడ్రేషన్ సమస్య ఏర్పడుతుంది. నీళ్లు ఎక్కువగా తాగడం వల్ల డీ హైడ్రేషన్ సమస్య తొలగడమే కాకుండా..అలసట పోతుంది. 

4. ఇక మరో పద్ధతి అల్లం. అల్లంలో అద్భుతమైన యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలుంటాయి. వీటివల్ల అలసట లేదా ఒంటినొప్పుల నుంచి ఉపశమనం పొందవచ్చు. పరగడుపున నేరుగా కొద్గిగా నిమ్మరసం, ఉప్పు తగిలించి తినవచ్చు లేదా టీ రూపంలో తినవచ్చు.

Also read: Monkeypox Vaccine: మంకీపాక్స్ వ్యాక్సిన్ విషయంలో సీరమ్ ఇనిస్టిట్యూట్ కీలక ప్రకటన

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News